గ్యాస్
సిలిండర్ల పరిమితి ...డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వినూత్న రీతిలో నిరసన తెలిపింది. శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం
కానున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం
ఉదయం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి సైకిల్ రిక్షాల మీద
శాసనసభకు చేరుకున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎడ్లబండిపై
అసెంబ్లీకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమానికి
కార్యకర్తలు భారీగా హజరయ్యారు.