నరసన్నపేట,న్యూస్‌లైన్: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న కళింగ కోమట్లను
బీసీల్లో చేర్పించేందుకు కృషి చేస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కళింగ కోమటి కుటుంబాలు
బీదరికంలో ఉన్న విషయం తనకు తెలుసునన్నారు. తమ పార్టీ అధికార ంలోకి వచ్చిన
తరువాత వెనుకబడిన జాబితా ద్వారా చేకూరే ప్రభుత్వ ఫలాలు వీరికి
వర్తింపజేస్తానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.దివంగత వైఎస్ కళింగ
కోమట్లను బీసీల్లో చేర్పించేందుకు బీసీ కమిషన్ సిఫారుల మేరకు కేబినేట్‌లో
ప్రవేశ పెట్టాలని ఆదేశించారని, అయితే సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటంకం
వచ్చిందన్నారు. ఆ హామీని తాము అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేరుస్తానని
నరసన్నపేటలో బుధవారం సాయంత్రం జరిగిన ఉప ఎన్నికల బహిరంగ సభలో జగన్ హామీ
ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి హామీకి సంఘ ప్రతినిధులు అంధవరపు సూరిబాబు,
ఊన్న వెంకటేశ్వరరావు, రాజశ్రీ, తంగుడు గిరిధరుడు, లాడి కిషోర్, పక్కి
దివాకర్, నారా నాగేశ్వరరావులు కృతజ్ఞతలు తెలియజేశారు.