Sunday, 21 October 2012

[YSR Congress Party] అనంతలో షర్మిల యాత్ర షెడ్యూల్ ఖరారు


అనంతపురం: జిల్లాలో షర్మిల చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ను వైఎస్ఆర్ సీపీ నాయకులు ఖరారు చేశారు. అనంతపురంలో షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ను ఎమ్మెల్యేలు భూమన, గుర్నాథరెడ్డి లు ప్రకటించారు. అక్టోబర్ 23న మధ్యాహ్నం నుంచి జిల్లాలో షర్మిల పాదయాత్ర మొదలుపెడుతారన్నారు. అనంతపురం జిల్లాలో 15 రోజులపాటు 190 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నాయకులు వెల్లడించారు. ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.