Monday, 14 May 2012

17,18 తేదీల్లో రైల్వేకోడూరులో జగన్ పర్యటన,19న ఒంగోలులో ప్రచారం


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17, 18 తేదీల్లో రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలి పారు. ఈ రెండు రోజులూ జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు తరఫున ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని ఆయన వివరించారు. 19నఒంగోలు శాసనసభా నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫున జగన్ ప్రచారం చేస్తారని చెప్పారు.