[YSR ] కాంగ్రెస్ జేబు సంస్థగా సీబీఐ
ఆళ్లగడ్డ
(కర్నూలు), న్యూస్‌లైన్: స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కాంగ్రెస్
పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి
విమర్శించారు. 28 జీవోలపై సంతకం చేసిన మంత్రులు, అధికారులు తప్పు
చేయనప్పుడు.. వాటిపై సంతకమే చేయని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎలా నిందలు
వేస్తారని ప్రశ్నించారు. ఆళ్లగడ్డలో గురువారం నిర్వహించిన ‘జగన్ కోసం జనం
సంతకాలు’ కార్యక్రమంలో భూమా దంపతులు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఎంజీ, ఎమ్మార్ ఆస్తుల కేసులో సంబంధం ఉన్న
చంద్రబాబును సీబీఐ కాపాడుతోందన్నారు. తన పార్టీ ఎంపీలకు, సెక్యూరిటీ కి
తెలియకుండా ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిసి బాబు రహస్య
ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వస్తున్న
తరుణంలో కాంగ్రెస్, టీడీపీల మధ్య ఉన్న అవగాహన మేరకు సీబీఐతో మరో చార్జిషీట్
వేయించి అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర
పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కోసం కోటి మంది కాదు, కాంగ్రెస్, టీడీపీల నాయకులు తప్ప యావత్తు ఆంధ్ర
రాష్ట్రం సంతకం చేయడానికి సిద్ధంగా ఉంద’న్నారు.