Thursday, 17 May 2012

నేడు రైల్వేకోడూరులో జగన్ రోడ్‌షో

 వైఎస్ జగన్ శుక్రవారం రైల్వేకోడూరులో రోడ్‌షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ కొండారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రైల్వేకోడూరులో ముస్లిం నాయకులతో జగన్ సమావేశమవుతారు. అనంతరం అమ్మవారిశాల, గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఓబులవారిపల్లె మండలంలో పర్యటిస్తారని వైఎస్ కొండారెడ్ది తెలిపారు.

10.30 గంటలకు ఆర్. రాచపల్లె, 11.45కు వై.కోట, 12.15కు సున్నపురాళ్లపల్లె, 12.45కు చెన్నరాజుపోడులో క్షత్రియులతో సమావేశం, మధ్యాహ్నం 1.30 గంటలకు మంగంపేటలో భోజనం, అనంతరం 2.30 కు కొర్లకుంట, 3.00 గంటలకు ముక్కవారిపల్లె, 4.00 గంటలకు ఓబులవారిపల్లె, సాయంత్రం 5.00 గంటలకు రైల్వేకోడూరు రోడ్‌షోలో వైఎస్ జగన్ పాల్గొంటారన్నారు.