Sunday, 28 October 2012

[YSR Congress Party] వైఎస్సార్‌సీపీలోకి తరిమెల శరత్ చంద్రారెడ్డి

 తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ తరిమెల శరత్‌చంద్రారెడ్డి ఈ నెల 29న వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. అనంతపురం నగరంలో షర్మిల పాదయాత్ర సందర్భంగా వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. 

ఈయన శింగనమల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరుపొందిన కపార్ట్ మాజీ రీజనల్ చైర్మన్, దివంగత తరిమెల శేషానందరెడ్డి సోదరుడు. నియోజకవర్గంలో టీడీపీ నుంచి బల మైన నాయకుడిగా పేరు పొందారు. 50 ఏళ్ల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. మహానేత వైఎస్‌తో సన్నిహిత సంబంధాలుం డేవి. ఈయనతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, ఇద్దరు మాజీ ఎంపీపీలు, 19 మంది మాజీ ఎంపీటీసీ సభ్యులు, 22 మంది మాజీ సర్పంచులు వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.