Monday, 31 December 2012

[YSR ] జగన్ అంటే నమ్మకం

ఈ రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకటైతే, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం రెండోది. రాజన్న ఆశయాల కోసం ప్రజల హృదయాల నుంచి జనించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడోది.
డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనపై రాష్ట్ర ప్రజలు ప్రత్యేక అభిమానాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంచుకున్నారు. కారణం ఆ మహానేత పేద ప్రజల జీవితాలను ప్రత్యేకంగా ప్రభావితం చేయడం. అందుకే 2009లో కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. మహానేత దివంగతులైన తరువాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రజలకు నమ్మకాన్ని, పేదలకు భరోసాను ఇవ్వలేకపోయారు.

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆంధ్రుల అభిమాననటుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రా... కదలిరా... అని పిలిస్తే కోట్లాది జనం ఆయన వెంట నడిచారు. పేద, బడుగు, బలహీనవర్గాల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కాని పార్టీలో నమ్మకంగా ఉండే వ్యక్తే నమ్మకద్రోహానికి పాల్పడి గదె ్దదించితే సింహంలా గర్జించి ప్రజలలోకి వెళ్లి, మళ్లీ అధికారాన్ని తెచ్చుకున్నారు. కాని ఈసారి అయినవాళ్లే మళ్లీ నమ్మకద్రోహానికి పాల్పడి ఎన్టీయార్‌ను గద్దెదించితే, ఆ నేత ‘‘తమ్ముళ్లారా! మోసపోవద్దు’’ అని పిలుపునిస్తే, ఆ నేతపై చెప్పులు వేసి అవమానించి, తన సొంతవారి పార్టీనే హైజాక్ చేసి, ఆ నేత మరణానికి కారణమైన వాళ్లు ఈ రోజున వారసులం అంటున్నారు. చంద్రబాబు 9 సంవత్సరాల పాలనను ప్రజలు చూశారు. అన్ని రంగాలనూ నిర్వీర్యం చేసిన ఈ చంద్రబాబునాయుడే ‘‘మళ్లీ నా మీద నమ్మకం ఉంచండి’’ అని ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ఆయనకు ఆ దురవస్థ ఎందుకు వచ్చింది? అందరినీ ఎప్పుడూ మోసం చేస్తుంటాడనే అభిప్రాయం ప్రజల్లో వచ్చినందుకే కదా. 

ఇక కోట్లాది జనం అనుసరించాలని నిర్ణయించుకున్న పార్టీ... వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ. ‘నీతో నడవడానికి మేం సిద్ధం’ అంటూ జనం ఆయనపై నమ్మకం పెంచుకున్నారు. ప్రజలు... జగన్ తండ్రి అయిన వై.ఎస్.ఆర్.పై ఎంతటి నమ్మకాన్ని పెంచుకున్నారో... ఆయన కుమారుడైన జగన్‌పైనా అంతే నమ్మకాన్ని పెంచుకున్నారు. అప్పట్లో కడప ఎన్నికల ప్రచారంలో డా.వై.యస్.రాజశేఖరరెడ్డి ‘‘యువకుడు, ఉత్సాహవంతుడు ప్రజలకు మేలుచేయడానికి రాజకీయాలలోకి వస్తున్నాడు. మీ కొడుకు లాంటివాడు, మీ తమ్ముడు లాంటివాడు. ఆశీర్వదించి, ఆదరించి అఖండమైన మెజార్టీతో జగన్‌ను గెలిపించండి’’ అని కోరిన మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రజలకు మరిన్ని మేళ్లు చేయడానికి సంసిద్ధులు అవుతున్న క్రమంలో ఆ మహానేత మన నుండి దూరమయ్యారు. తండ్రి చనిపోయిన స్థలం నుండి జగనన్న చెప్పిన మాటే ఈ రోజున వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరించడానికి కారణం. 

ఆ రోజున ఓదార్పుయాత్ర అనే మాటే లేకుంటే ఆజాద్ చెప్పినట్టు జగన్ కేంద్రంలో మంత్రి అయ్యేవారు, ఇప్పటికి ముఖ్యమంత్రి అయ్యేవారు. ఓదార్పు యాత్ర అంటే అది యాత్ర కాదు. నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన ఒక మహాయజ్ఞం. ఎవరైతే ఆ మహానేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయారో ఆ కుటుంబాలను అక్కున చేర్చుకోవడమే ఓదార్పుయాత్ర. ఓదార్పు యాత్ర జగనన్న జీవితగమనాన్నే మార్చివేసింది. కుట్ర, కుతంత్రాలతో కాంగ్రెస్ పెట్టే పరమాన్నం కన్నా ప్రేమ, విశ్వాసం, నమ్మకంతో పేదప్రజలు పెట్టే పెరుగన్నమే మేలని తలచాడు జగనన్న. అందుకే ఆంధ్రరాష్ట్ర ప్రజలు జగనన్నపై నమ్మకాన్ని పెంచుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమకున్న నమ్మకాన్ని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
- షేక్ రఫీ, గుడ్లూరు, ప్రకాశం జిల్లా

ఓర్వలేకే జగన్‌పై నిందలు 

జగన్ పేరు వినగానే ఉప్పొంగని హృదయం ఉండదు. ఏ సభలకైతే ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారో, ఎవరి పేరు వినగానే పనులు, ఉద్యోగాలు మానుకుని ఎదురుచూస్తారో ఆ వ్యక్తే జగన్. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలతోనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకుంటూ ఉంటే, ఆ వ్యక్తిపైన బురద జల్లుతున్నారు! జగన్‌కి ఉన్న ప్రజాదరణను చూసి సహించలేక, సీబీఐ పేరుతో ఆ వ్యక్తిని జైలు పాలు చేశారు! ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు ఆ పార్టీలకు తప్పక గుణపాఠం చెప్తారు. 

[YSR ] వైఎస్సార్ కాంగ్రెస్.. సంచలన విజయాలు


అధికార, ప్రతిపక్షాలు రెండూ కుమ్మక్కై జనం సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో.. ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపైకి దూసుకొచ్చింది. ప్రజల తరఫున ఈ ఏడాది ఎన్నో పోరాటాలు చేసింది. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతున్న పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తప్పుడు కేసులతో నిర్బంధించినా వెరవకుండా పార్టీ శ్రేణులు, నాయకులు ఆత్మ విశ్వాసంతో ఈ ఏడాది ముందుకు నడిచారు. జగన్‌ను అరెస్టు చేస్తే పార్టీ ఉనికి కోల్పోతుందని కాంగ్రెస్, టీడీపీ పన్నిన పన్నాగాలు తలకిందులయ్యాయి. 

గత ఏడాది డిసెంబర్ 4న రైతులు, వ్యవసాయ కూలీల పక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై జగన్ మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలు ఓట్లేసి అనర్హత వేటుకు గురైనా.. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 15 మంది గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ చార్జిషీటులో పెట్టినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2.90 లక్షల మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు.

జనం జగన్ వెంట లేరని, ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం పాలపొంగులాంటిదని సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన నేతలకు ఈ ఫలితాలు దిమ్మ తిరిగేలా చేశాయి. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో కూడా బలీయమైన శక్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రజా సమస్యలపై అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిజమైన ప్రతిపక్ష పాత్రను నిర్వహించింది. జగన్ జైలుకు వెళ్లినా బయట ఉన్న విజయమ్మ పార్టీ బాధ్యతలను మోస్తున్నారు. ఆమె చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్లలో చేనేత దీక్ష, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అమలు చేయాలని కోరుతూ ఫీజు దీక్షను చేశారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా విజయవాడలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇలా అన్ని పోరాటాల్లోనూ ఆమె ముందుంటూ, రాష్ట్రమంతటా పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు స్ఫూర్తి అందిస్తున్నారు. ద్రోహచింతనతో ఉన్న కాంగ్రెస్, విశ్వసనీయత కోల్పోయిన టీడీపీ వ్యవహార శైలితో బేజారెత్తిన పలువురు ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రముఖ నేతలు.. ఆయా పార్టీలను వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా ఏర్పాటైన సభల్లో కూడా విజయమ్మ పాల్గొంటున్నారు. ఇక ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి జగన్ సోదరి షర్మిల ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నుంచి అక్టోబర్ 18న ప్రారంభించిన పాదయాత్ర రాష్ట్రంలో ఒక హైలైట్‌గా నిలిచింది. ఆమె యాత్రలకు జనం విరగబడటాన్ని చూసి ఇతర రాజకీయ పార్టీలు హడలెత్తాయి. రంగారెడ్డి జిల్లాలో ఆమెకు ప్రమాదం సంభవించటంతో తాత్కాలికంగా యాత్రకు అంతరాయం కలిగింది.

[YSR ] పత్రిక యజమాని ఆస్తులపై ఎవరైనా దర్యాప్తు చేశారా..?

ఆ పత్రిక తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తా 
ఓ కేసులో నేను స్టే ఎత్తివేయకపోయినా.. స్టే ఎత్తివేశానని రాసింది 
డైరీ ఆవిష్కరణలో నేను మాట్లాడింది ఒకటి.. ఆ పత్రిక రాసింది మరొకటి 
ఇటువంటి పత్రికలు సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నాయి
న్యాయమూర్తి ఓ చిన్నకారు కొంటే.. దానిని పెద్ద న్యూస్ చేస్తారు 
మరి పత్రిక యజమాని ఆస్తులపై ఎవరైనా దర్యాప్తు చేశారా..?
‘ఆంధ్రజ్యోతి’ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి
ఆ పత్రిక కథనాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు చేపట్టాలి 
ఇవి పునరావృతం కాకుండా చూడాలన్న న్యాయవాది రవిచందర్
దీనిపై బుధవారం నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్న న్యాయమూర్తి

సాక్షి, హైదరాబాద్: తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లు తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రజ్యోతి పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆ పత్రికా యాజమాన్యం గత కొంత కాలంగా తనను లక్ష్యంగా చేసుకుంటూ తప్పుడు కథనాలు ప్రచురిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ పత్రిక సర్క్యులేషన్‌ను పెంచుకునే ఉద్దేశంతోనే ఆ పత్రిక ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 

తన ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఓ భారీ తప్పుడు కథనం ప్రచురించి, తరువాత అది సరికాదని తెలుసుకుని, ‘సారీ’ అంటూ చిన్న అక్షరాలతో ప్రచురించటం అందులో భాగంగానే జరిగిందని ఆయన తెలిపారు. గత వారం జస్టిస్ నర్సింహారెడ్డి వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు కూడా హాజరయ్యారు. ప్రభుత్వంలో వాణిజ్యపన్నుల శాఖ ఎంత కీలకమైందో వివరిస్తూ జస్టిస్ నర్సింహారెడ్డి ప్రసంగించారు. అంతకుముందు చుక్కా రామయ్య తెలంగాణ గురించి మాట్లాడారు. జస్టిస్ నర్సింహారెడ్డి మాత్రం తెలంగాణ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అయితే.. తెలంగాణను ఏ శక్తి ఆపలేదని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఓ పెద్ద కథనం ప్రచురించింది.

దీనిపై సోమవారం ఉదయం 10.30 గంటలకు కోర్టు ప్రారంభం కాగానే సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ ఆంధ్రజ్యోతి కథనం గురించి జస్టిస్ నర్సింహారెడ్డి వద్ద ప్రస్తావించారు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని, ఆ మేర చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై జస్టిస్ నర్సింహారెడ్డి స్పందించారు. ‘‘ఉద్దేశపూర్వకంగానే ఆ పత్రిక గత కొంత కాలంగా నన్ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. రెండు రోజుల కిందట కూడా నేను ఓ కేసులో స్టే ఎత్తివేశానని, దానివల్ల అక్రమాలు జరిగిపోతున్నాయని ఆ పత్రిక రాసింది. వాస్తవానికి నేను ఆ కేసులో స్టే ఎత్తివేయలేదు. డైరీ ఆవిష్కరణలో నేను మాట్లాడింది ఒకటి.. ఆ పత్రిక రాసింది మరొకటి. ఆ పత్రిక ప్రచురించిన తప్పుడు కథనం వల్ల నాకు జరిగిన నష్టం మాటేమిటి..? చిన్న అక్షరాలతో ‘సారీ’ అని చెప్తే సరిపోతుందా..? ఇటువంటి కథనాలను ప్రచురిస్తూ ఆ పత్రిక న్యాయమూర్తులను బెదిరించే రీతిలో వ్యవహరిస్తోంది. ఎందుకంటే న్యాయమూర్తులు బహిరంగంగా పోరాటానికి దిగలేరు కాబట్టి. న్యాయమూర్తులకు ఉన్న పరిమితులను కొన్ని పత్రికలు అడ్డంపెట్టుకుని ఇటువంటి కథనాలు ప్రచురిస్తున్నాయి. 

పత్రికల్లో వచ్చే కథనాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ నాయకులు కూడా న్యాయమూర్తులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత అనేస్తున్నారు. పర్యవసానాల గురించి లెక్క చేయటం లేదు. నా విషయంలో ఆ పత్రిక ఇలా వ్యవహరించటం ఇది మొదటిసారి కాదు. న్యాయమూర్తుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల సంగతి ఏమిటి..? ఇటువంటి పత్రికలు సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఓ న్యాయమూర్తి తన మీద జరిగే ఇటువంటి దాడుల గురించి ఎవరికి చెప్పుకోగలరు? ఎక్కడ చెప్పుకోగలరు? మేం నోరువిప్పలేం కాబట్టి.. ఈ విధంగా లక్ష్యంగా చేసుకుని మరీ దాడులు చేస్తారా..? ఎంత కాలం? ఎప్పటి వరకు ఇలా జరుగుతూ పోతుంది..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రవిచందర్ స్పందిస్తూ.. న్యాయమూర్తుల మౌనాన్నీ వారు చేతగానితనంగా భావిస్తున్నారని, అందువల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించాలని, ఆ సమయం కూడా ఆసన్నమైందని పేర్కొన్నారు. 

తిరిగి జస్టిస్ నర్సింహారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ‘‘ఆ పత్రిక లాంటి వాళ్లు చేతిలో రాళ్లు పట్టుకుని న్యాయమూర్తులపైకి విసురుతున్నారు. ఎందుకంటే న్యాయమూర్తులు గాజు గదుల్లో ఉంటారని వాళ్లకు తెలుసు. రాళ్లు విసిరితే న్యాయమూర్తులు భయపడతారని వాళ్లు అనుకుంటున్నారు. అదే న్యాయమూర్తులు గాజు గదులు వీడి బయటకు వస్తే..? ఓ న్యాయమూర్తి నెల నెలా వచ్చిన జీతంలో ఓ చిన్న కారు కొనుక్కొంటే అది ఓ పెద్ద న్యూస్. ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఆ కారు ఎలా కొన్నారు..? ఇలా ఆరాలు తీస్తూ వార్తలు రాస్తారు. మరి పత్రికా యజమాని గతం ఏమిటి..? ఆయన ఎక్కడ ప్రస్థానం ప్రారంభించారు..? ఇప్పుడు ఏస్థాయిలో ఉన్నారు..? ఇదంతా ఎలా సాధ్యమైంది..? అని ఎవరైనా ప్రశ్నిస్తారా..? ఆస్తులపై ఎవరైనా దర్యాప్తు చేశారా..?’’ అని ప్రశ్నించారు. దీనిని తేలికగా తీసుకోకూడదని, ఈ మొత్తం వ్యవహారాన్ని కోర్టు ధిక్కారంగా తీసుకోవాలని, అది కూడా క్రిమినల్ కోర్టు ధిక్కారంగా పరిగణించాలని, అడ్వొకేట్ జనరల్ సహకారం తీసుకోవాలని న్యాయమూర్తిని రవిచందర్ కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. కోర్టు ధిక్కార అభ్యర్థనపై పునరాలోచించాలని రవిచందర్‌కు సూచించారు. దీనిపై బుధవారం నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం తీరుపై హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

[YSR ] మీ సంతకం కొండంత బలం


* నెలలో దాదాపు 25 రోజుల పాటు జగన్ మీ కోసం మీ మధ్యలోనే ఉన్నారు
* ఈ చేతగాని ప్రభుత్వం, పనికిరాని ప్రతిపక్షం కుమ్మక్కై తనను జైల్లో పెట్టించాయి
* అక్రమంగా నిర్బంధించి ఇవాళ్టికి 219 రోజులైంది..
* బెయిల్ రాజ్యాంగమిచ్చిన హక్కు.. 90 రోజులకు బెయిలివ్వాలనేది నిబంధన
* కానీ చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేసి.. సీబీఐ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది
* అభివృద్ధి, సంక్షేమం, అన్నీ అందరికీ అందాలని వైఎస్ ఎన్నో సంతకాలు చేశారు
* జగన్‌ను మీ వాడిగా భావించి ఒక్క సంతకం చేయండి
* మా కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ఒక్క సంతకంతో ఎదిరించండి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు తమ పట్ల చూపుతున్న ఆదరణ, ఆప్యాయతలే తమ కుటుంబానికి కొండంత అండ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తమ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరూ ఆయన అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ సంతకాలు చేయడానికి ముందుకు రావాలని రాష్ట్ర ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు చేసే ప్రతి సంతకం తమకు తిరుగులేని విజయాన్ని అందిస్తుందన్నారు. నూతన సంవత్సర వేడుకలకు బదులుగా పార్టీ శ్రేణులు ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమం ముమ్మరంగా చేపడుతున్న సంద ర్భంగా ఆమె సోమవారం ప్రజలకు ప్రత్యేకంగా సందేశమిచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఓ అమ్మగా తాను సంతకాలు చేయాల్సిందిగా కోరుతున్నానన్నారు.

విజయమ్మ సందేశం ఆమె మాట ల్లోనే..
‘‘మా కుటుంబాన్ని మీ కుటుంబంగా ప్రేమించే ప్రతి హృదయానికి నేను మనస్ఫూర్తిగా వందనాలు చెబుతున్నా. ఇవాళ, రాష్ట్రమంతటా ‘జగన్ కోసం .. జనం సంతకం’ ఉద్యమం నడుస్తోంది. కుట్రలు, కుతంత్రాలు, నీతిమాలిన అభియోగాలతో జగన్‌బాబును మనందరి నుంచి దూరం చేశారు. నెలలో దాదాపు 25 రోజుల పాటు మీ మధ్య మీతో ఉన్న జగన్‌ను ఈ చేతగాని ప్రభుత్వం, పనికిరాని ప్రతిపక్షం కుమ్మక్కై మోసపూరితంగా, కిరాతకంగా జైలుపాలు చేశాయి. జగన్‌ను అక్రమంగా నిర్బంధించి ఇవాళ్టికి 219 రోజులైంది. నా భర్త వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాణం పోయేంత వరకు ఆయన జీవితాన్ని, ఆయన పదవిని మీ కోసం అంకితం చేశారు. మీ గుండెల్లో పచ్చబొట్టుగా నిలిచిన నా భర్తను దూరం చేసేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇవాళ ఎవరేం మాట్లాడినా, ఏం చేసినా జవాబు చెప్పుకోలేరని ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా పెట్టారు.

ప్రజా కోర్టులో జగన్‌బాబు నిర్దోషి అని చెప్పండి
బెయిల్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు.. 90 రోజు లకు బెయిల్ ఇవ్వాలనేది రూలు. అయితే చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేస్తున్నారు. విచారణ మొదలు పెట్టి ఇవాళ్టికి సుమారు 17 నెలలవుతోంది. విచారణ పూర్తి కాలేదంటూ ఇప్పటికీ సాక్షులను ప్రభావితం చేస్తాడని చెప్పి జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న సీబీఐ వైఖరికి నిరసనగా మిమ్మల్నందరినీ పేరుపేరునా అభ్యర్థిస్తున్నాను. ఇవాళ... రండి...‘జగన్‌కోసం జనం సంతకం’తో ఉద్యమించండి . రాజశేఖరరెడ్డిగారు అభివృద్ధి, సంక్షేమం, అన్నీ అందరికీ అందాలని, ప్రతి గడప గడపకూ అది చేరాలని మీ కోసం ఎన్నో సంతకాలు చేశారు. మీరు మీ మనవడిగా.. మీ కొడుకుగా.. మీ అన్నగా.. మీ తమ్ముడిగా జగన్‌ను భావించి మీరూ సంతకం చేయండి. ఒక్క సంతకం.. తొలి సంతకం మీరు చేయండి. ప్రజాకోర్టులో జగన్‌బాబు నిర్దోషి అని మీ సంతకం మళ్లీ మళ్లీ చెప్పాలని కోరుకుంటున్నా.

మీ కలంతో జవాబు చెప్పండి
ఇవాళ ఒక సంతకం ఓ ఉప్పెనలాగా జగన్‌బాబును జైలు గోడల నుంచి, ఈ కుట్రల నుంచి విముక్తి కలిగిస్తుందని నా నమ్మకం. భర్తను పోగొట్టుకున్న నాకు, కొడుకు దూరమైన నాకు మీ సంతకం కొండంత బలం ఇస్తుందని నమ్ముతున్నాను. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీరు, మీ కుటుంబంతో, మీ సన్నిహితులతో మీ స్నేహితులతో మీ శ్రేయోభిలాషులతో సంతకాలు పెట్టించండి. ఇవాళ జరుగుతున్న ఈ అన్యాయాన్ని మీ కలంతో జవాబు చెప్పండి. ఈ పోరాటంలో అమ్మగా మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ పోరాటంలో మీ సంతకం తిరుగులేని విజయంగా ఉండాలని ఆ దేవ దేవుడిని ప్రార్థిస్తున్నా. మీరు ప్రేమతో, అభిమానంతో పెట్టిన ఈ సంతకాలు, ఇవాళ భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్‌కుమార్ ముఖర్జీ గారికి నివేదనతో అందిద్దాం. జగన్‌బాబును తెచ్చుకుందాం.’’

నూతన సంవత్సర వేడుకలకు దూరం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని అక్రమ నిర్బంధంలో ఉంచినందుకు నిరసనగా పార్టీ సీనియర్లు ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు, నాయకులు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ముఖ్య నేతలు కూడా ఆయా జిల్లాల్లో సంతకాల సేకరణను సమీక్షించారు. జనవరి 1న ఎక్కడా ఎలాంటి ఆడంబరాలకు తావివ్వకుండా జనం వద్దకు వెళ్లాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. 

ఏడు నెలలుగా జగన్‌ను జైలులో ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 1 వేడుకలకు బదులుగా సంతకాల ఉద్యమాన్ని ముమ్మరంగా నిర్వహించాలని నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2013 జనవరి తొలి రోజున జగన్‌కు మద్దతుగా వాడవాడలా సంతకాలు సేకరించడానికి ఎక్కడికక్కడ సిద్ధమవుతున్నారు.

Wish this new year will be for you and me











[YSR ] భస్మాసుర ‘హస్తం’


ఉప ఎన్నికల్లో పరాజయాల పరంపర.. సీనియర్ నాయకుల మధ్య వర్గ పోరు.. మంత్రులు, సీనియర్ల అసమ్మతి రాజకీయాలు.. తెలంగాణ ఎంపీల ఆందోళనలు.. సీనియర్ ఎంపీల అలకలు.. కొందరు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు.. అన్నిటికీ మించి పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు.. 127 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి 2012 సంవత్సరం ముచ్చెమటలు పట్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ పన్నిన కుయుక్తులు భస్మాసుర హస్తంగా మారి ఆ పార్టీనే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. జగన్ లక్ష్యంగా సాగుతున్న క్విడ్ ప్రో కో కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులివ్వగా.. అందులో మోపిదేవి వెంకటరమణ జైలుపాలయ్యారు. మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేయాల్సి వచ్చింది.

అసమ్మతి సెగలు: అసమ్మతి రాజకీయాలకు కొదవే లేదు. ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు జానారెడ్డి, డి.ఎల్.రవీంద్రారెడ్డి వంటి నాయకులు ఏడాది పొడవునా సీఎంపై అసమ్మతి రాజకీయాలు నడిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలైతే అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనంతో ఈ ఏడాది మంత్రి పదవులు దక్కించుకున్న సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులలో రామచంద్రయ్య సీఎంకు వైరి వర్గంగా మారి అవసరమైనప్పుడల్లా అసమ్మతికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు. 

24 స్థానాల్లో 22 ఘోర పరాజయం: ఈ ఏడాది మొత్తం 1 పార్లమెంట్, 24 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో ఘోర పరాజయంపాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 10 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిలపడి రికార్డుల్లోకెక్కింది. తొలుత తెలంగాణ కోసం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లగా కాంగ్రెస్ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. రాజీనామా చేసిన వారిలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు (జూపల్లి కృష్ణారావు, టి.రాజయ్య) కూడా ఉన్నారు. వీరిద్దరూ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. అవిశ్వాస తీర్మానం ఫలితంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 16 స్థానాల్లో ఓటమి పాలైంది. మిగిలిన రెండు స్థానాల్లోనూ ప్రతిపక్ష టీడీపీ సహకారంతో విజయం సాధించి మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలను నిరూపించింది. ఇక జగన్ అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావు, మద్దాలి రాజేష్ అధికార పార్టీకి రాజీనామా చేయటం కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టింది. కాగా మజ్లిస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవటం కాంగ్రెస్‌కు ఈ ఏడాది పెద్ద షాక్.

[YSR ] కాంతి కిరణం కడలి తరంగం


రాష్ట్ర రాజకీయ చరిత్రలో అలుపెరగని పోరాట ధీరుడు, చరిత్రను తిరగరాసిన వ్యక్తి జగన్. ఎందుకంటే నేను ఈ రోజు ఇలా పత్రికాముఖంగా రాస్తున్నానంటే, అంతా వైఎస్సార్‌గారి చలవే! ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ ద్వారా నేను బతికినవాణ్ని. మూడేళ్ల క్రితం నాకు ‘హార్ట్ స్ట్రోక్’ రావడం, ఆసుపత్రిలో చేరడం, ఆరోగ్యశ్రీ ద్వారా అన్నీ చకచకా అమరడం జరిగిపోయాయి. ఆ సమయంలో ఆ వార్డులో అందరూ నాలాంటి వాళ్లే. అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే, నా కళ్లు చెమర్చాయి. నాలాంటి వాళ్లందరూ కలిసి ఆయనకు కన్నీళ్లతో పాదాభిషేకం చేసినా రుణం తీరదు. కాని విధి ఆడిన వింత నాటకంలో ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆ రోజు ఆయన పెట్టిన పథకాలన్నీ ఈరోజు తుంగలోనే తొక్కేస్తున్నారు నేటి రాజకీయ రాబందులు. అందుకే నేనున్నానంటూ ఓ కాంతి కిరణంలా, అల్లూరి సీతారామరాజులా, ఉవ్వెత్తున లేచిన కెరటంలా ప్రజలను ఓదార్చడానికి వస్తున్నానని జగన్ బయలుదేరితే, కొన్ని దుష్టశక్తులు దిగమింగుకోలేక, నానా రకాలుగా ఆయనను ఇబ్బందిపెట్టి, వేధింపులకు గురిచేసి ఆఖరికి జైలుకి పంపించారు.

కాని ఈ నాయకులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. జగన్ సీఎం అయ్యే రోజు వస్తుంది. ఆ రోజుకోసం మాలాంటివాళ్ల వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం. జగనన్నపై ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ రోజు షర్మిల పాదయాత్రకు లభిస్తున్న ఆదరణే సాక్ష్యం. ఆ తల్లి వేసిన ప్రతి అడుగూ నాయకుల గుండెల్లో దడ పుట్టించింది. అలాగే ఆమె వేయబోయే ఒక్కొక్క అడుగూ ప్రతి నాయకుడి గుండెనూ చీలుస్తుంది. ఇది నిజం. త్వరలోనే కాంగ్రెస్ నాయకులు పశ్చాత్తాప్పడే రోజు వస్తుంది. ఒక వ్యక్తిమీద ఇంత కక్ష్యా? ఇంత అమానుషమా? ఎందుకు? ఇంత కుళ్లు, కుతంత్రాలు ఎందుకు? ప్రతి పేదవాడి పక్షాన జగన్ నిలబడ్డాడు. సమయం వచ్చినప్పుడు అదే పేదవాడు ఆయనను అందలం ఎక్కిస్తాడు. ఆ పరిణామానికి ప్రతి రాజకీయనాయకుడు జగన్‌కు దాసోహం అనే రోజు ఎంతోదూరంలో లేదు.
- వాండ్రంగి ప్రసాద్, శ్రీకాకుళం

ప్రజాకోర్టులో జగన్ నిర్దోషి

గత ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైన ఏకైక వ్యక్తి వైఎస్సార్. దేశంలో ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని సంక్షేమ పథకాలు ఆయన అమలు చేశారు. ఇతర ముఖ్యమంత్రులకు ప్రాయులయ్యారు. వై.ఎస్. హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. దురదృష్టవశాత్తూ ఆయన మరణానంతరం రాష్ట్రం అన్నింట్లోనూ అథోగతి పాలై అథమ స్థానానికి దిగజారింది. ప్రజల కష్టసుఖాలు పట్టించుకునే నాథుడే కరువైనాడు. పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ కలిసి జగన్‌ను జైలుకు పంపించేందుకు కుట్ర పన్నాయి తప్ప, ప్రజాసమస్యలపై దృష్టి పెట్టలేదు.

రాజ్యాంగపరంగా మనదేశంలో న్యాయవ్యవస్థకు అత్యున్నత స్థానం ఉంది. అటువంటి న్యాయ వ్యవస్థనే కాంగ్రెస్ నాయకులు తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. సీబీఐని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వం జగన్‌ని దోషిగా నిరూపించాలని ఎంత ప్రయత్నించినా గడిచిన ఉప ఎన్నికల్లో వై.ఎస్.జగన్ నాయకత్వం వహించిన వైఎస్సార్ పార్టీకి ప్రజలు (ప్రజాకోర్టులో) అఖండ మెజార్టీనిచ్చి, జగన్ నిర్దోషి అని నిరూపించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ప్రజాతీర్పే శిరోధార్యం. ఎంతటివారైనా ప్రజాతీర్పుకు కట్టుబడాల్సిందే. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా ప్రభుత్వం, ప్రతిపక్షం ఇకనైనా ప్రజాతీర్పుకు కట్టుబడి, వక్ర బుద్ధి మార్గాలు మాని, కళ్లు తెరవాలని కోరుతూ... త్వరలోనే రాజన్న రాజ్య స్థాపన కోసం జగనన్న నిర్దోషిగా బయటికి రావాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం

[YSR ] ‘జగన్ కోసం..’ సంతకాల వెల్లువ


కార్యక్రమానికి విశేష స్పందన

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు, సీబీఐ పక్షపాత ధోరణికి నిరసనగా ఆ పార్టీ ‘జగన్ కోసం.. జనం సంతకం’ పేరుతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. మహానేత వైఎస్ మరణం, ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ కుట్రలు, కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై ఉప ఎన్నికల ముందు హఠాత్తుగా జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించిన వైనం, ఆ తర్వాత సీబీఐ లీకులు, బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ అబద్ధపు కథనాల డ్రామాలను ప్రజలకు వివరించి.. జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా వారి వద్ద సంతకాలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమం తలపెట్టారు. అయితే ఈ విషయం తెలిసి జనమే స్వచ్ఛందంగా పార్టీ నేతలు, కార్యాలయాల వద్దకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. 

తమ కుటుంబీకులను, సన్నిహితులను, స్నేహితులను తీసుకొచ్చి సంతకాలు చేయిస్తున్నారు. రోడ్లపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండాతో నేతలెవరైనా కనిపిస్తే వచ్చి.. కోటి సంతకాల గురించి ఆరా తీస్తున్నారు. సంతకాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ కార్యక్రమాన్ని మరింత చేరువ చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్.. ఇంటర్నెట్‌లో కూడా సంతకాల సేకరణ ప్రారంభించింది. www.ysrcongress.com సైట్‌లో ఈ సంతకాలకు ప్రత్యేకంగా లింక్ ఏర్పాటు చేసింది. ఈ సైట్‌లోకి వెళ్లి ‘జగన్ కోసం.. జనం సంతకం’ లోగో మీద క్లిక్ చేసి తర్వాత అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించడం ద్వారా ప్రజలు సంతకాలు చేయవచ్చు. 

లేదా www.ysrcongress.com/home/koti_santhakaalu.htm లింక్‌ను నేరుగా బ్రౌజర్‌లో ఓపెన్ చేయడం ద్వారా కూడా ఆ సంతకాల పేజీకి చేరుకోవచ్చు. అడుగున ఉండే రెండు ఆప్షన్లలో (1. కోటి సంతకాల ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని సంతకం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయానికి పంపడం, 2. ఆన్‌లైన్‌లో నేరుగా సంతకం చేయడం) ఏదో ఒక దాని ద్వారా సంతకం చేయవచ్చు. జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21న మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో కోటి సంతకాలు పూర్తయిన తర్వాత.. ఆ పత్రాలను పార్టీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపాలని నిర్ణయించింది.

జననేత కోసం రెహమాన్ నెత్తుటి సంతకం

జననేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహమాన్ జోస్యం చెప్పారు. జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెహమాన్ తన రక్తంతో సంతకం చేసి సంతకాల సేకరణను ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ముస్లింలకు ఉన్నత విద్యలో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం, ఉపకార వేతనాలు ఇప్పించడంతో ప్రస్తుతం ఎందరో మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. అందువల్ల ఆయన తనయుడైన జగన్‌కు రాష్ట్రంలోని మైనారిటీలు అండగా ఉన్నారన్నారు.

[YSR ] మహిళా రక్షణ చట్టాలను సమీక్షించాలి



దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి నిర్భయ మృతి నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించే చట్టాల సమీక్షకు తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. దేశంలో మహిళల రక్షణకు పెనుమార్పులు తేవాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం చాటిచెబుతోందన్నారు. 
యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు అత్యంత గర్హనీయమని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న యువతను ఎలా అదుపు చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందని, మహిళల రక్షణపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. శాంతి భద్రతల కోణంలో ఆలోచించే విషమ పరిస్థితిలో ఉన్న నిర్భయను ఢిల్లీ నుంచి సింగపూర్‌కు తరలించారన్నారు. బాధితురాలిని తరలించవద్దని వైద్యులు సూచించినా పట్టించుకోలేదంటే ఇందులో రాజకీయ కోణం ఉందని సోనియా నివాసమైన 10 జన్‌పథ్‌లో ఈ నిర్ణయం జరిగినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మహిళలు అర్థరాత్రి పూట ఎందుకు తిరగాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని చూస్తుంటే స్త్రీల పట్ల ఆయనకు ఎంత చులకన అభిప్రాయం ఉందో అర్థమవుతోందన్నారు. నిరసనలో పాల్గొంటున్న వారిని ఉద్దేశించి రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. 

నిర్భయకు వైఎస్సార్ సీపీ నివాళులు

సింగపూర్‌లో చికిత్స పొందుతూ బాధితురాలు నిర్భయ మృతి చెందినట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. వాసిరెడ్డి పద్మతోపాటు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకురాలు గాయత్రి, పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

[YSR ] ప్రోటోకాల్ విషయంలో బాలినేని ఆగ్రహం

ప్రోటోకాల్ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించకపోవటం అన్యాయమని బాలినేని అన్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానపరిచారని ఆయన ధ్వజమెత్తారు. 

అధికార పార్టీకి కొమ్ముకాసే అధికారులు ఆ పార్టీ కండువాలు వేసుకుని తిరిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర కాంగ్రెస్ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపించారు. ఈ విషయమై ప్రివిలైజేషన్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.

[YSR ] జగన్‌ను విడుదల చేయాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జగన్ కోసం జనం కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. శుక్రవారం నాంపల్లిలోని దర్గా యూసుఫియన్ వద్ద వైఎస్సార్ సీపీ సెంట్ర ల్ ఎగ్జిక్యూటివ్ కౌల్సిల్ సభ్యుడు మతీన్ ముజద్దదీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. వైఎస్సా సీపీ అధ్యక్షులు, ఎంపీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భందించిన ప్ర భుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణకు ముస్లిం మైనార్టీలు మంచి ఆదరణ చూపించారు. జగనన్న బయటకు రావాలంటూ వందలాది మంది ముస్లిం మైనార్టీలు సంతకాలు చేశారు. జగన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. 

ఈ సంతకాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పార్టీ పక్షాన అం దజేస్తామని మతీన్ ముజద్దదీ పేర్కొన్నారు. జైలు నుంచి జగన్ నిర్ధోషిగా బయటకు వస్తారని దీమా వ్యక్తం చేశారు. జైలు నుం చి బయటకు రాగానే సీఎం కావడం తధ్యం అన్నారు. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొలేకనే కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జైలులో నిర్భందించారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలకు రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రెండింటికి డిపాజిట్స్ దక్కవని తెలిపారు. జగన్ వెనుక ఉన్న జన ప్రభంజనంలో కాంగ్రెస్, టీడీపీలు కొట్టుకుపోతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జుడీ బాయి, మహ్మద్ అజీజ్, మహ్మద్ నూర్, మీర్ అలీ ఫైసల్, ఇర్ఫాన్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. 

జగన్ సీఎం అవుతారు 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సీఎం అవుతారని యూసుఫియన్ దర్గా ముత్తవల్లీ ఫైసల్ అలీషా ఆశీర్వదించారు. దర్గా యూసుఫియన్ వద్ద వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో దర్గా మత పెద్ద ఫై సల్ అలీ షా పాల్గొని మొదటగా సంతకం చేశారు. జగన్ సీఎం అవుతారని ప్రజలకు ముందే తెలుసన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. 

కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా వద్ద 
సుల్తాన్‌బజార్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపీ వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పార్టీ నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదం మాట్లాడుతూ జగన్ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టామని, ఈ సంతకాల సేకరణను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి స మర్పించనున్నట్లు ఆయన తెలిపారు. జగనన్న కోసం జనాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెడుతున్నారన్నార ని అన్నారు. దేశ ప్రజలు జగన్ నిర్ధోషి అని బహిరంగంగా చెబుతున్నా యూపీఏ ప్రభుత్వంలో కీలుబొమ్మ అయిన సీబీఐకి మా త్రం అర్థం కావడం లేదని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఏ కేసునైన న్యాయంగా దర్యాప్తు చేయాలని కోరారు. ఇప్పటికే ద ర్యాప్తు సంస్థలపై ప్రజల సందేహాలు మొదలయ్యాయని, ప్రజ ల్లో సీబీఐపై పూర్తి నమ్మకం పోక మునుపే కేసులను నిస్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 

[YSR ] కోటి ఆశల భారం...ఆ భుజాలపైనే.

వందమంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదన్న చర్వితచర్వణమైన ప్రజా స్వామ్యపు చిలకపలుకులు చిన్నప్పటినుంచీ వినీవినీ మా చెవులు తుప్పు పట్టిపోయాయి. మనదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమని నమ్మిన మా మనసుల్లో ... ఇప్పుడు అది అవాస్తవమేమోనన్న అనుమానపు బీజాలు మొలకెత్తుతున్నాయి.

భూమాత సహనాన్ని పుణికిపుచ్చుకుని ఓర్పుతో జైలు గోడల మధ్య నలిగిపోతున్నా... కోట్లాదిమంది ఆశల్ని అచంచలమైన దీక్షతో భుజాన మోస్తున్న ఆ మనిషిని చూసిన తర్వాత కూడా ఇది ప్రజాస్వామ్యమేనని ఎలానమ్మాలి? అసత్యాల, అవాస్తవాల కలబోతను న్యాయస్థానమనే తెరమీద ప్రదర్శిస్తూ... ఆ నాటకాన్ని రక్తికట్టించడానికి నిస్సిగ్గుగా రోజుకొక పాత్రను తెరమీదకు తెస్తున్న హస్తిన కుతంత్రాన్ని అసహ్యించుకోవాల్సి వస్తోంది. వాస్తవాలను విస్మరించి, అబద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసే కుట్రలో ప్రజాస్వామ్యపు మూలస్తంభాలు సైతం పాత్రధారులు కావడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా భావించాలి?

ఆయన మీకు రాజకీయ శత్రువే కావచ్చునేమో కానీ, తండ్రి వాత్సల్యం కోసం తపిస్తున్న ఇద్దరు బిడ్డల తండ్రి కూడా. భర్తను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తల్లికి సాంత్వన కలిగించాల్సిన పుత్రుడు కూడా. తను కన్నీరు కారిస్తే... భర్తనే నమ్ముకున్న ప్రజలు ఎక్కడ నిరాశానిస్పృహలకు లోనవుతారోనని గుండెలోతుల్లోంచి తన్నుకొస్తున్న బాధని పంటి బిగువున అదిమిపెట్టిన ఒక మహిళకు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త కూడా. కోట్లాదిమంది అనుభవిస్తున్న కష్టాలను ఆకళింపు చేసుకున్న జ్ఞాని కూడా...

ఇప్పటికైనా ప్రజల ఆవేశాన్ని ప్రామాణికంగా తీసుకోండి. పదే పదే అదే అబద్ధాన్ని ప్రజల హృదయాలలోకి బలవంతంగా చొప్పించడం ద్వారా జనం హృదయాల్లో ఇప్పటికే గాఢంగా ముద్రితమైపోయిన ఆ వాస్తవాన్ని బయటకు పంపించలేరన్న వాస్తవాన్ని గుర్తించండి. ఇప్పుడో అప్పుడో ఆ తండ్రి వస్తాడని, మోకాళ్ల మీద కూర్చుని... తమ చెక్కిలి మీద వెచ్చటి కన్నీటిని తుడుస్తాడని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఆ చిన్నారుల క్షోభ మీకు శాపంగా పరిణమించకముందే మేల్కొనండి. అన్న ఆశయాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచేందుకు తపనపడుతున్న ఆ సోదరి ఆవేశం మీ అహంకారపు పునాదుల్ని పెకలించకముందే జాగ్రత్తపడండి.

ప్రజల అవసరాలను, ఆశలను, ఆచరణలోకి మళ్లించిన ఆ ‘పెద్దాయన’ గుర్తుల్ని బలవంతంగా చెరిపివేసే రాక్షసక్రీడను ఇప్పటికైనా ఆపండి. ప్రజల కన్నీటి ఉప్పెనలో మీ అత్యాశాసౌధం పేకమేడలా కూలకముందే వాస్తవాన్ని గ్రహించండి. జైలుగోడల మధ్య ఉంచి మంచితనపు స్వరూపాన్ని ప్రజలకు దూరం చేశామన్న మీ పైశాచికపు కుడ్యానికి ప్రజాభిమానపు గవాక్షం ఒకటి ఎక్కడో తెరిచే ఉందన్న వాస్తవం గ్రహించే ప్రయత్నం చేయండి.

- వాసవీ మోహన్,
సూరారం, హైదరాబాద్


భయం లేదు జగనన్నా!

అన్నా జగనన్నా,
భయం లేదురన్నా
జగమంతా నీవైపే
జనమంతా నీవైపే

సీబీఐ చేస్తున్నది
చిన్న పెద్దకు తెలుసు
జైలులోన నిన్ను పెట్టి
జాగీరులు పొందుతోంది
జనులు ఎరుగరనుకుంది

బెయిలివ్వక చేస్తుంది
బెబ్బులివని బెదురుతోంది
భయం లేదు జగనన్నా
భువి అంతా నీవైపే

రెండు వేల పద్నాలుగు
రానున్నది త్వరగన్నా
ముఖ్యమంత్రి నీవన్నా
మురిపం ప్రజ తీర్పన్నా
ఇది దేవుని ఆదేశం
జనసంద్రం సందేశం

[YSR ] వైఎస్సార్‌సీపీ టీచర్స్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ


వైఎస్సార్ కాంగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ డైరీని శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘ఆపస్’కు చెందిన పలువురు ఉపాధ్యాయులు విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌టీఎఫ్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ కన్వీనర్ కె.ఓబుళపతి, నేతలు కె.జాలిరెడ్డి, ఎస్‌ఎల్‌వి.రెడ్డి, పి.అశోక్‌కుమార్, టి.ప్రకాష్, వీజే కెనడి తదితరులు పాల్గొన్నారు.

[YSR ] భారీ ధర చెల్లించి విద్యుత్ కొనేందుకు సిద్ధమైన సర్కారు

యూనిట్ ధర రూ.20 దాకా చేరుతుందని ట్రాన్స్‌కో వారించినా వినని వైనం
కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డికి సంబంధించిన కంపెనీతోనూ చర్చలు

భవిష్యత్తులో విద్యుత్ సరఫరా, ధరలు ఎలా ఉంటాయో తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈస్ట్‌కోస్ట్ విద్యుత్ ప్లాంటుతో 25 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ నుంచి మొత్తం 300 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం యూనిట్‌కు రూ.3.466 వసూలు చేస్తామని ఈస్ట్‌కోస్ట్ కంపెనీ చెబుతున్నా.. 25 ఏళ్లలో యూనిట్ ధర రూ.20 దాకా చేరుతుందని ట్రాన్స్‌కో చెబుతోంది. అంటే యూనిట్ విద్యుత్‌కు రూ.20 వెచ్చించాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట! రెండేళ్ల తర్వాత అంటే 2015 జనవరి నుంచి 25 ఏళ్ల పాటు ఈస్ట్‌కోస్ట్ కంపెనీ నుంచి రాష్ట్రం విద్యుత్‌ను కొనుగోలు చేయనుంది. మున్ముందు కరెంటు సరఫరా, డిమాండ్, ధరలు ఎలా ఉంటాయో అంచనా వేయకుండానే ఏకంగా 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమిటన్న ట్రాన్స్‌కో సీఎండీ సమారియా మాటలను పెడచెవిన పెడుతూ.. ప్రభుత్వం చివరికి ఈస్ట్‌కోస్ట్ వైపే మొగ్గడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈస్ట్ కోస్ట్ కంపెనీ ఏర్పాటు అవుతుండటమే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డికి చెందిన థర్మల్ పవర్ టెక్ కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి.

ఒప్పందం వెనుక ఒత్తిళ్లు..!

రానున్న 25 ఏళ్లకుగానూ 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా 620 మెగావాట్ల విద్యుత్ (సుమారు 14.6 మిలియన్ యూనిట్లు)ను యూనిట్‌కు 3.466 రూపాయల చొప్పున విక్రయిస్తామని ఈస్ట్‌కోస్ట్ కోట్ చేసి ఎల్-1గా నిలిచింది. అయితే బిడ్డింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పుడు 300 మెగావాట్లు మాత్రమే ఇస్తానని ఈ కంపెనీ అంటోంది. బొగ్గు, ఆపరేషన్, నిర్వహణ (ఓ అండ్ ఎం) ఖర్చులు పెరగడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే యూనిట్ ధర ప్రతి ఏటా పెరుగుతుంది. ఇలా కంపెనీ నుంచి 25 ఏళ్ల తర్వాత కొనే యూనిట్ విద్యుత్ ధర ఏకంగా రూ.20కి చేరుకోనుంది. భవిష్యత్తులో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తెలియకుండా ఇప్పుడు ఇంత అధిక ధరను వెచ్చించి కొనాల్సిన అవసరం లేదని ట్రాన్స్‌కో సీఎండీ సమారియా వాదించినట్టు సమాచారం. 

అయినా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి ఈ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే బిడ్డింగ్‌లో ఎల్-5 ఉన్న థర్మల్ పవర్‌టెక్‌తోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. యూనిట్ ధరను (రూ.3.685కు) తగ్గించుకోవాలని పవర్‌టెక్‌ను ఇంధనశాఖ కోరింది. అయితే అందుకు ఆ సంస్థ ససేమిరా అంటున్నట్టు సమాచారం. ఈ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిళ్లు తెస్తున్నారు. ఎల్-2గా వచ్చిన హిందుజాతో నేరుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంటుండగా, ఎల్-3గా వచ్చిన ఎథెనా, ఎల్-4గా వచ్చిన నెల్‌క్యాస్ట్ బిడ్డింగ్ నుంచి తప్పుకున్నాయి.

[YSR ] రెండు కళ్లు.. నాలుగు నాలుకలు

ఎన్నికల కోసం 2008లో తెలంగాణవాదం మొదలుపెట్టిన టీడీపీ

 అంశం ఒక్కటే.. సమయం, అవసరాన్నిబట్టి మాటలు మారిపోయాయి. ఇన్ని మాటలు చెప్పటం ఎవరికైనా సాధ్యపడుతుందా.. ఒక్క తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తప్ప..! చిదంబరం ప్రకటనకు ముందొక మాట. ఆ తర్వాత మరో మాట. తెలంగాణ ఉప ఎన్నికలప్పుడు ఒక ముచ్చట. అవి ముగిశాక ఇంకొక ముచ్చట. పరకాలలో మరో మాట. ఆ ఎన్నిక ముగియగానే ఆ ముచ్చటా మారిపోయింది. ఇలా నాలుగేళ్లలో అనేకానేక మలుపుల మాటలు. పేరుకు ప్రధాన ప్రతిపక్షం. ప్రధాన సమస్యపై నిలకడలేనితనం. ‘మా పార్టీ వైఖరి ఏ ఎండకా గొడుగు అన్న చందంగా ఉంది’ అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించేంతటి పరిస్థితి. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర హోం శాఖ మంత్రికి అందజేసిన లేఖలోనూ ఇదే విధమైన అస్పష్ట వైఖరిని ప్రదర్శించారన్న విమర్శలు వస్తున్నాయి.

అప్పుడు అధికారం కోసం..

తెలుగుదేశం పార్టీ తొలుత సమైక్య వాదాన్ని ప్రదర్శించింది. అయితే, 2009లో జరిగే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం 2008లో తెలంగాణకు అనుకూలమని ప్రకటించింది. ఆ ఏడాది దసరా పండుగ రోజున టీడీపీ పొలిట్‌బ్యూరో తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించిందని అధినేత చంద్రబాబు ప్రకటించారు. తర్వాత పది రోజులకే ‘తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చిందని మీకు తెలియజేస్తున్నాం’ అంటూ అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని, తెలంగాణ ఏర్పాటుకు శాసనపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రచారం కూడా చేశారు.

చిదంబరం ప్రకటనపై అగ్గిమీద గుగ్గిలం!

ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన దరిమిలా 2009 డిసెంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ తెలంగాణకు మద్దతు పలుకుతుందని ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే (డిసెంబర్ 9న) అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూల ప్రకటన చేశారు. మరుసటి రోజు టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ‘తెలంగాణ అంశంపై ఎవ్వరితోనూ చర్చించకుండా, నచ్చచెప్పకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఒకరు అడుగుతారు, మరొకరు ఇస్తారు. కాంగ్రెస్ దీన్ని ఒక మ్యాచ్‌ఫిక్సింగ్‌లా చేసింది. స్వీయ రాజకీయ ప్రయోజనాలేవో ఆశించి ఇలా వ్యవహరించింది. సోనియాగాంధీ ఏమీ ఆలోచించకుండా అర్ధరాత్రి నిర్ణయం ప్రకటించి చేతులు దులుపుకున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు.

రెండు కళ్ల సిద్ధాంతం

2010 ఫిబ్రవరి 4న చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ‘తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ల లాంటివి. తెలంగాణ, సమైక్య వివాదాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే’ అని ప్రకటించారు. ఈ ప్రకటన పెద్ద వివాదాన్ని రేపింది. దీంతో కొద్దిరోజులు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత అదే ఏడాది తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. 2010 జూన్ 19న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ‘తెలంగాణ, సీమాంధ్ర రెండూ నాకు రెండు కళ్ల వంటివని నేను ఎందుకు అన్నానో తెలుసా? రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర ్థం’ అని మాట మార్చారు.

నేను తటస్థం

తెలంగాణలో రెండు కళ్ల సిద్ధాంతం పనిచేయకపోవడంతో చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ‘రాష్ర్ట విభజన విషయంలో నేను తటస్థంగా ఉంటా. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇరు ప్రాంతాల నేతలకు చెప్పాను. ఈ విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీనే’ అని 2011 మే 9న చెప్పారు.

మహానాడులో కొత్త తీర్మానం

2009 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న టీడీపీ.. 2011 మే 29న మహానాడులో కొత్త తీర్మానాన్ని ఆమోదించింది. ‘తెలంగాణ విషయంలో ఇంకా ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగిస్తారు? ఈ విషయంలో టీడీపీ చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేసింది. కేంద్రం సత్వర నిర్ణయం తీసుకొని ఈ అనిశ్చితిని తొలగించాలి. చేతకాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అంటూ తీర్మానం చేసింది. మరోపక్క రెండు ప్రాంతాల నేతలు ఒకరు సమైక్యం, మరొకరు తెలంగాణ ఉద్యమాలు చేసుకోవడానికి బాబు అంగీకారం తెలిపారు. ‘రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలు వారి ప్రాంతాల మనోభావాలను ప్రతిబింబించక తప్పదు. అందుకే పార్టీ అధ్యక్షుడిగా నేను ఏది చెబితే అదే పార్టీ వైఖరి. మిగతా ఎవరేం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం లేదా వారి ప్రాంత అభిప్రాయం మాత్రమే’ అని 2011 జూలై 29న చంద్రబాబు మరో విధంగా మాట్లాడారు.

ఉప ఎన్నికల కోసం మాట మారింది!!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదని ఎన్నికల ఫలితాల ప్రకటించిన వెంటనే చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది చెప్పి వారం గడవక ముందే 2011 మార్చి 11న కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడతూ.. ‘నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇకపైనా మాట్లాడబోను’ అని మాట మార్చేశారు. 

పార్టీని గెలిపిస్తే ఉద్యమమే చేస్తాం

ఉప ఎన్నికలలో పార్టీ వరసగా ఓటమిని ఎదుర్కోవడంతో తమను గెలిపిస్తే తెలంగాణ కోసం ఉద్యమం చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది మే 24న పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మా పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపిస్తే ఆయనతోనే చిదంబరానికి లేఖ పంపిస్తాం. ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. ఆ ఉప ఎన్నికలు ముగియగానే ‘తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం’ అంటూ మరోసారి మాట మార్చారు. 

ఈ ఏడాది జూలై 10న చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ అంశంపై పార్టీలోని నాయకులతో మాట్లాడుతున్నాను. మధ్యలో ఉప ఎన్నికలు రావటంవల్ల అందరితో మాట్లాడటం కుదరలేదు. అందరి అభిప్రాయాలు తీసుకొని త్వరలోనే స్పష్టత ఇస్తాం’ అని చెప్పారు. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలంగాణ అంశం తేల్చడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.

తాజాగా శుక్రవారం కేంద్ర హోం మంత్రికి పంపిన లేఖలోనూ ఆయన ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు. 2008లో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అందజేసిన లేఖ మీ వద్దే ఉందని, దాన్ని తామింతవరకు ఉపసంహరించుకోలేదని మాత్రం పేర్కొన్నారు. 2009లో యూపీఏ-1 ప్రభుత్వం పోయి యూపీఏ-2 ప్రభుత్వం ఏర్పడినందున ఆ లేఖలోని విషయాలనే మరోసారి చెబితే బాగుండేదని, అలా చేయకపోవడంవల్ల అనుమానాలు రేకెత్తిస్తోందని తెలంగాణ ప్రాంత ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. తమ రాజకీయ అవసరానికి తగినట్టుగా వాడుకునే విధంగా తప్పించుకునే ధోరణితో లేఖ ఇవ్వడం వల్ల ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోతోందని సీమాంధ్ర ఎమ్మెల్యే ఒకరు వాపోయారు.

తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది: 2008లో అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ

మా పార్టీ తెలంగాణకు మద్దతు పలుకుతుంది.. : 2009 డిసెంబర్ ఏడో తేదీన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు 
తెలంగాణ అంశంపై ఎవ్వరితోనూ చర్చించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు.. : 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన మరుసటి రోజు చంద్రబాబు

తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ల లాంటివి.. : 2010 ఫిబ్రవరి 4న చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం 

రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర ్థం.. : 2010 జూన్ 19వ తేదీన ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు

తెలంగాణపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలి: 2011 మే 29న మహానాడులో తీర్మానం

యూపీ ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదు: 2011 యూపీ ఎన్నికలు ముగియగానే చంద్రబాబు వ్యాఖ్య

నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: ఆ తర్వాత కొద్ది రోజులకే కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

మా పార్టీ అభ్యర్థిస్తే ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం : ఈ ఏడాది మే 24న పరకాల ఉప ఎన్నికల సభలో చంద్రబాబు

తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం : ఈ ఏడాది జూలై 10న చంద్రబాబు

[YSR ] వైఎస్సార్‌సీపీలో చెల్లుబోయిన వేణు


సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వేణుతోపాటు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ గొల్ల ప్రవీణ్‌కుమార్, బ్రాహ్మణ సంఘాల నేత పాటిబండ రాజేంద్రకుమార్ తదితరులు కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మూలింటి మారెప్ప, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Friday, 28 December 2012

[YSR ] జనం ఆశలన్నీ జగన్ మీదే

టీడీపీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు కోట్లకు అమ్ముడుపోతున్నారని అబద్ధాలు పలుకుతున్న చంద్రబాబు, ఎన్ని కోట్లు తీసుకుని కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారు? ఎన్ని కోట్లు చెల్లించి ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో బంధించి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు? ఎన్ని కోట్లు తీసుకుని ఈ ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టకుండా కాపాడుతున్నారు?

ప్రపంచబ్యాంకు మెప్పుకోసం రాష్ట్రంలో అన్నిరంగాలనూ... ముఖ్యంగా వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు, రాష్ట్రంలో 3,500 మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైన చంద్రబాబు ప్రజల జ్ఞాపకశక్తిని చాలా తక్కువగా అంచనా వేసి ప్రజల మీద తనకున్న చులకన భావం వ్యక్తపరుస్తున్నాడు. ‘వ్యవసాయమే దండగ’ అన్న ఉద్దండుడు, ‘రైతులు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అన్న పెద్దమనిషి, ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవలసిందే’ అని ఎద్దేవా చేసిన వ్యక్తి, ‘భూములు పంచితే పేదరికం పోదు’ అన్న పెద్దమనిషి, ‘నీటి ఎద్దడి పోవాలంటే తుఫానులే శరణ్యం’ అంటూ రైతులను ఆగర్భశత్రువుల్లా చూసిన ఘనుడు, ‘ఒకసారి పంట ఎండితే తెలిసొస్తుంది’ అంటూ అన్నదాతకు శాపనార్థాలు పెట్టిన వ్యక్తి, తన స్వీయరచన ‘మనసులో మాట’ పుస్తకంలో సబ్సిడీలు ఇవ్వరాదని రాసుకున్న వ్యక్తి... ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ రైతుల పట్ల మొసలికన్నీరు కార్చడం ఈ శతాబ్దపు వింత. చంద్రబాబు మర్చిపోయారేమో కానీ, 28 ఆగస్టు 2000లో విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా ఆందోళన చేసిన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులను తుపాకులతో కాల్పించిన ఘటన, అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘటన ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కూడా రాణించలేక పూర్తిగా విఫలమయ్యారని యావత్ ప్రజానీకం, రాజకీయ నిపుణులు, మేధావులు ఘంటాపథంగా చెబుతున్నారు. ‘సంక్షేమం నిల్ - బాదుడు ఫుల్’ కొనసాగిస్తున్న ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వం మాకొద్దు మొర్రో అని ఈ రాష్ట్ర ప్రజలంతా మొత్తుకుంటుంటే చంద్రబాబు ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండా కుంటిసాకులతో కాలయాపన చేస్తున్నారు. అందుకే చంద్రబాబుని గానీ, కాంగ్రెస్‌ను గానీ నమ్మే స్థితి రాష్ట్రంలో లేదు. ప్రజల ఆశలన్నీ జగన్ మీదే. జగన్ తప్పక విడుదలవుతారు. తప్పక ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తారు. 

- ఆదిరెడ్డి యానాదిరెడ్డి, శ్రీకాళహస్తి, చిత్తూరు

ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం

ప్రపంచదేశాల్లోని ముఖ్యమంత్రుల్లో పేరుగాంచిన, ఉత్తమ పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన దివంగత నేత డా॥వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి. ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పటినుండీ ఈ రాష్ట్రానికి శని పట్టింది. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆశయాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రజాసమస్యలపై పోరాటాలు, దీక్షలు చేస్తూ ప్రజలకు చేరువౌతున్న జగన్‌ని చూసి తట్టుకోలేని పాలకపక్షం, ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు కలిసి ‘సీబీఐ’ అనే మంత్రదండాన్ని ఉపయోగించి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయించారు. 

జగనన్నను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు స్వార్థ రాజకీయ నిరుద్యోగులు, అసమర్థ పాలకులు దొడ్డిదారిన చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని, ఆయన కుటుంబాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. నీచ రాజకీయాలు చేస్తూ వైఎస్సార్ కుటుంబంపై బురద చల్లాలని వారు ప్రయత్నిస్తున్నకొద్దీ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా జగనన్న పట్ల జనస్పందన, ప్రేమాభిమానాలు అంతగా పెల్లుబుకుతున్నాయి. కాని ప్రజలకు కష్టాలు తీరే రోజు త్వరలో రానుంది. దేవుడు మావైపు ఉన్నాడు, రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. అతి త్వరలో జగనన్న బయటకు వస్తారు. వైఎస్సార్ కుటుంబానికి అండగా మేముంటాం. జననేత కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం.

[YSR ] బెయిలు ముందర ప్రతిసారీ ఇదే కుట్ర

బెయిలు ముందర ప్రతిసారీ ఇదే కుట్ర
నిమ్మగడ్డ ప్రసాద్ సలహాదారు వాంగ్మూలమంటూ ‘ఈనాడు’ శివాలు


ఏదో ఒక అంశాన్ని తీసుకుని సంచలనం సృష్టించేందుకు ప్రయత్నం
గతంలోనే ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సమయం చూసి రంగులు
వాన్‌పిక్ పోర్టు ప్రతిపాదన బాబుదే... స్కోడాకు అప్పగించిందీ ఆయనే
అది అమలు చేసే పరిస్థితి లేకపోవటంతో రాక్‌కు అప్పగింత
రాక్‌తో ఒప్పందం కుదిరింది 2008 మార్చిలో 
నిమ్మగడ్డ మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం అప్పటికే జగతి, భారతిలోకి
ఆ తరవాత 2009 సెప్టెంబర్లో వైఎస్సార్ మరణం
ఆయన మరణించాక మరో 55 శాతం పెట్టుబడులు పెట్టిన ప్రసాద్
అప్పటికే దేశంలో అగ్రగామి పత్రికగా నిలదొక్కుకున్న ‘సాక్షి‘
ఆ సమయంలో కూడా మొదట కొన్న రేటుకే షేర్లు కొన్న ప్రసాద్
మంచి ధరకు రావటంతో సాక్షిలో వాటా పెంచుకునే ప్రయత్నం
దాన్ని ఇప్పటికీ సహించలేకపోతున్న చంద్రబాబు, ఈనాడు
కాంగ్రెస్ ప్రభుత్వాలు తోడు రావటంతో రెచ్చిపోతూ రాతలు
బెయిలుపై విచారణ జరుగుతుండటం వల్లే రంగంలోకి ఏసీబీ?
సూరీడుపై దాడుల్ని వైఎస్సార్‌కు లింకు పెడుతూ ఎల్లో కథనాలు
సూరీడు కాంగ్రెస్ పెద్దలతో తిరుగుతున్న సంగతి కావాలనే పక్కకు
వైఎస్సార్ మరణించి మూడేళ్లు దాటినా ఆయనకే అంటగట్టే కుయత్నాలు
నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఎల్లో సిండికేట్

అరె!! ప్రతిసారీ ఇదేనా? ఒక్క వ్యక్తిపై ఇంత మంది కుట్రలా? ఒక వ్యక్తికి బెయిలు రాకుండా చేయటానికి ఇన్ని కుట్రలు పన్నాలా? ఆయన జైల్లోంచి బయటకు వస్తారనే భయంతో ఇన్నిన్ని కథలు నడిపించాలా? అసలు జనానికి మేలు చేయాల్సిన ప్రభుత్వం... నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్థలు... అన్యాయాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్షం.. మూడూ కుమ్మక్కయిపోవటమనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా? సరిగ్గా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు విచారణకు వచ్చినప్పుడో... తీర్పు రాబోతున్నప్పుడో వీళ్లెందుకు ఇంత డ్రామాలాడుతున్నారు? ఆయన బయటికొస్తారనే భయం కాకపోతే మరేమిటి? 

సీబీఐ లీకులివ్వటం... దానికి మసాలా జోడించి ఏదో జరిగిపోయిందనే రంగేస్తూ ‘ఈనాడు‘ సంచలనం సృష్టించే ప్రయత్నం చేయటం. ఇదంతా సరిగ్గా జగన్‌మోహన్ రెడ్డి బెయిలుపై విచారణ జరిగేటప్పుడో, తీర్పు రాబోయే ముందో ప్రచురించటం. ఒకసారి కాదు. ఇప్పుడు మొదలుపెట్టిందీ కాదు. ఉప ఎన్నికలకు ముందు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అరెస్టయ్యాక... జూన్ 1న ఆయన తొలిసారి బెయిలు కోసం పిటిషన్ వేశారు. అప్పటి నుంచి సీబీఐ-ఈనాడు- చంద్రబాబునాయుడు కలిసి ఈ హైడ్రామా ఆడుతూనే ఉన్నారు. ఈ మూడు పాత్రల్నీ కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తూనే ఉన్నాయి.

బుధవారం ‘జగన్‌తో వ్యాపార బంధం వద్దన్నా’ అంటూ నిమ్మగడ్డ ప్రసాద్ చార్టర్‌‌డ అకౌంటెంట్ వెంకటరమణమూర్తి సీబీఐకిచ్చిన వాంగ్మూలమంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనం కూడా అలాంటిదే. ఎందుకంటే ఈ వాంగ్మూలమేమీ ఆయన సీబీఐకి నిన్ననో, మొన్ననో ఇచ్చిందేమీ కాదు. అధికారికంగా ఇప్పుడు బయటపడిందీ కాదు. కావాలనే సమయం చూసుకుని సీబీఐ లీకులిచ్చింది. అందులో ఏమీ లేకున్నా... అదేదో మహాపరాధమైనట్లు, బుధవారమే ఇంతలా ప్రచురించటం వెనక మర్మం ఎవరికీ తెలియంది కాదు. 

ప్రసాద్ పెట్టుబడులెంత?
అసలు నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడుల గురించి వీళ్లు రాస్తున్న రాతల్లో నిజమేంటి? ఆయన ఏ పెట్టుబడికి సంబంధించయినా తన సలహాదారులందరితో చర్చించేవారని... చివరకు నిర్ణయం మాత్రం తనే తీసుకునేవారని ఆయన చార్టర్‌‌డ అకౌంటెంట్ చెప్పినదాంట్లో తప్పు ఏమైనా ఉందా? ఏ వ్యాపారవేత్తయినా చేసేది అదే కదా? మరి అందులో రామోజీరావుకు తప్పెందుకు కనిపించింది? అసలు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులెంత? ఎప్పుడెప్పుడు పెట్టారు? ఒకసారి చూద్దాం...

ఆ పెట్టుబడులు పెట్టిందెప్పుడంటే...
రస్ అల్‌ఖైమాతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది 2008 మార్చి 11న. రాక్ సీఈఓ ఖతర్ మసాద్ స్వయంగా వచ్చి దీనిపై సంతకాలు చేశారు. ఆ తరవాత రెండు నెలలకు ఈ ప్రాజెక్టు అమలు కోసం తన స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. ఒకవేళ నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టును దక్కించుకున్నాకే జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే... అందుకే పెట్టారనే సీబీఐ వాదనను అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిందెప్పుడో తెలుసా?

జగతి పబ్లికేషన్స్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు 2006 డిసెంబర్లోనే మొదలయ్యాయి. అంటే రాక్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవటానికి 14 నెలల ముందే. వాన్‌పిక్‌లోకి నిమ్మగడ్డ ప్రసాద్ ప్రవేశించడానికి దాదాపు ఏడాదిన్నర ముందే! పెపైచ్చు ఈ పెట్టుబడులు 2009 సెప్టెంబర్ తరవాతా సాగాయి. అంటే వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించాక. దీనర్థమేంటి? 

జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్ సహా జగన్‌మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో ప్రసాద్ పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.847 కోట్లు. 
దీన్లో 2008 మార్చి - 2009 సెప్టెంబర్ మధ్య... అంటే రాక్‌తో ఒప్పందం కుదిరిన నాటి నుంచి వైఎస్సార్ మరణించే వరకూ పెట్టిన పెట్టుబడి రూ. 172 కోట్లు. అంటే మొత్తం పెట్టుబడిలో 20 శాతం. అంటే మిగిలిన 80 శాతాన్ని రాక్‌తో ఒప్పందం కుదరకముందో... వైఎస్సార్ మరణించాకో చేసినట్టు. మరి ఏమాశించి ఆయన ఈ పెట్టుబడులు పెట్టారనుకోవాలి? ఒక ఇన్వెస్టరుగా మాత్రమే ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్లు చేశారనుకోవద్దా? 
కేవలం జగతి పబ్లికేషన్స్‌నే తీసుకుంటే దీన్లో పెట్టుబడి పెట్టిన రూ.450 కోట్లలో రూ.30 కోట్లు మాత్రమే ఆయన 2008 మార్చి-2009 సెప్టెంబర్ మధ్య పెట్టారు. అంటే 6 శాతమన్న మాట. మిగిలిన 94 శాతం రాక్‌తో ఒప్పందం కుదరక ముందో లేక వైఎస్సార్ మరణించాకో పెట్టినవే. దీన్ని క్విడ్ ప్రో కో అంటున్నవారు ఏ రకంగా ఆలోచిస్తున్నారో చెప్పటానికి ఇది చాలదూ!!

వాన్‌పిక్ బాబు తలలోంచి పుట్టిందే...
అసలు వాన్‌పిక్ ఆలోచన తెచ్చిందే చంద్రబాబునాయుడు. తొలుత ఆంధ్రా సీపోర్ట్స్ సంస్థ ఈ ప్రతిపాదన చేయగా చంద్రబాబు సరేనన్నారు. కుదరకపోవటంతో స్కోడా కంపెనీకి ధారాదత్తం చేశారు. కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లానే దీన్నీ కట్టబెట్టే ప్రయత్నం చేసినా స్కోడా కంపెనీ ఈ ప్రాజెక్టు చేయలేని స్థితిలో రాక్ ప్రభుత్వం తెరపైకి వచ్చింది. ఇలా రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. 

సాక్షి విలువ చూసే ఆ పెట్టుబడి...
జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతాన్ని రాక్‌తో ఒప్పందానికి ముందే నిమ్మగడ్డ ఇన్వెస్ట్ చేశారు. తరవాత దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన ఏడాదికి మరో 55 శాతం పెట్టుబడులు పెట్టారు. ఇక్కడర్థం కావాల్సింది ఒక్కటే. అప్పటికి ‘ సాక్షి’ ఏర్పాటై నాలుగేళ్లు గడుస్తోంది. దేశంలోనే 8వ స్థానంలో ఉన్న అగ్రగామి పత్రికగా తన అగ్రగామి స్థానాన్ని పదిలపరచుకుంది. పెపైచ్చు అంతకు ముందు ఏ రేటుకైతే షేర్లు కొన్నారో... అప్పుడు కూడా అదే రేటుకు కొనగలిగారు ప్రసాద్. మరి దీన్ని ఒక తెలివైన ఇన్వెస్టరు తీసుకున్న నిర్ణయంగా చూడొద్దా? అప్పటికే చిరంజీవి, నాగార్జునలతో ‘మా టీవీ’ వంటి మీడియా సంస్థలో భాగస్వామిగా ఉన్న ప్రసాద్... మరో మీడియా సంస్థలో వాటాను పెంచుకోవటం కోసం అదనపు పెట్టుబడి పెడితే తప్పా?

వాటా విక్రయంతో లాభాలు...
దివంగత నేత వైఎస్సార్ మరణించేనాటికి జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడి దాదాపు 415 కోట్ల రూపాయలు. అయితే... వైఎస్సార్ మరణించాక భారతి సిమెంట్‌లో తన వాటాను విక్రయించటంతో ప్రసాద్ చేతికి రూ.620 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు రూ. 200 కోట్ల లాభమన్న మాట. మరి ఈ అంశాన్ని సీబీఐ కానీ, ‘ఈనాడు’ కానీ ఎన్నడూ ఏ పరిస్థితుల్లోనూ ప్రస్తావించనే ప్రస్తావించవు. ఎందుకంటే దీన్ని ప్రస్తావిస్తే క్విడ్ ప్రో కో అనే తమ వాదనకు విలువుండదు కనుక. క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా? అంటూ అంతా నవ్విపోతారు కనుక. 

తనకు లాభం వచ్చాక... అగ్రగామిగా దేశంలోనే 8వ స్థానంలో నిలిచిన పత్రికలో వాటాను అంతకు ముందటి ధరకే కొనుగోలు చేసే అవకాశం రావటంతో ప్రసాద్ సహజంగానే ఒక ఇన్వెస్టరుగా తన నిర్ణయం తాను తీసుకున్నారు. వాటా పెంచుకోవాలనుకున్నారు. ‘ఈనాడు’ విలువతో సరిసమానంగా ఉన్న పత్రిక, దేశంలో నంబర్-8 స్థానంలో ఉన్న పత్రిక... ఇదే ‘ఈనాడు’ విలువలో సగం ధరకే లభిస్తుండటంతో తను సహజంగానే మొగ్గు చూపారు. కానీ ఇది ‘ఈనాడు’కు తప్పుగా అనిపిస్తోంది. అందుకే లీక్‌లతో తప్పుడు కథనాలు వండేస్తోంది. 

ఏసీబీనీ రంగంలోకి దించేశారు!!
ఇంకో చిత్రమేంటంటే బెయిలుపై విచారణకు ముందు సంచలనం చేయడానికి కొత్త ఎత్తులకు దిగటం. బుధవారం సూరీడు ఆస్తులపై ఏసీబీ దాడులంటూ జరిగిన హడావుడి... సూరీడును ఇప్పటికీ దివంగత వైఎస్‌కు వ్యక్తిగత సహాయకుడిగానే పేర్కొంటూ ఎల్లో మీడియా చేస్తున్న హల్‌చల్. వైఎస్ మరణించి మూడేళ్లు దాటినా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేయటమన్నది రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో కళ్లకు కట్టే అంశం. ఏ అధికారిపై సోదాలు జరిగినా... ఏ వ్యవహారం వెలుగుచూసినా దానికి వైఎస్సార్‌తో ఏదో ఒక లింకు పెట్టడానికి ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నవారికి వెగటు కలిగించేవే తప్ప నిజమనిపించేవి కావు.

సూరీడు ఎవరి మనిషి?
వైఎస్సార్ మరణించాక హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగితే కూకట్‌పల్లి మోతీనగర్‌లో కార్పొరేటర్‌గా తన తమ్ముడు గణేష్‌కు ఢిల్లీ పెద్దల, రాష్ట్ర పెద్దల ఆశీస్సులతో టికెట్టు ఇప్పించుకున్నారు సూరీడు. మొన్నటి ఉప ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పని చేశారు సూరీడు. ఇక ఢిల్లీ నుంచి గులాంనబీ ఆజాద్ వచ్చినా, వయలార్ రవి వచ్చినా వాళ్లను సూరీడు కలుస్తూనే ఉన్నాడు... ‘ఈనాడు’లో ఫొటోలు వేస్తూనే ఉన్నారు. మరి ఇవన్నీ ఎల్లో మీడియా ఎందుకు గుర్తు చేయటం లేదు? దివంగత నేత వైఎస్సార్ మరణించి మూడేళ్లు దాటినా ఇప్పటికీ సూరీడుపై ప్రతికూల వార్తలు ఏమొచ్చినా వాటిని దివంగత నేత వైఎస్సార్‌కు అంటగట్టే ప్రయత్నమే చేస్తున్నారెందుకు? ఆ మధ్య సూరీడు కుమార్తె వివాహం జరిగితే వైఎస్సార్ కుటుంబ సభ్యలెవరూ హాజరు కాకున్నా... సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరై... పెద్ద పెద్ద ఫొటోలు కూడా పత్రికల్లో వచ్చినా దాన్నెందుకు పరిగణించటం లేదు? ఇవన్నీ వదిలి ఇప్పటికీ సూరీడును దివంగత నేతకు లింకు పెట్టే ప్రయత్నాలే చేస్తున్నారంటే అది బెయిలు పిటిషన్‌ను దృష్టిలో పెట్టుకుని కాదా? అలాగని చెప్పే ధైర్యం ఈ ఎల్లో మీడియాకు గానీ... తన చేతిలోని ఏసీబీని ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఉందా? మరీ ఇంత నీచమైన రాజకీయాలు నడిపించాలా? అసలు ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రోజైనా సూరీడు జగన్‌ను ఇంటి దగ్గరకు వచ్చి పలకరించారా?