[YSR Congress Party] అచ్చంగా రాజన్నలా..
హైదరాబాద్,
న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి ఆరు పాటలతో
రూపొందించిన సీడీ ప్రజలను ఆకట్టుకుంటోంది. గురువారం రాత్రి వేంపల్లెలో
వైఎస్సార్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల ఈ పాట ల సీడీని
ఆవిష్కరించారు. ‘‘అచ్చంగా రాజన్నలా.. ఉన్నడే జగనన్నా..’’ అనే పాట
పాదయాత్రలో మార్మోగుతోంది. ‘‘ప్రస్థానం.. ప్రస్థా నం.. ప్రస్థానం...
శర్మిలమ్మ చేపట్టిన మరో ప్రస్థానం..’’ పాటకు జనం నుంచి మంచి స్పందన
వస్తోంది. కుర్చీ కోసం చంద్రబాబు ‘వస్తున్నా-మీ కోసం’ యాత్ర పేరుతో ప్రజలకు
వద్దకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తుంటే.. ‘ఇందిరమ్మ బాట’ తో
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడంటూ సాగే పాటలకు మంచి ఆదరణ
వచ్చింది.