Friday, 28 December 2012

[YSR ] వైఎస్ఆర్ సిపిలో చేరిన జెడ్ పి మాజీ చైర్మన్


తూర్పుగోదావరి జిల్లా పరిషత్(జెడ్ పి) మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో ఈరోజు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనతోపాటు రాజోలు నియోజకవర్గ ప్రముఖ కాంట్రాక్టర్ గొల్ల ప్రవీణ్ కుమార్, తాడిపత్రి మునిసిపాలిటీ మాజీ చైర్మన్ నజీర్ సాహెబ్ తనయుడు మున్నాలు చేరారు.