Wednesday, 17 October 2012

[YSR Congress Party] వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు


తిరుపతి: తిరుచానూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర వైఎస్ఆర్ కుటుంబానికి పేటెంట్ హక్కు అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాపీకొట్టారన్నారు. ప్రజల కడగండ్లు తుడవడానికే షర్మిలమ్మ పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. పాదయాత్ర సజావుగా జరగడానికి దేవదేవుణ్ని కోరుకోవడానికి తిరుమల వచ్చినట్లు తెలిపారు.