చిత్తూరు
జిల్లాలోని బి.కొత్తకోటలో డిసెంబర్ 16న వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు
వైఎస్ విజయమ్మ పాల్గొనే సభలో టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బి.కొత్త కోటలో
సభ ఏర్పాట్లు పార్టీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్బంగా పలమనేరు
ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సింగిల్ విండో ఎన్నికల్లో
వైఎస్ఆర్ సీపీదే విజయం అని అన్నారు.