Saturday, 22 December 2012

[YSR ] విశాఖలో జగన్ కోసం 'జనం సంతకం'


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు విశాఖపట్నంలో కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. మహిళలు పెద్ద ఎత్తున కోటిసంతకాల సేకరణలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా కేంద్రంలోని కొందరు అడ్డుకుంటున్నారని ప్రజలు మండిపడ్డారు. అన్యాయంగా వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టారని విమర్శించారు. కోటి సంతకాలను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని వైఎస్ జగన్ అభిమానులు తెలిపారు.