Wednesday, 16 May 2012

సాక్షికి మద్దతుగా ఐటీ ఉద్యోగుల నిరసన

సాక్షి పత్రిక, చానల్‌పై జరుగుతున్న అప్రజాస్వామిక దాడులను నిరసిస్తూ హైదరాబాద్‌లోని వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు బుధవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు చేత పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ కమిటీ కన్వీనర్ సి.మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.