Monday, 22 October 2012

[YSR Congress Party] బాబు విశ్వసనీయత లేని నేత: మేకపాటి

నెల్లూరు: చంద్రబాబు తొమ్మిది సూత్రాల ప్రణాళికను టీడీపీ కార్యకర్తలే నమ్మడం లేదని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విశ్వసనీయత లేని నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని మేకపాటి విమర్శించారు. అధికారం కోసం ఆఖరి యాత్రగా పాదయాత్రను ఎంచుకున్నారని.. చంద్రబాబును తెలంగాణవాదులు అడ్డుకోవాలనుకోవడం సరికాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా పాదయాత్రలు చేయవచ్చని.. తెలంగాణ సమస్య ఢిల్లీలో తేల్చాల్సిన అంశమని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు తప్పుచేశారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.