శ్రీకాకుళం:
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు
రాబర్డ్ వాద్రాపై న్యాయవిచారణకు ఆదేశించాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ను టిడిపి నేత ఎర్రంనాయుడు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు.
అవినీతి ఆరోపణల విచారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి
జగన్మోహన రెడ్డికి ఒక న్యాయం, రాబర్ట్ వాద్రాకు ఒక న్యాయమా? అని ఆయన
ప్రశ్నించారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయస్థానంలో కేసు వేస్తామని ఆయన
చెప్పారు.