[YSR ] సహకార వ్యవస్థను దెబ్బతీయకండి
సహకార
సంఘాలను రాజకీయాలతో నిర్వీర్యం చేయవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు
విభాగం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు
రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, పలు జిల్లాల
కన్వీనర్లు మంగళవారం సీఎంకు లేఖ రాశారు. అంతకుముందు పార్టీ కేంద్ర
కార్యాలయంలో కన్వీనర్ల సమావేశం జరిగింది. సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదు
అర్హత విధానాన్ని మార్చాలనే ప్రభుత్వ నిర్ణయం సహకార వ్యవస్థను దెబ్బతీసేలా
ఉందని, పాత విధానాన్నే కొనసాగించాలని రైతు విభాగం నేతలు లేఖలో కోరారు. ‘పాత
విధానం ప్రకారం సభ్యులుగా చేరాలంటే సొసైటీ పరిధిలో నివాసముండాలి. సభ్యుడి
భూమి ఎక్కడైనా ఉండొచ్చు. సొసైటీ పరిధిలో భూమి ఉన్న వ్యక్తి బయటి గ్రామాల్లో
నివాసమున్నా సభ్యత్వం తీసుకోవచ్చు.అయితే
కొత్త విధానం కింద సభ్యులుగా చేరాలంటే సొసైటీ పరిధిలో నివాసముండాలని, భూమి
సొసైటీ పరిధిలో ఉండాలని నిర్దేశించారు. ఇది అర్ధర హితం’ అని వివరించారు.
నివాస ప్రాంతానికి 5 నుంచి 8 కి.మీ పరిధిలో పక్క గ్రామాల్లో భూములున్న
రైతులు లక్షల్లో ఉన్నారని, ఈ కొత్త విధానంతో వారికి సొసైటీలో రుణం లభించదని
తెలిపారు. నీలం తుపాను బాదితులకు ఇన్‌పుట్ సబ్సిడీ పెంచామని ప్రభుత్వం
చెబుతున్నా వాస్తవానికి పంటనష్టం తగ్గించి రైతులకు అన్యాయం చేశారని
విమర్శించారు. లేఖపై సంతకాలు చేసిన కన్వీనర్లలో వై.మధుసూదన్‌రెడ్డి,
బి.శంకర్‌రెడ్డి, కె.కృష్ణారెడ్డి, ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, మారెడ్డి
సుబ్బారెడ్డి, డీఎస్‌ఎస్‌ఆర్.రాజు, వి.సుబ్బారెడ్డి, పి.ప్రతాపరెడ్డి, మందల
ప్రకాశరావు ఉన్నారు.