Saturday, 6 October 2012

ktrao[YSR Congress Party] వైఎస్ఆర్ సీపీ నేతల సమావేశం

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భేటీలో చర్చించిన అంశాలను పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.