Friday, 28 December 2012

[YSR ] తెలుగుతల్లి విగ్రహం వద్ద భూమన నిరసన

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తీరుకు నిరనసగా తిరుపతిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఆందోళన చేపట్టారు. తెలుగు భాషాభిమానులు తెలుగు తల్లి విగ్రహంవద్ద నల్లజెండా కట్టి నిరసన తెలిపారు. కాగా భూమన నిరసన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.