ప్రకాశం:
షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత
బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సినిమా డైరెక్షన్‌లో చంద్రబాబు చేసే
పాదయాత్ర ఓ నాటకం, కాంగ్రెస్‌తో కుమ్మక్కైనందుకే చంద్రబాబు అవిశ్వాసం
పెట్టడం లేదని బాలినేని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్,
టీడీపీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపడనవసరం లేదన్నారు. కుమ్మక్కు
రాజకీయాలకు ప్రజలే బుద్ధిచెబుతారని బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు.