వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం
మధ్యాహ్నం విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు,
కార్యకర్తలు, పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా
నరసన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్
కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించనున్నారు. కృష్ణదాస్ తల్లి సావిత్రమ్మ ఈనెల
4వ తేదీన చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ పోలకి
మండలం మబుగాంలో కృష్ణదాస్ ఇంటికి వెళ్లి ఆకుటుంబాన్ని పరామర్శించనున్నారు.