వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం నుంచి కర్నూలు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి, ఎమ్మిగనూరులో ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి పోటీ చేస్తున్నారు. శనివారం ఎమ్మిగనూరు మండలం ఎర్రకోటలో జగన్ ప్రచారాన్ని ప్రారంభిస్తారని, 16న ఆళ్లగడ్డలో ప్రచారాన్ని ముగిస్తారని పర్యటన సమన్వయకర్త, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి వెల్లడించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 12, 13, 14 తేదీల్లో ప్రచారం నిర్వహించాక ఆళ్లగడ్డ నియోజకవర్గం చేరుకుంటారు. అక్కడ 14, 15తేదీల్లో ప్రచారాన్ని నిర్వహిస్తారు.