Sunday, 13 May 2012

వైఎస్ జగన్ నేటి పర్యటన ఇలా...


ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.చెన్నకేశవరెడ్డి తరఫున ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో రోడ్‌షోలతో పాటు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జగన్ పర్యటన వివరాలను అభ్యర్థి కె.చెన్నకేశవరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె.రఘురామ్, జిల్లా అడ్‌హాక్ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డిలు వివరించారు.