ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆళ్లగడ్డ పట్టణం, మండలం, చాగలమర్రి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. పర్యటన వివరాలను టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి.రఘురామ్, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి విడుదల చేశారు. జననేత బుధవారం ఆళ్లగడ్డలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి పట్టణంలోని సదాం కాలనీ నుంచి ఆర్టీసీ బస్టాండ్, అభిరుచి హోటల్ మీదుగా ఎస్వీ నగర్ రెండవ రోడ్డు, రామలక్ష్మీ కొట్టాలకు చేరుకుంటారు.
ఎస్వీ నగర్ ఒకటవ రోడ్డు మీదుగా ఎల్‌యం కాంపౌండ్ ఏరియాలో పర్యటన ఉంటుంది. సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం పాత మసీదు మీదుగా బొరుగుల బట్టీ ప్రాంతం వరకు రోడ్‌షో కొనసాగిస్తారు, అనంతరం ఆళ్లగడ్డ మండలంలోని ఓబుళంపల్లి, యాదవాడ, క్రిష్ణాపురం, కోటకందుకూరు, చింతకొమ్మదిన్నె అదేవిధంగా చాగలమర్రి మండలం రాంపల్లి, నెలంపాడు, గొట్లూరు, మల్లెవేముల, చాగలమర్రి, చింతలచెరువు, పెద్దవంగలి, చిన్న వంగలి గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు.