Sunday, 13 May 2012

అభిమానం ముందు సూరీడు చిన్నబోయాడు

మండుటెండలోనూ జననేతకు నీరా‘జనం’
పేరుపేరునా పలకరించి ఆకట్టుకున్న వై.ఎస్.జగన్ 
కాంగ్రెస్, టీడీపీ కుట్రలపై ప్రసంగాలు
సంక్షేమ పథకాల వైఫల్యాలపై ఆవేదన 
అభిమాన వర్షంతో తడిసి ముద్దయిన రాజన్న బిడ్డ

అభిమానం ముందు సూరీడు చిన్నబోయాడు. ఉదయం నుంచి ఉక్కపోత. పొద్దెక్కే కొద్దీ భగభగ మండే ఎండ. కాలు బయట పెట్టాలన్నా మనసొప్పని వేడి తీవ్రత. అలాంటి సమయంలో రాజన్న తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక. ఒక్కసారిగా జనంతో రోడ్లు, మిద్దెలు కిక్కిరిసాయి. ఆయన మాట.. ఆప్యాయ పలకరింపుతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సూరీడు మేఘాల చాటుకు వెళ్లిపోగా.. అభిమానం జల్లులై కురిసింది.

కర్నూలు, న్యూస్‌లైన్: పిల్లలు.. పెద్దలే కాదు.. సరిగ్గా నడవలేని అవ్వాతాతలు సైతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం మండుటెండలో బారులుతీరారు. వారి ప్రేమ, ఆప్యాయతలకు ఆయనా ఉప్పొంగిపోయారు. జననేత ఏ గ్రామానికి వెళ్లినా ఇలాంటి దృశ్యాలే. కనిపించిన వారందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ప్రజల యోగక్షేమాలే తనకు ముఖ్యమంటూ వారి మనసు గెలుచుకున్నారు. ప్రజలు సైతం ఈలలు, కేరింతలు, చప్పట్లతో ఆయనను ఉత్సాహపరిచారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.


పజలు అడుగడుగునా నిరాజనం పలికారు. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి గువ్వలదొడ్డి, పెద్దమర్రివీడు, చిన్నమర్రివీడు, అలువాల, ఏనుగుబాల, దైవందిన్నె, పొనకలదిన్నె, టి.సోమలగూడూరు, మిట్టసోమాపురం, నాగలదిన్నె గ్రామాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పేదలు, రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే వారి కోసం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానికి మద్దతిచ్చి ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన ఎర్రకోట చెన్నకేశవ రెడ్డిని గెలిపించాని విజ్ఞప్తి చేశారు. నేతల్లో రెండు రకాలుంటారని.. ప్రజలు ఏమైనా తమకేం అనుకునే వాళ్లు మొదటి రకం వారైతే.. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం తమ పదవులను సైతం త్యాగం చేసే నేతలు రెండో రకమన్నారు. తమ పదవులు పోతాయని తెలిసీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన 17 మంది ఎమ్మెల్యేలే అసలైన నాయకులని కొనియాడారు. 

పస్తుతం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ లాంటి సంక్షేమ పథకాల పనితీరు ఎలా అధ్వాన్నంగా తయారైందో ప్రజలకు వివరించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా మూగ, చెవిటి చిన్నారులకు మాట, వినికిడి రప్పించడానికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సను దివంగత వైఎస్ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏలుతున్న వారు డబ్బు మిగుల్చుకునేందుకు ఆంక్షలు విధించి 2 ఏళ్లలోపు వయస్సున్న బాలలకు మాత్రమే చికిత్స చేస్తుండడంపై జగన్ తీవ్ర ఆవేదనతో చేసిన ప్రసంగాలు ప్రజలను కదిలించాయి.

ఆ చిన్నారులు ఇక జీవితాంతం చీకటిలోనే ఉండిపోవాలా? ఆ పిల్లల తల్లిదండ్రుల ఆవేదన తీరదా? అని సంధించిన ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేశాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ లేకుండా కుట్రపన్నుతున్న తీరును జగన్ ఉదహరించగా ప్రజలు ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా గట్టిగా నినాదానాలు చేశారు. చనిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి, తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా సాగిస్తున్న దురాగతాలను ప్రజలకు వివరించారు. సాక్షి పత్రికను మూసివేయించడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలూ ఇందులో భాగమేనని పేర్కొన్నా రు. 

పతి పేదవాడి కోసం.. రైతు కోసం.. విశ్వసనీయత కోసం.. నిజాయతీతో కూడిన రాజకీయాల కోసం ప్రజలు తమ ఓటును వినియోగించి రాష్ట్రంలో రైతులు పడుతున్న ఆగచాట్లను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో పాలిస్తున్న కాంగ్రెస్ పెద్దలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు భూమా నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షులు జగన్‌మోహన్ రెడ్డిలు జగన్‌తో పాటు రోడ్‌షోల్లో పాల్గొన్నారు. మం త్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తదితరులు జగన్‌ను ఎర్రకోటలోని సెయింట్ జాన్స్ కళాశాల అతిథిగృహంలో కలిసి మాట్లాడారు.


అవ్వా బాగున్నావా..? అమ్మా బాగున్నావా..? అంటూ జగన్‌మోహన్‌రెడ్డి పలకరింపులకు ఎర్రకోట గ్రామ మహిళలు పులకించిపోయారు. పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి తరఫున శనివారం ఆయన సొంతూరు ఎర్రకోటలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహించారు. చెన్నకేశవరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మహిళలు ఎండను సైతం లెక్కచేయకుండా పిల్లలను చంకనెత్తుకొని జగన్‌కోసం రోడ్లపై వేచి చూడడం కనిపించింది. చాలా మంది చెట్లు, మిద్దెలు ఎక్కి నిల్చున్నారు. చిన్నారులు పార్టీ జెండాలు, టోపీలతో జగన్‌ను చూసేందుకు వచ్చారు. జగన్ ప్రసంగం అయిపోయేంత వరకు వృద్ధులు సైతం అలాగే ఆలకిస్తూ నిల్చుండిపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి వారందరికీ అభివాదం చేసి ప్రసంగించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 108 తదితరవాటిని గురించి ప్రస్తావించినప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 


ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండల పరిధిలోని పెద్దమరివీడు, చిన్నమరివీడు, అలువాల గ్రామాల్లో పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజ నం పలికారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు, పిల్లలు తేడా లేకుండా మిద్దెలపెకైక్కి ఆయనను చూసేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా జగన్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ రోడ్‌షో కొనసాగించారు. ఆయా గ్రామాల్లో ప్రజల కోరి క మేరకు బస్సు దిగి కిందకు వచ్చి వృద్ధులు, మహిళలో మాట్లాడారు. ‘వచ్చేది మన ప్రభుత్వమే.. సమస్యలన్నీ తీరిపోతాయి.. వైఎస్సార్ కాలంనాటి స్వర్ణయుగం మళ్లీ వస్తుంది. చెన్నకేశవరెడ్డికి ఓటు వేసి గెలిపించండి’అంటూ ముందుకు సాగారు.