కర్నూలు,
న్యూస్‌లైన్ ప్రతినిధి: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాల్గో రోజు మంగళవారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆళ్లగడ్డ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి విజయం కోసం
శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాల్లో పర్యటించనున్నారు. రోడ్‌షోలతో
పాటు పలు చోట్ల ప్రసంగిస్తారు. పర్యటన వివరాలను టూర్ ప్రోగ్రాం
కోఆర్డినేటర్ టి.రఘురామ్, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి విడుదల చేశారు.జననేత జగన్ మంగళవారం ఉదయం నంద్యాలలోని పార్టీ నేత ఎ.వి.సుబ్బారెడ్డి ఇంటి నుంచి బయలు దేరి శిరివెళ్ల మండలం గోవిందపల్లె చేరుకుంటారు. అనంతరం శిరివెళ్ల ఎస్సీ కాలనీ, వెంకటాపురం, ఎర్రగుంట్ల, రుద్రవరం మండలంలోని పేరూరు, బి.నాగిరెడ్డిపల్లి, రుద్రవరం, కొత్తూరు, చందలూరు, మందలూరు, ఆళ్లగడ్డ మండలంలోని జంబులదిన్నె, పడకండ్ల గ్రామాల్లో రోడ్‌షోలతో పాటు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి బయలు దేరి ఆళ్లగడ్డ చేరుకుంటారు.