ఊసులో లేకుండా పోతామన్న కాంగ్రెస్, టీడీపీల భయమే కారణం
ఎమర్జెన్సీని తలదన్నిన సాక్షి ఖాతాల స్తంభన, ప్రకటనల నిలిపివేత
ఫక్తు రాజకీయ కక్షసాధింపు కోణంలో సాగుతున్న సీబీఐ దర్యాప్తు
పొంతనే లేని వాదనలతో చార్జిషీట్లను వండివారుస్తున్న దర్యాప్తు సంస్థ
వైఎస్, జగన్‌లను ఎలాగోలా అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యం
రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి మరీ పారిశ్రామికవేత్తలను వేధిస్తున్న వైనం
ఎమ్మార్, ఓఎంసీ.. కేసు ఏదైనా అసలు టార్గెట్ మాత్రం జగనే..
వాస్తవాలను యథాతథంగా వార్తలుగా మలుస్తూ, ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతూ, వారి ఆదరణతో తిరుగులేని రీతిలో దూసుకెళ్తున్న తెలుగు వారి మనస్సాక్షిపై.. నిత్యం ఎన్ని కుట్రలు! అడుగడుగునా ఎన్నెన్ని కుతంత్రాలు!! ఇటు అధికార పార్టీ. అటు పచ్చ పార్టీ. వాటికి పక్క దరువు వేస్తూ.. మూర్తీభవించిన పైత్యం వంటి పచ్చ మీడియా. కక్షసాధింపు చర్యలు, నేలబారు ఆరోపణలు, రొడ్డకొట్టుడు రాతలతో అనునిత్యం ఎందుకీ ముప్పేట దాడి! అసలు సాక్షిని చూస్తే వీరికి ఎందుకింత కంటగింపు? కేసుల ముసుగులో సాక్షిపై జరుగుతున్న కక్షసాధింపులు, వాటి సాకుతో కొనసాగుతున్న తీవ్రస్థాయి విష ప్రచారం లోగుట్టును, వాటి వెనక దాగున్న అసలు వాస్తవాలను విజ్ఞులైన పాఠకుల ముందుంచుతున్నాం...
- సాక్షి ప్రత్యేక ప్రతినిధి
కేసు వివరాల్లోకి వెళ్లే ముందు దీని పూర్వాపరాల్ని కొంచెం ప్రస్తావించాల్సి ఉంటుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. 2008 మార్చి 23న ‘సాక్షి’ పత్రిక ప్రారంభమయింది. 2009లో వైఎస్ మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అదే ఏడాది... అంటే 2009 సెప్టెంబర్ 2న విమాన దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు.
యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతి చెందింది. ఆ విషాదాన్ని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దుర్ఘటన స్థలం వద్ద తండ్రికి నివాళులర్పించిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి... మృతుల కుటుంబాల్ని ఓదార్చటానికి రాష్ట్రమంతటా పర్యటిస్తానన్నారు. ఆ మాట ప్రకారం ‘ఓదార్పు యాత్ర’ ఆరంభించారు. చాలామంది కాంగ్రెస్ నేతలు ఈ యాత్ర వద్దని చెప్పారు. చివరికి అధిష్టానం కూడా ఆంక్షలు పెట్టింది. అయినా జగన్ పట్టించుకోలేదు. యాత్రను కొనసాగించారు. ఇంతలో... అంటే 2010 అక్టోబర్లో కాంగ్రెస్‌కే చెందిన ఎమ్మెల్యే పి.శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టడం వల్లే పలు సంస్థలు, వ్యక్తులు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, దానిపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు. ఈ లేఖపై కనీసం తేదీగానీ, సంతకం గానీ లేవు. కాంగ్రెస్‌లో అంతర్గతంగా విమర్శలు, దాడులు పెరగటంతో పార్టీలో తానిక ఇమడలేనంటూ 2010 నవంబర్ 29న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చేశారు.
రాష్ట్రంలో మొదలుపెట్టిన ఓదార్పు యాత్రను కొనసాగిస్తానని చెబుతూ... ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇది జరిగిన 3 రోజులకే... అంటే 2010 డిసెంబర్ 2న ఆదాయపు పన్ను శాఖ జగతి పబ్లికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది. జగతి సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులన్నిటినీ ఆదాయంగా పరిగణిస్తూ... దానిపై పన్ను చెల్లించాలని వాటిలో పేర్కొంది. ‘సాక్షి’ దాన్ని కోర్టులో సవాల్ చేసింది. న్యాయ పోరాటం మొదలైంది. ఇంతలో... అంటే జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నెలన్నర తరవాత 2011 జనవరి 24న శంకర్రావు లేఖను తనంతట తానే సుమోటోగా విచారణకు తీసుకుంటున్నట్లు హైకోర్టు స్పష్టంచేసింది. ప్రతివాదులకు... అంటే జగతి సంస్థకు, జగన్‌మోహన్‌రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేసింది. విశేషమేంటంటే ఈ మధ్యలోనే కోర్టుకు లేఖ రాసిన శంకర్రావు మంత్రి అయ్యారు. రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మృతుల కుటుంబాలను ఓదార్చటానికి యాత్ర చేస్తాననటం జగన్ చేసిన తప్పా?
ఇచ్చిన మాట ప్రకారం అధిష్టానం వద్దన్నా యాత్రను కొనసాగించటం తప్పా?
ఆయన నాయకుడిగా ఎదుగుతున్నాడని భయపడి కొందరు కాంగ్రెస్ నాయకులు
అధిష్టానం సాయంతో ఆయన్ను అణిచే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనిపించటం లేదా?
అధిష్టానం నయానోభయానో దారికి తెచ్చుకునే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనిపించటం లేదా?
ఆయన రాజీనామా చేసిన 3 రోజులకే ‘సాక్షి’కి ఐటీ శాఖ నోటీసులిచ్చిందంటే అర్థమేంటి?
టీడీపీ వచ్చి చేరింది
శంకర్రావు రాసిన ఐదు పేజీల లేఖ ఆధారంగా 2011 జనవరి 24న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులివ్వగా... తరువాతి వారానికి అంటే 2011 జనవరి 31న శంకర్రావు కోర్టుకు కొన్ని పత్రాలు సమర్పించారు. తన లేఖకు ఆధారాలన్నారు. తరవాత ఫిబ్రరి 9న శంకర్రావు మరో అఫిడవిట్ దాఖలు చేశారు. తన లేఖకు మరిన్ని ఆధారాలంటూ 333 పేజీల డాక్యుమెంట్లు సమర్పించారు.
ఇది జరిగిన నెల రోజులకే... అంటే మార్చి 14న ఈ కేసులో తమను కూడా వాదులుగా చేర్చుకోవాలంటూ తెలుగుదేశం నేతలు కె.ఎర్రన్నాయుడు, పి.అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్రావు దాఖలు చేసిన పత్రాల్నే వీరూ దాఖలు చేశారు. చిత్రమేంటంటే కొన్ని పేజీలు శంకర్రావు పిటిషన్లో వేసినవి యథాతథంగా ఈ పిటిషన్లో కూడా వచ్చి చేరాయి. పేజీ నంబర్లతో సహా, ఆయా పేజీలపై రాసుకున్న రఫ్ రాతలతో సహా అన్నీ శంకర్రావు, తెలుగుదేశం నేతల పిటిషన్లలో పునరావృతమయ్యాయి.
వై.ఎస్.జగన్‌ను వేధించటానికి కాంగ్రెస్, తెలుగుదేశం ఒక్కటయ్యాయని చెప్పటానికి ఇంతకన్నా ఆధారాలు కావాలా?
తమ టార్గెట్ జగన్‌మోహన్‌రెడ్డి కనుక కాంగ్రెస్ అధిష్టానం, తమ టార్గెట్ ‘సాక్షి’ కనుక టీడీపీ ఒక్కటయ్యాయని తెలియటం లేదా?
ఇద్దరూ వేర్వేరు కేసులు దాఖలు చేస్తే ఓకే. కానీ ఇద్దరూ ఒకే పత్రాల్ని పంచుకుని మరీ వేశారంటే, శంకర్రావు పిటిషన్ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైందంటే విషయం తెలియటం లేదా?
ఎమర్జెన్సీని తలదన్నిన సాక్షి ఖాతాల స్తంభన, ప్రకటనల నిలిపివేత
ఫక్తు రాజకీయ కక్షసాధింపు కోణంలో సాగుతున్న సీబీఐ దర్యాప్తు
పొంతనే లేని వాదనలతో చార్జిషీట్లను వండివారుస్తున్న దర్యాప్తు సంస్థ
వైఎస్, జగన్‌లను ఎలాగోలా అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యం
రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి మరీ పారిశ్రామికవేత్తలను వేధిస్తున్న వైనం
ఎమ్మార్, ఓఎంసీ.. కేసు ఏదైనా అసలు టార్గెట్ మాత్రం జగనే..
వాస్తవాలను యథాతథంగా వార్తలుగా మలుస్తూ, ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతూ, వారి ఆదరణతో తిరుగులేని రీతిలో దూసుకెళ్తున్న తెలుగు వారి మనస్సాక్షిపై.. నిత్యం ఎన్ని కుట్రలు! అడుగడుగునా ఎన్నెన్ని కుతంత్రాలు!! ఇటు అధికార పార్టీ. అటు పచ్చ పార్టీ. వాటికి పక్క దరువు వేస్తూ.. మూర్తీభవించిన పైత్యం వంటి పచ్చ మీడియా. కక్షసాధింపు చర్యలు, నేలబారు ఆరోపణలు, రొడ్డకొట్టుడు రాతలతో అనునిత్యం ఎందుకీ ముప్పేట దాడి! అసలు సాక్షిని చూస్తే వీరికి ఎందుకింత కంటగింపు? కేసుల ముసుగులో సాక్షిపై జరుగుతున్న కక్షసాధింపులు, వాటి సాకుతో కొనసాగుతున్న తీవ్రస్థాయి విష ప్రచారం లోగుట్టును, వాటి వెనక దాగున్న అసలు వాస్తవాలను విజ్ఞులైన పాఠకుల ముందుంచుతున్నాం...
- సాక్షి ప్రత్యేక ప్రతినిధి
కేసు వివరాల్లోకి వెళ్లే ముందు దీని పూర్వాపరాల్ని కొంచెం ప్రస్తావించాల్సి ఉంటుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. 2008 మార్చి 23న ‘సాక్షి’ పత్రిక ప్రారంభమయింది. 2009లో వైఎస్ మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అదే ఏడాది... అంటే 2009 సెప్టెంబర్ 2న విమాన దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు.
యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతి చెందింది. ఆ విషాదాన్ని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దుర్ఘటన స్థలం వద్ద తండ్రికి నివాళులర్పించిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి... మృతుల కుటుంబాల్ని ఓదార్చటానికి రాష్ట్రమంతటా పర్యటిస్తానన్నారు. ఆ మాట ప్రకారం ‘ఓదార్పు యాత్ర’ ఆరంభించారు. చాలామంది కాంగ్రెస్ నేతలు ఈ యాత్ర వద్దని చెప్పారు. చివరికి అధిష్టానం కూడా ఆంక్షలు పెట్టింది. అయినా జగన్ పట్టించుకోలేదు. యాత్రను కొనసాగించారు. ఇంతలో... అంటే 2010 అక్టోబర్లో కాంగ్రెస్‌కే చెందిన ఎమ్మెల్యే పి.శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టడం వల్లే పలు సంస్థలు, వ్యక్తులు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, దానిపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు. ఈ లేఖపై కనీసం తేదీగానీ, సంతకం గానీ లేవు. కాంగ్రెస్‌లో అంతర్గతంగా విమర్శలు, దాడులు పెరగటంతో పార్టీలో తానిక ఇమడలేనంటూ 2010 నవంబర్ 29న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చేశారు. రాష్ట్రంలో మొదలుపెట్టిన ఓదార్పు యాత్రను కొనసాగిస్తానని చెబుతూ... ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇది జరిగిన 3 రోజులకే... అంటే 2010 డిసెంబర్ 2న ఆదాయపు పన్ను శాఖ జగతి పబ్లికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది. జగతి సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులన్నిటినీ ఆదాయంగా పరిగణిస్తూ... దానిపై పన్ను చెల్లించాలని వాటిలో పేర్కొంది. ‘సాక్షి’ దాన్ని కోర్టులో సవాల్ చేసింది. న్యాయ పోరాటం మొదలైంది. ఇంతలో... అంటే జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నెలన్నర తరవాత 2011 జనవరి 24న శంకర్రావు లేఖను తనంతట తానే సుమోటోగా విచారణకు తీసుకుంటున్నట్లు హైకోర్టు స్పష్టంచేసింది. ప్రతివాదులకు... అంటే జగతి సంస్థకు, జగన్‌మోహన్‌రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేసింది. విశేషమేంటంటే ఈ మధ్యలోనే కోర్టుకు లేఖ రాసిన శంకర్రావు మంత్రి అయ్యారు. రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.