Friday, 11 May 2012

12 నుంచి కర్నూలు జిల్లాలో జగన్ ప్రచారం

కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 12వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ జిల్లాలో జగన్ ఈనెల 16వ తేదీవరకూ ప్రచారం నిర్వహిస్తారన్నారు. 12,13,14 తేదీల్లో ఎమ్మిగనూరు, 15,16 తేదీల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జగన్ ప్రచారం చేస్తారని తెలిపారు.