కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ 56వ
జన్మదిన వేడుకలు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానులు,
కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు
తినిపించుకున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ వెన్నంటే ఉండి మహిళలకు ఆదర్శంగా
నిలిచారని కొనియాడారు. మహిళల అభివృద్ధికి విజయమ్మ ఎనలేని కృషి
చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా వైఎస్ విజయమ్మ జన్మదినోత్సవ
వేడుకలను పార్టీ అభిమానులు,కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.