Friday, 28 December 2012

[YSR ] నాన్నా.. జగన్‌సార్‌ని చూడాలని ఉంది!

నేను వైఎస్సార్ అభిమానిని. వారి కుటుంబమంటే చాలా అభిమానం. జగన్ సార్ అంటే మా ఇంటిల్లిపాదికీ ఇష్టం. మా అబ్బాయి వయసు ఏడేళ్లు. నాలుగేళ్లప్పటినుండే జగన్ సారంటే మా అబ్బాయికిష్టం. సాక్షి టీవీలో వచ్చిన ఓదార్పుయాత్రలో జగన్‌సార్ చూసి మా అబ్బాయికి జగన్ సార్ అంటే అభిమానం పెరిగింది.

ఈ దిశలో ఓరోజు మా అబ్బాయి నన్ను, ‘నాన్నా! నన్ను జగన్ సార్ దగ్గరికి తీసుకెళ్లు’ అని అడిగాడు. అలాగేనని, పులివెందులకు జగన్‌సార్ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్లాను. అప్పుడు జగన్‌సార్ నన్ను చూసి, ‘బాషా! ఈ అబ్బాయి ఎవరు?’ అని అడిగారు. నేను, ‘మా అబ్బాయి సార్. మీరంటే వీడికి చాలా ఇష్టం. మిమ్మల్ని చూడాలంటే తీసుకొచ్చాను’ అన్నాను. ‘అవునా? నీ పేరేంటి బాబు?’ అంటే... ‘నా పేరు సాహైల్ సార్’ అన్నాడు మా బాబు. అప్పుడు సార్ మా బాబుని ఎత్తుకున్నారు. నేను మా అబ్బాయిని ‘సార్ చెయ్యి ఎలా ఊపుతారు?’ అని అడిగితే, చెయ్యి పెకైత్తి ‘ఇలా ఊపుతారు’ అని చూపించాడు. వాణ్ని చూసి జగన్‌సార్ ముద్దాడారు. జగన్‌సార్ అంత బిజీగా ఉండి కూడా అభిమానులను నిరాశపరచకుండా మా అబ్బాయితో ఫొటో దిగారు. అందుకేనేమో జగన్‌సార్ అంటే చిన్నపిల్లలకి అంత ఇష్టం.

ఇప్పుడు జగన్‌గారు టీవీలో ఓదార్పుయాత్రకు ఎందుకు రావటం లేదని మా అబ్బాయి అడుగుతున్నాడు. ఆయన తొందరగా బయటకు వచ్చి మళ్లీ యాత్ర చేపట్టాలని మా ప్రార్థన. ఇది మా ఒక్కరి కోరిక కాదు, రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్, జగన్ అభిమానులు, చిన్నపిల్లలు... అందరిదీ. ఆ సమయం కోసం మేమందరం దేవుణ్ని ప్రార్థిస్తూ ఎదురుచూస్తున్నాం.
- ఎస్. అల్లాబక్ష్
పులివెందుల, వైఎస్సార్ జిల్లా


జగనన్న వస్తాడు రాజన్న రాజ్యం తెస్తాడు

రాజన్న పరమపదించిన తర్వాత కొన్ని రోజులకు జగనన్న నల్లకాలువలో ఒక మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం రాజన్న కోసం అసువులు బాసినవారి కుటుంబాలను కలుసుకోవడానికి ఓదార్పుయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ఓదార్పుతో ఎన్నో బాధిత హృదయాలు సేదతీరాయి. మనసులో ఎటువంటి కల్మషమూ లేని జగన్‌ను ప్రజలు తమ కుటుంబ సభ్యునిగా ఆదరించారు. అయితే సోనియా ఈ యాత్రకు పర్మిషన్ ఇవ్వకపోగా, ఆటంకాలు కల్పించడం కోసం జగనన్న కుటుంబాన్ని వేధింపులకు గురిచేసింది. అందుకు సీబీఐను ఆయుధంగా ఉపయోగించింది.

సీబీఐకి తోడు టీడీపీ, ఎల్లో మీడియా జగన్‌పై అసత్య ప్రచారాలు చేస్తూ విశృంఖల విహారం చేస్తున్నాయి. అయినప్పటికీ జగన్‌ను చూసి సోనియా ఎందుకు భయపడుతోందంటే ఆయన సహనం, ఓర్పు భవిష్యత్తులో కాంగ్రెస్‌కు మనుగడ లేకుండా చేస్తాయని. జగన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను ప్రజలు ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఓటు అనే ఆయుధంతో టీడీపీ, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్తారు. ప్రజలందరూ జగనన్న రాకకోసం ఎదురుచూస్తున్నారు. మంచి ఎల్లప్పుడూ చెడును జయిస్తుంది. త్వరలో జగనన్న బయటకు వచ్చి రాజన్న రాజ్యం అందిస్తాడు.