Thursday, 29 November 2012

[YSR ] రెండో రాజకీయ ప్రస్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి.

తన రెండో రాజకీయ ప్రస్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగిస్తానని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక నుంచి వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ రోజు వైఎస్సాఆర్‌సీపీలో చేరిన అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. తనకు, తన అనుచరులకు పార్టీ సభ్యత్వం కావాలని సిగ్గు విడిచి అడిగినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఆరు నెలలు మనస్తాపం చెంది ఏ పార్టీలో చేరకుండా ఉన్నానన్నారు. తన అనుచరులతో మాట్లాడిన అనంతరం వైఎస్సార్‌సీపీ చేరినట్లు తెలిపారు. చిరంజీవి, తాను 12 ఏళ్లు పక్కపక్క ఇంట్లో ఉన్నా, ఆయన పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీలో చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ జైల్లో కలవడం తనకు మంచి అనుభూతి కల్గించిందని, రాష్ట్ర సమస్యలపై జగన్‌కు అవగాహన ఉందని వెంకటేశ్వర్లు అన్నారు. 

[YSR ] ముగిసిన షర్మిల 43వ రోజు పాదయాత్

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం 43వ రోజు పాదయాత్ర ముగిసింది. గురువారం రాత్రికి మూలమల్లలో షర్మిల బస చేయనున్నారు. నేటి పాదయాత్రలో 17.5 కి.మీ దూరాన్ని షర్మిల నడిచారు.

[YSR ] ఆల్మట్టి పాపం చంద్రబాబుదే!

చంద్రబాబూ మీరు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్తుంటారు..
మీ హయాంలోనే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఏమీ చేయలేక అసమర్థుడిగా ఉండిపోయారు
ఆ వేళ ఆల్మట్టికి అడ్డంపడి ఉంటే.. ఈ రోజు పాలమూరు జిల్లాలో పంట పొలాలు ఎండిపోయేవా?
ఆ పాపం మీదే అని మీకు అనిపించడం లేదా?.. ఏసీబీ, సీబీఐ, ఈడీ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలు
బొత్స ఒక డాన్ అని వాళ్ల పార్టీ కేంద్ర మంత్రే లేఖ రాసినా ప్రభుత్వం విచారణ చేయదు
ప్రజల్ని గాలికొదిలేసిన ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు సాకులు చెప్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 42, కిలోమీటర్లు: 571.50



‘‘ఈ ప్రభుత్వం ఏ క్షణంలో ఉచిత విద్యుత్తును ఎత్తి వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లేరాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. పక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సంక్షోభం ఉన్నప్పటికీ వాళ్లు ముందస్తు ప్రణాళికతో విద్యుత్తు కొనుగోలు చేసి సమస్యను అధిగమించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ముఖ్యమంత్రి తన సీటును పదిలపరతచుకునే పనిలో పడి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉండి కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు. ‘కరెంటు రెండు మూడు గంటలైనా ఉండడం లేదు’ అని రైతులు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. ‘కరెంటు లేకపోతే ఏం? కిటికీలు, తలుపులు తీసి పడుకోండి’’ అని మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అంటారు. ఆయన మాత్రం ఏసీలో ఉంటారుకానీ ప్రజలకు మాత్రం ఉచిత సలహాలు పడేస్తారు.’’ 
- ధరూర్ సభలో షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు నాయుడుగారూ.. మీ హ యాంలో కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్తున్నారు. మరి మీ హయాంలోనే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి కడుతుంటే ఏమీ చేయలేక అసమర్థుడిగా మిలిగిపోయారు. ఇవాళ ఈ పాలమూరు జిల్లాలో నువ్వు తిరుగుతున్నప్పుడు నీళ్లు లేక ఎండిపోయిన పండ్ల తోటలను, పంట పొలాలను చూస్తున్నప్పుడైనా.. ‘అయ్యో! ఈ పాపం నాదే.. ఆ వేళ నేను ఆల్మట్టికి అడ్డంపడి ఉంటే నేను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాకు ఇవాళ నీటి సమస్య ఉండేది కాదే అని ఒక్కసారైనా మీ మనసుకు అనిపించడం లేదా?’’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. ప్రజలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 42వ రోజు బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో సాగింది. ధరూర్ మండల కేంద్రంలో తనతో పాటు కదం తొక్కుతూ వచ్చిన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉండకూడదంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని, అలాంటపుడు అవిశ్వాసం పెట్టొచ్చు కదా అంటే.. సాకులు చెప్తున్నారని దుయ్యబట్టారు.

ఏసీబీ, సీబీఐ, ఈడీ కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మలు..

‘‘కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా లేని వారిపై అక్రమంగా కేసులు పెట్టి హింసిస్తోంది. ఇవాళ ఏసీబీ, సీబీఐ, ఈడీ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా ఆడుతున్నారు’’ అని షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ‘‘మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరమే లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చెప్తారు. ఆయన ఏ తప్పూ చేయలేదంటారు. ఆయన మంత్రివర్గంలోనే అమాయకుడైన ఓ బీసీ మంత్రిని మాత్రం జైల్లో పెట్టించారు. అంటే.. ఏది తప్పో.. ఏది ఒప్పో ఈ కాంగ్రెస్ వాళ్లే నిర్ణయిస్తారట. ఎవరిని బయట ఉంచాలో.. ఎవరిని జైల్లో పెట్టాలో వాళ్లే తేలుస్తారట. చిరంజీవి ఆయన పార్టీని గంపగుత్తగా అమ్ముకొని కోట్ల రూపాయలు మంచం కింద దాచుకొని దొరికిపోతే ఆయన మీద ఎలాంటి కేసులూ ఉండవు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లిక్కర్ మాఫియాకు నాయకుడని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బినామీ పేరుతో లిక్కర్ దుకాణాలు తెరిచాడని, ఆయన ఒక డాన్ అని కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్ర మంత్రి లేఖ రాస్తే పట్టించుకోరు. ఐఎంజీ భారత కేసులో చంద్రబాబు మీద నెల రోజులలోపు విచారణ చేయాలని కోర్టు.. సీబీఐని ఆదేశిస్తే తమ దగ్గర సిబ్బంది లేరని చెప్పింది. అదే జగనన్న మీద విచారణకు ఆదేశించిన 24 గంటల్లో అదే సీబీఐ 28 బృందాలను పెట్టి జగనన్న, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేసింది’’ అని షర్మిల విమర్శించారు.

ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు: ‘‘నెట్టెంపాడు ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారు. 2004లో 25 వేల ఎకరాల ఆయకట్టుతో నెట్టెంపాడుకు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే 25 వేల ఎకరాలకు కాదు ఏకంగా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని, ఇందుకోసం రూ.1,400 కోట్లు కేటాయించారు. రూ.1,200 కోట్లు ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేశారు. ఇక మిగిలింది 25 శాతం పనులే.. మూడు సంవత్సరాలు గడిచినా ఈ ప్రభుత్వానికి ఆ పనులు చేసే చిత్తశుద్ధి లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రాజెక్టు నుంచి కనీసం 1,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేమని అధికారులు చెప్తున్నా వినకుండా మన ముఖ్యమంత్రి గొప్పలకుపోయి ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి వెళ్లారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరం కూడా నీళ్లు పారడం లేదు’’ అని షర్మిల ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని తప్పబట్టారు.

యాత్రకు నేతల సంఘీభావం

బుధవారం షర్మిల పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యులు మైసూరా రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బాల మణెమ్మ, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, పార్టీ నాయకులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, దేవనాథ్‌రెడ్డి దంపతులు, కాపు భారతి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, నాగర్‌దొడ్డి వెంకటరాముడు, మహేశ్వరమ్మ, మధుమిత, రఘునాథరెడ్డి, మానికేశ్వరరావు, రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుక్కెడు నీళ్ల కోసం 5 కి.మీ.


‘‘మాకు తాగడానికినీళ్లు లేవమ్మా. ఓ బోరులేదు.. ఓ బాయి లేదు.. మంచి నీళ్లు తెచ్చుకోవాలంటే 5 కిలోమీటర్లు పోవాలే. ఇంట్లో మొగొళ్లు పోయి నీళ్లు తెస్తే తెచ్చినట్లు లేకుంటే ఉప్పు నీళ్లే గతి. జేజమ్మ(మంత్రి డీకే అరుణ)ను రచ్చబండకు వచ్చినపుడు మాకు నీళ్లు గావాలే అని అడిగితే తెస్తా అన్నది కాని ఇంత వరకు నీళ్లు లేవు’’ అని సంగాల గ్రామానికి చెందిన జయమ్మ, తిమ్మక్క, సుజాతమ్మ, మహేశ్వరమ్మ అనే మహిళలు షర్మిలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. షర్మిల స్పందిస్తూ.. ‘‘నేను యాత్రలో నడిచిన ప్రతి గ్రామంలో ‘మా గ్రామంలో నీళ్లు లేవమ్మా.. మాకు నీళ్లు లేవక్కా’ అని చాలా మంది అక్కా చెల్లెమ్మలు చెప్తూ బాధపడుతున్నారు. నాకు చాలా బాధనిపించింది. ఇక్కడ ఉన్న మంత్రి ఒక మహిళ.. ఆడవాళ్ల బాధలు ఏమిటో ఒక మహిళగా ఆమెకు తెలిసి ఉండాలి. 

డీకే అరుణకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తాగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించేది. ఆమెకు పదవి మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. కనీసం ప్రజలకు తాగు నీళ్లు ఇవ్వలేని ఆమెకు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. త్వరలోనే జగనన్న వస్తారు. మీ అందరి సమస్యా తీరుస్తారు’’ అని భరోసా ఇచ్చారు. ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 42వ రోజు బుధవారం ఉదయం సంగాల చెర్వు నుంచి మొదలై గనుపాడు మీదుగా ధరూర్ మండల కేంద్రానికి చేరింది. ధరూర్‌లో నిర్వహించిన సభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. షర్మిల అక్కడి నుంచి మన్నపాడు మీదుగా నెట్టెంపాడు వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. బుధవారం 17.50 కిలోమీటర్ల మేర ఆమె నడిచారు. ఇప్పటివరకు మొత్తంగా 571.50 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

[YSR ] షర్మిల నేటి పాదయాత్ర షెడ్యూల్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర బుధవారం గద్వాల శివారులోని నోబెల్ స్కూల్ నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. సంగాల చెరువు, సంగాల క్రాస్ రోడ్, గోనుపాడు, ధరూర్, మన్నాపురం మీదుగా నెట్టెంపాడు ప్రాజెక ు్టకు చేరుకుని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారన్నారు. షర్మిల మొత్తం 17.5 కి.మీ యాత్ర చేపడతారని వారు వివరించారు. 

[YSR ] ప్యాకేజీ మాట్లాడుకోవడానికి నెలరోజుల పాటు ఢిల్లీలో మకాం ...


 టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తప్పుడు సంకేతాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి, వాళ్ల రక్తంతో రూ.కోట్లకు పడగలెత్తారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ ధ్వజమెత్తారు. ప్యాకేజీ మాట్లాడుకోవడానికి నెలరోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన ఆయన రేటు కుదరక తిరిగి వచ్చాడని, ఇప్పుడేమో తెలంగాణ ప్రజల రక్తం తాగేందుకు సిద్ధమయ్యాడని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేత షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం గద్వాలలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ కుటుంబం అంటే ఏమిటో, రాష్ట్రంలో ఆ కుటుంబానికి ఎంతటి అభిమానం ఉందో టీఆర్‌ఎస్ నాయకులకు తెలియదు. జగనన్నను జైలులో పెడితే విజయమ్మ బయటకు వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో షర్మిలమ్మ ముందుకొచ్చి మనందరికీ అండగా నిలబడ్డారని తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మహబూబ్‌నగర్‌లో ఎంపీగా గెలిచిన కేసీఆర్, వాళ్ల పార్టీ ఒక ఎత్తు అని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో పాలమూరులో పళ్లు రాలగొడితే, పరకాలలో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టయింది. ఇప్పుడు తెలంగాణలో షర్మిలమ్మ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వారికి నిద్రపట్టడం లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లా నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు వైఎస్సార్సీపీలో చేరితేనే సూర్యాపేటలో సభ పెట్టుకోవాల్సి వచ్చిందని, వచ్చే రోజుల్లో ఒక్కో జిల్లాలో టీఆర్‌ఎస్ వందకంటే ఎక్కువ సభలే పెట్టుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. వైఎస్ కుటుంబాన్నే టార్గెట్ చేస్తూ ప్రేలాపనలు పలికిన కేసీఆర్‌కు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

12 సంవత్సరాలుగా ఉద్యమం పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న నీకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఆమెరికా నుంచి కొడుకు, కూతురుని పిలిపించుకుని పోస్టులు అప్పజెప్పితే తప్పు లేనిది విజయమ్మ, షర్మిల బయటకు వస్తే తప్పా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యమని చెబుతున్నారు.. నెల రోజులు ఢిల్లీలో మకాం వేసి చివరకు అఖిలపక్షమైనా పెట్టించగలిగారా అని నిలదీశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది పార్టీని విలీనం చేయడానికి కాదు.. ప్యాకేజీ మాట్లాడుకోవడానికి అని మండిపడ్డారు. దీనిని తెలంగాణ ప్రజలు గ్రహించాలని సురేఖ కోరారు. తెలంగాణ ఎలా తెస్తావో ఏ ఒక్కరికైనా విడమరిచి చెబుతున్నావా అని ప్రశ్నించారు. వైఎస్సార్ ఐదేళ్ల పాలనను చూసిన ప్రజలు మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని రెండోసారి గెలిపించారని పేర్కొన్నారు. ఆయన మరణించిన నాటినుంచి ఏ వర్గానికి చెందిన ప్రజలూ ప్రశాంతంగా నిద్రపోలేదని వాపోయారు. పదవులు ఎలా కాపాడుకోవాలా? అని అధికార పార్టీ, ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టాలా అని ప్రతిపక్ష టీడీపీ పనిచేస్తున్నాయని విమర్శించారు.

[YSR ] పదవుల కన్నా పరువే ముఖ్యం

కాంగ్రెస్‌తో టీడీపీ అన్ని రకాలుగా కుమ్మక్కయింది
ఇటీవల ఉప ఎన్నికల్లో అది స్పష్టంగా బయటపడింది
ఆయనతోపాటు పార్టీలో చేరిన తనయుడు వెంకటరమణ


హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘రాజకీయాల్లో ఎంత గొప్ప పదవులు అధిష్టించినా పరువు, మర్యాద లేకపోతే అది వ్యర్థం. అలాగే నాయకుడనే వాడికి విశ్వసనీయత కూడా చాలా అవసరం’’ అని తెలుగుదేశం పార్టీ మాజీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పరువు, మర్యాద కాపాడుకోవడానికే తాను టీడీపీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఉమ్మారెడ్డితో పాటు ఆయన పెద్ద కుమారుడు వెంకటరమణ కూడా పార్టీలో చేరారు. వారిరువురికి విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు ఉమ్మారెడ్డి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైల్లో ములాఖత్ ద్వారా కలుసుకున్నారు. 

జైలు వద్ద, తరువాత విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాక ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీని వదలడానికి కారణాలను వివరించారు. ‘‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ లక్ష్యాలు ఇప్పుడు టీడీపీలో పూర్తిగా కొరవడ్డాయి. ఏ కాంగ్రెస్‌కైతే వ్యతిరేకంగా టీడీపీ ఏర్పడిందో ప్రస్తుత నాయకత్వం అదే పార్టీకి దగ్గరవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలుకొని ఇటీవల జరిగిన ఉప ఎన్నికల దాకా అన్నింటా కాంగ్రెస్‌తో కుమ్మక్కై పనిచేస్తోంది. నెల్లూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఓట్లను ప్రత్యక్షంగా కాంగ్రెస్ అభ్యర్థికి బదలాయించారు’’ అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీల మధ్య క్విడ్ ప్రో కో జరుగుతోందని, ఇటీవల ఉప ఎన్నికల్లోనూ ఇది స్పష్టంగా రుజువైందని చెప్పారు. ‘రామచంద్రాపురం, నర్సాపురం ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయి కాంగ్రెస్‌కు ఓట్లు వేయించింది. ప్రత్తిపాడు, మాచర్లలో టీడీపీకి కాంగ్రెస్ సహకరించాలని రెండు పార్టీల నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. గుంటూరు జిల్లాలో వారి వ్యూహం బెడిసికొట్టింది’’ అని ఆయన వివరించారు. టీడీపీ అనుసరిస్తున్న వైఖరి నచ్చకే2011 ఫిబ్రవరి 19 నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

టీడీపీ ప్రచారంలో వాస్తవంలేదు: ప్రజాభిప్రాయం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన తనపై టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదని ఉమ్మారెడ్డి అన్నారు. గతంలో పి.వి.నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో టీడీపీకి చెందిన ఆరుగురు ఎంపీలు కాంగ్రెస్‌లోకి వెళ్లినా తాను నీతి నియమాలకు కట్టుబడి పార్టీలోనే కొనసాగానన్నారు. అంతేకాదు అప్పుడు చాలా మందికి ఫోన్లు చేసి పార్టీ నుంచి వెళ్లకుండా చూశానని వెల్లడించారు. ‘‘టీడీపీకి మానసికంగా దూరమయ్యాక మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించా. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో నాటుకుపోయాయి. ఎవరెంత దుష్ర్పచారం చేసినా ప్రజలు మళ్లీ వైఎస్ పాలననే కోరుకుంటున్నారు. అది జగన్ వల్లే సాధ్యమవుతుందని భావిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

[YSR ] కాంగ్రెస్ జేబు సంస్థా?

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులపై విచారణ ముగించడానికి ఇంకో మూడు నెలల సమయం పడుతుందని పదవీ విరమణ చేయబోతున్న సీబీఐ డెరైక్టర్ ఏపీ సింగ్ చెప్పడం గర్హనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారమిక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘పదవి నుంచి దిగిపోతూ ఆయనిలాంటి ప్రకటన చేయడమేమిటి? ఈ అధికారుల తీరు చూస్తుంటే అసలు సీబీఐ ఒక రాజ్యాంగ సంస్థా? లేక కాంగ్రెస్ జేబు సంస్థా? అనిపిస్తోంది. ఈ సీబీఐ అధికారి యూపీపీఎస్‌సీ ద్వారా ఎంపికయ్యారా? లేక ఎవరి దయాదాక్షిణ్యాలపైనో కొనసాగుతున్న ఒక ఏజెంటా?’ అని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ.. మానవ విలువలకు కట్టుబడి వ్యవహరించడం లేదని, ఒక వ్యక్తి భావ స్వేచ్ఛను, జీవించే హక్కును కాపాడాల్సింది పోయి కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

జగన్‌ను ఆరు నెలలుగా జైల్లో పెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. ‘విచారణకు ఇంకా మూడు నెలల వ్యవధి కావాలంటున్నారు. అసలు జగన్‌ను మూడు నిమిషాలు జైల్లో పెట్టడానికి కావాల్సిన ఆధారాలు కూడా వారి వద్ద లేవు’ అని అన్నారు. ఈ కేసులో ఇంకా కీలక సమాచారం రావాల్సి ఉందని సీబీఐ చెప్పడం చూస్తుంటే.. ఆ సంస్థ ఎవరో చెప్పినట్లుగా ఆడుతున్నట్టు ఉందన్నారు. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పి.. బయటకు వచ్చిన తరువాత ఎంత సమయమైనా పడుతుందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

ప్రజలంతా గమనిస్తున్నారు: రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆడుతున్న నాటకం, సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని జూపూడి అన్నారు. ‘జగన్‌పై దాఖలైన పిటిషన్‌పైమూడు వారాల్లోగా విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తే.. మూడు వారాలెందుకు రెండు వారాలే చాలని సీబీఐ చెప్పింది. ఆగమేఘాల మీద బృందాలను ఏర్పాటు చేసి, దాడులు నిర్వహించి, నివేదిక ఇచ్చిన వారు ఇప్పుడు దర్యాప్తు విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. కేసుల్లో పది నెలల విచారణ తరువాత ఎన్నికల సమయంలో అదను చూసి కోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా జగన్‌ను అరెస్టు చేశారని గుర్తుచేశారు. ఇదంతా చూస్తుంటే సీబీఐ జగన్‌పై ఎంత కసి, కక్షతో వ్యవహరిస్తోందో అర్థమవుతోందన్నారు. సీబీఐని వెనుక నుంచి ఆడిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు రాష్ట్రంలో నూకలు చెల్లాయని, ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారని చెప్పారు. సీబీఐ మాన్యువల్‌నూ పట్టించుకోవడం లేదని, సుప్రీం ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘మంత్రివర్గాన్ని ప్రశ్నించే అధికారం సీబీఐకి ఎవరిచ్చారని మంత్రి ధ ర్మాన ప్రసాదరావు లేఖ రాస్తే.. ఆయన తప్పు చేయలేదని, మంత్రివర్గ నిర్ణయాలన్నీ సరైనవేనని ప్రభుత్వం చెబుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జారీ అయిన 26 జీవోల లో ఎలాంటి అక్రమాలు లేవని.. క్విడ్‌ప్రోకో లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్పష్టం చేసినపుడు జగన్‌పై కేసెందుకు? ఆయన ఇంకా జైల్లో ఎందుకుండాలి’ అని జూపూడి ప్రశ్నించారు.

నాడెందుకు ప్రశ్నించలేదు

ధర్మానకు ఇప్పుడు మద్దతుగా నిలిచిన మంత్రివర్గం.. వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినపుడు ఒక్కరు కూడా సీబీఐని ప్రశ్నించే సాహసం ఎందుకు చేయలేకపోయారని జూపూడి సూటిగా ప్రశ్నించారు. ‘మీకు రాజకీయ భిక్ష పెట్టి, గెలిపించి మంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు దుర్మార్గుడయ్యాడా? జీవోలు కరెక్ట్ అయినపుడు వైఎస్సార్ ఎలా అవినీతిపరుడ య్యాడు?’ అని నిలదీశారు. నెల్లూరుకు చెందిన న్యాయవాది సుధాకర్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఈ ఏడాది మార్చి 12నాటికి జీవోలు సక్రమమో, అక్రమమో తెలపాలని ఆదేశాలిస్తే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం సమాధానమే చెప్పలేదన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే చంద్రబాబు డొంక తిరుగుడుగా సమాధానం చెబుతున్నారన్నారు.

[YSR ] అక్కా.. జగనన్న ఎప్పుడొస్తాడు..


గద్వాల, న్యూస్‌లైన్: ‘అక్కా జగనన్న ఎప్పుడొస్తాడు.. అన్న రాకుంటే నేను బతకనక్కా’ అంటూ లక్ష్మి అనే అమ్మాయి షర్మిల వద్ద కన్నీటి పర్యంతమైంది. మంగళవారం గద్వాలలోని వేదనగర్‌లో నేతన్నల సమస్యలు తెసుకునేందుకు షర్మిల వెళ్తుండగా.. లక్ష్మి విలపిస్తూ ఆమె వద్దకు వచ్చింది. ‘అక్కా జగనన్న ఎప్పుడొస్తాడు’ అంటూ ప్రశ్నించింది. జగనన్న బయటకు రాకుంటే తాను బతకనంటూ విలపించింది. దీంతో షర్మిల ఆమెను ఓదారుస్తూ అధైర్యపడొద్దని, త్వరలోనే జగనన్న వస్తాడమ్మా అని ధైర్యం చెప్పారు


--

[YSR ] పాదయాత్రకు.. పథకాలకూ...తెలంగాణలోనే శ్రీకారం

తెలంగాణపై ప్రేమ లేకపోతే వైఎస్ ఇవన్నీ ఎందుకు చేస్తారు కేసీఆర్ గారూ?
అందరూ సాధ్యం కాదన్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ను కట్టాలని వైఎస్ సంకల్పించారు
ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 7 జిల్లాల్లో 16లక్షల ఎకరాలకు నీరొస్తుంది..
డీకే అరుణ ఈ ప్రాంత ప్రజలకు మంచి నీరు కూడా అందించలేకున్నారు
కేసీఆర్, టీఆర్‌ఎస్‌కు ప్రజా సమస్యలు పట్టడం లేదు
వైఎస్ పేరును ఉచ్చరించే అర్హత కాంగ్రెస్ వాళ్లకు లేదు
అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు విమర్శలతో సరిపెడుతున్నారు
గద్వాల బహిరంగ సభకు జన ప్రభంజనం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 41, కిలోమీటర్లు: 554


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణ అంటే ప్రేమ లేదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ కుమార్తె షర్మిల అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘వైఎస్సార్‌తన పాదయాత్రను సైతం తెలంగాణ నుంచే మొదలుపెట్టారు. రూ.2 కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, పావలా వ డ్డీ ఇలా నాన్న ఏ పథకమైనా తెలంగాణ నుంచే మొదలు పెట్టారు. ఈ ప్రాంతంపై ప్రేమే లేకపోతే ఇవంతా ఎందుకు చేస్తారు?’’ అని ప్రశ్నించారు. ‘‘అంతెందుకు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారు కదా.. వారిలో ఒక్కరంటే ఒక్కరైనా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కట్టే సాహసం చేశారా? కొంతమంది సీఎంలు ఇది అసాధ్యం అని పక్కనపెడితే, ఇంకొంత మంది సీఎంలు ఇది చాలా కష్టమైన పని అని వదిలేశారు. కానీ తెలంగాణ కోసం దాన్ని కట్టి తీరాలని వైఎస్ సంకల్పించారు. 

అధికారుల్లో ఉత్సాహం నింపేందుకు వాళ్లను చైనాకు తీసుకొని వెళ్లారు. అక్కడ నిర్మించిన త్రీగోర్జెస్ ప్రాజెక్టును వాళ్లకు చూపించి చైనా వాళ్లు కట్టగా లేనిది మనం ప్రాణహిత- చేవెళ్లను ఎందుకు కట్టలేమని చెప్పి దేశంలోనే పెద్ద ఎత్తిపోతల పథకానికి వైఎస్ శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఎంతగానో ప్రయత్నించారు. వైఎస్సార్‌కు తెలంగాణ మీద ప్రేమే లేకుంటే ఏడు తెలంగాణ జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టును కట్టాలనుకునేవారా?’’ అని ఆమె.. కేసీఆర్‌ను నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 41వ రోజు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో సాగింది. గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు వల్ల నేతన్నల ఆత్మహత్యలు

చంద్రబాబు హయాంలో వందలాది మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబాలకు రూ.లక్షన్నర పరిహారం ఇచ్చారని, సబ్సిడీలతో ఆదుకున్నారని షర్మిల చెప్పారు. చేనేత సొసైటీల రుణాలు మాఫీ చేయడం కోసం వైఎస్సార్ రూ.312 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయలేదని విమర్శించారు. వైఎస్ మరణించాక బతుకే భారంగా ప్రజలు బతుకుతున్నారని షర్మిల అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టే బలం చంద్రబాబుకు ఉన్నా.. ఆయన ఆ పని చేయకుండా విమర్శలతో సరిపెడుతున్నారన్నారు. 

మీరు బాగుంటే చాలా?: ‘‘ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డీకే అరుణ మంత్రి అయ్యారు. మంత్రిని అడుగుతున్నా.. మీరు మాత్రమే చక్కగా ఉంటే సరిపోదండీ.. మీ నియోజకవర్గ ప్రజలు బాగున్నారా? లేరా? అని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా?’’ అని షర్మిల ప్రశ్నించారు. తాను దారి వెంట వస్తుంటే ప్రజలంతా తాగు నీళ్లకు ఇబ్బందిగా ఉందమ్మా అని చెప్తున్నారని, తాగు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఇది మీకు అవమానం కాదా? అని అన్నారు. పదవిని కాపాడుకునేందుకు పెట్టిన శ్రద్ధలో సగం ప్రజల మీద పెడితే ప్రజలకు సమస్యలే ఉండవన్నారు.

కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు ప్రజల సమస్యలు పట్టవు

‘‘మీ సిట్టింగ్ ఎంపీ(కేసీఆర్)కిగాని, టీఆర్‌ఎస్ పార్టీకి గాని ప్రజా సమస్యలు పట్టనే పట్టవు. పైగా వైఎస్‌కు తెలంగాణపై ప్రేమ లేదని కేసీఆర్ అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది రూ.700 కోట్లు. కానీ వైఎస్సార్ ఖర్చు పెట్టింది రూ.25,000 కోట్లు. ప్రస్తుతప్రభుత్వం ఖర్చు చేసింది రూ.7,000 కోట్లు. ఈ ముగ్గురిలో తెలంగాణ ప్రాంతమంటే ఎవరికి ప్రేమ ఉంది కేసీఆర్ గారూ?’’ అని షర్మిల ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి జగనన్నకు ఓబులాపురం మైన్స్ ఇచ్చారని, తనకేమో ఖమ్మంలోని బయ్యారం మైన్స్ ఇచ్చారని కేసీఆర్ అంటున్నారని, ఓబులాపురం, బయ్యారంలలో తమకు వాటాలు లేవని నిరూపిస్తే.. చిన్నవాళ్లమైనా తమ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పే సంస్కారం కేసీఆర్‌కు ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. ‘‘మీకో బిడ్డ ఉంది కేసీఆర్ గారు. మీ బిడ్డ మీద ఎవరైనా అభాండాలు, నిందలు వేస్తే మీరు ఊరుకుంటారా? మరి మా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు?’’ అని అన్నారు.

వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే వేడుక చూశారు

‘‘రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేశారు. రెండు సార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ కనీస కృతజ్ఞత లేకుండా ఇదే కాంగ్రెస్ పార్టీ వారు వైఎస్సార్‌ను దోషిగా చూపేందుకు యత్నిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీలు, ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు.. వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే వేడుక చూసినట్లు చూశారే తప్ప ఒక్కరికి అంటే ఒక్కరికైనా చీమ కుట్టినట్టైనా లేదు’’ అని షర్మిల ఘాటుగా విమర్శించారు. పైగా ఇప్పుడు వాళ్లే తాము వైఎస్సార్ అభిమానులమని చెప్పుకొంటున్నారని, అలా చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని అన్నారు. ‘‘నిజాయతీ ఉంటే అభిమానం అనేది గుండెల్లోంచి పుట్టాలి. వీళ్లకు కనీసం వైఎస్సార్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు’’ అని మండిపడ్డారు. షర్మిల 41వరోజు మంగళవారం పాదయాత్రను ఉదయం బూడిదపాడు నుంచి ప్రారంభించారు. పెద్దపల్లి, పాల్వాయి మీదుగా రాత్రి 6 గంటకు గద్వాల పట్టణానికి చేరారు. గద్వాల సభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. అక్కడి నుంచి సంగంబండచెరువు వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మంగళవారం 14.90 కి.మీ. మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తంగా 554 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

బిల్లు రాలేదు.. ఇల్లు పూర్తి కాలేదు

ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో చేసేది లేక ఓ లబ్ధిదారుడు ఆ ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేసుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి గ్రామం మీదుగా మంగళవారం పాదయాత్ర చేసిన షర్మిలకు అక్కడ పలువురు మహిళలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ‘‘మా గ్రామానికి చెందిన తెలుగు వెంకటన్నకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. దీంతో అప్పులు చేసి గోడల వరకు ఇల్లు కట్టుకున్నాడు. అయితే అధికారులు ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఇంటినిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ నిర్మాణం మధ్యలోనే ఆపేసి బతుకుదెరువు కోసం వలసపోయాడు’’ అని వారు చెప్పారు. స్పందించిన షర్మిల ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి ఆదుకుంటాడని హామీ ఇచ్చారు.

నేతల సంఘీభావం: షర్మిలకు సంఘీభావంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు మైసూరారెడ్డి, కొండా సురేఖ, కేకే మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వి. బాలమణెమ్మ, వాసిరెడ్డి పద్మ, సంకినేని వెంకటేశ్వరరావు, లక్ష్మీపార్వతి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, గౌరు వెంకట్‌రెడ్డి, తలశిల రఘురాం, కాపు భారతి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, నాగర్‌దొడ్డి వెంకటరాముడు మంగళవారం యాత్రలో పాల్గొన్నారు.

[YSR ] నేడు వైఎస్సార్ సీపీలోకి వడ్డేపల్లి

రాష్ట్రాభివృద్ధికి ఎనలేని సేవలందించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రలు, కుతంత్రాలతో అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేయడం తనకు బాధ కలిగించిందని హైదరాబాద్ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వడ్డేపల్లి నర్సింగ్‌రావు అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం ఆయన చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్‌లో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరే విషయంపై చర్చించారు. అనంతరం వడ్డేపల్లి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర వల్ల కాంగ్రెస్ రెండుదఫాలు అధికారంలోకి వచ్చి కేంద్ర, రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కూకట్‌పల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసిన రాజశేఖరరెడ్డి తనను రాజకీయాలలో ప్రోత్సహించారన్నారు. ఓదార్పు చేపట్టినందుకే జగన్‌ను కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చేలా చేశారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మకై లేని పోని కేసులు పెట్టి జగన్‌ను జైలుపాలు చేయటం అన్యాయమన్నారు. బుధవారం కూకట్‌పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో తనతో పాటు వేలాది మంది వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని తెలిపారు.

[YSR ] సోనియా చెప్పుచేతల్లో సీబీఐ: రాధా

 ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీబీనీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత వంగ వీటీ రాధా అన్నారు. జగన్ తొందరగావిడుదల కావాలని కోరుతూ వంగవీటి రాధా ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాధా మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ సీబీనీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తోందని, జగన్మోహనరెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. 

[YSR ] ఒక్క రూపాయి వాటా చూపగలరా?

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుకు సమాదానం ఇచ్చారు. ఓబులాపురం, బయ్యారం గనులలో తనకు ఒక్క రూపాయి కూడా వాటాలేదని ఆమె ప్రకటించారు. గద్వాలలో పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల సందోహం మధ్య ఆమె ప్రసంగించారు.తనకు వాటా లేదని నిరూపిస్తే మీరు క్షమాపణలు చెబుతారా? అని కెసిఆర్ ను షర్మిల ప్రశ్నించారు. మీకు ఒక కూతురు ఉంది, ఆమెపై అబాండాలు వేస్తే మీరు ఊరుకుంటారా? తనపై నిందలు ఎందుకు వేస్తున్నారు? అని ప్రశ్నించారు.ప్రజాసమస్యలపై టిఆర్ఎస్ ఎప్పుడైనా పోరాడిందా ? అని ప్రశ్నించారు. కేసిఆర్‌కు ప్రజాసమస్యలు పట్టవని విమర్శించారు.

[YSR ] ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబిఐ:జూపూడి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విషయంలో సిబిఐ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ఆరోపించారు. ఈరోజు ఆయన ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీబీఐ మాన్యువల్ ను కూడా అధికారులు పట్టించుకోవడం 
లేదన్నారు. ఆరునెలలైనా జగన్ కు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ విషయంలో సిబిఐ వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తోందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను కూడా సిబిఐ పట్టించుకోవడం లేదన్నారు.

జిఓలు అన్నీ సరైనవే అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అలాంటప్పుడు క్విడ్‌ప్రోకో ఎక్కడదని ఆయన ప్రశ్నించారు. జిఓలు సరైనవని కోర్టుకు ఎందుకు తెలియజేయరని ఆయన అడిగారు.

జగన్ బెయిల్ కోరినా సిబిఐ జేడీ సమయం కోరడం సరికాదన్నారు. సీబీఐ అధికారులు యూపీఎస్ సి ద్వారా నియమితులయ్యారా? లేక రాజకీయ పార్టీ నేతల ద్వారా ఎన్నికయ్యారా? అని ప్రశ్నించారు. ప్రజాకోర్టులో జగన్దే అంతిమ విజయం అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై జగన్ పై ఎన్నికుట్రలు చేసినా ప్రజలు క్షమించరని హెచ్చరించారు. రేపు సుప్రీంకోర్టులో క్విడ్ప్రోకో లేదని ప్రభుత్వం చెబితే అక్షింతలు వేసి జగన్ కు క్షమాపణ చెప్పి ఇంటికి పంపించవలసి ఉంటుందన్నారు.

[YSR ] నియోజకవర్గ ప్రజలకు తాగడానికి నీరు కూడా ఇవ్వలేకపోవడం మీకు అవమానంగా లేదా?

నియోజకవర్గ ప్రజలకు తాగడానికి నీరు కూడా ఇవ్వలేకపోవడం మంత్రి డికె అరుణ గారూ మీకు అవమానంగా లేదా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రశ్నించారు. గద్వాల్ లో ఈ సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మంత్రి అరుణ ఒక్కరే బాగా ఉంటే సరిపోదని, నియోజకవర్గ ప్రజలు అందరూ బాగుంన్నారా? లేదా? చూడాలన్నారు. పనులు పూర్తి కాకపోయినా కల్వకుర్తిని సిఎం ప్రారంభించారు. ఇప్పుడు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ పాపం ఈ ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. 30ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినా వైఎస్ఆర్ పట్ల ఆ పార్టీకి కృతజ్ఞత లేదన్నారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో చేరుస్తుంటే, ఈ ఎంపీలంతా వేడుక చూసినట్టు చూశారని బాధపడ్డారు. వైఎస్ఆర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా వీరికి అర్హత లేదని చెప్పారు.

ప్రజాసమస్యలపై టిఆర్ఎస్ ఎప్పుడైనా పోరాడిందా ? అని ప్రశ్నించారు. కేసిఆర్‌కు ప్రజాసమస్యలు పట్టవని విమర్శించారు. ఓబులాపురం, బయ్యారం గనులలో తనకు ఒక్క రూపాయి కూడా వాటాలేదని చెప్పారు. అలా నిరూపిస్తే మీరు క్షమాపణలు చెబుతారా? అని టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ను షర్మిల ప్రశ్నించారు. మీకు ఒక కూతురు ఉంది, ఆమెపై అబాండాలు వేస్తే మీరు ఊరుకుంటారా? తమపై నిందలు ఎందుకు వేస్తున్నారు? అని ప్రశ్నించారు. 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు లేనిదీ, వైఎస్ కు, జగనన్నకు ఉన్నది విశ్వసనీయతే అన్నారు. చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని, కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అవిశ్వాసం పెట్టవచ్చని చెప్పారు. అయితే ఆయన పేరుకు బయట తిడుతూ లోపల కుమ్మక్కయ్యారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఈ ప్రభుత్వం ఆయనపై విచారణ చేయదన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీకి భూములు కట్టబెట్టినా దర్యాప్తు చేయరు. అడ్డు తొలగించుకోవడానికి జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టారన్నారు. ఒక్క ఆధారం లేకపోయినా కుమ్మక్కై జైలుపాలు చేశారని చెప్పారు. రెండు పార్టీలూ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని కుట్ర చేశారన్నారు. బెయిలు కూడా రాకుండా ఇంకా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఇన్ని జరుగుతున్నా దేవుడి మీద, మీ మీద జగనన్నకు అపారమైన నమ్మకం ఉందన్నారు. దేవుడు ఉన్నాడు, ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఎవ్వరూ ఆపలేరని షర్మిల ధీమా వ్యక్తం చేశారు.

Tuesday, 27 November 2012

DHARMNA .KRISHNA DAS ANNA IN MARO PRASTHANAM WITH SHARIMILA GARU

JAI DAS ANNA

KOMARAPU .TIRUPATHI RAO HELD GADAPA GADAPA YSR PROGRAM AT MELIYAPUTTI IN PATHAPATNAM CONSISTUENCY

komarapu.Tirupathi rao held gadapa gadapa ysr program in pathapatanam consistuency


Photo

[YSR ] నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం బూడిదపాడు గ్రామ శివారు ప్రాంతం నుంచి ప్రారంభిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. బూడిదపాడు శివారు నుంచి యాత్ర మొదలై పెద్దపల్లి, కుర్వపల్లి క్రాస్ ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రమైన గద్వాలలో ప్రవేశించి రైల్వే స్టేషన్ రోడ్, రాజీవ్ మార్గ్‌కు చేరుకొని అక్కడే వైఎస్‌ఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల మాట్లాడతారన్నారు. బహిరంగ సమావేశం ముగిసిన అనంతరం రాయచూర్ రోడ్ మీదుగా వెళ్లి ఆ రాత్రికి నోబెల్ స్కూల్ సమీపంలో బస చేస్తారు. మంగళవారం షర్మిల మొత్తం 14.9 కి.మీ యాత్ర చేపడతారని వారు వివరించారు. 

[YSR ] బెయిల్ నిరాకరణ హక్కుల ఉల్లంఘనే

రిమాండ్‌లో 90 రోజులు ఉన్న తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వకపోవడాన్ని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ బార్ అసోసియేషన్ అనుబంధ ‘అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం’ తప్పుబట్టింది. చట్ట ప్రకారం దక్కాల్సిన సమాన, న్యాయమైన అవకాశాలను నిరాకరించడం మానవ హక్కుల ఉల్లంఘనేనని సంఘం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎం.తమీమ్ చెప్పారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘90 రోజులు రిమాండ్‌లో ఉంటే బెయిల్ ఇవ్వాల్సిందేనన్న జస్టిస్ లక్ష్మణరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం. జగన్‌కు సంబంధించిన అంశాన్నే మేము నేరుగా ప్రస్తావిస్తున్నాం. ఆయన బెయిల్ పొందడానికి అన్నివిధాలా అర్హుడు. బెయిల్ ఇవ్వడం ద్వారా చట్టప్రకారం ఆయనకున్న హక్కులను గౌరవించాలి. మానవ హక్కుల గురించి మనం మాట్లాడితే.. సమాజంలో జగన్‌కు ఉన్న మద్దతు, అభిమానాన్ని పరిగణనలోనికి తీసుకోవాల్సిందే. సమాజంలోని భిన్న వర్గాల సమస్యల పరిష్కారంలో ఆయన పాత్రను గుర్తించాల్సిందే. జగన్ స్ఫూర్తిదాయకమైన నేతని సమాజంలోని అత్యధికులు అభిప్రాయపడుతున్నట్లు మేము నిర్వహించిన సర్వేలో తేలింది’ అని తెలిపారు. 

[YSR ] '3 నెలల్లో జగన్ కేసుల్లో దర్యాప్తు పూర్తి'

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులపై మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ తెలిపారు. నిపుణుల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని ఏపీ సింగ్ తెలిపారు. కాగా మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని గతంలో సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. అయితే రెండునెలల తర్వాత కూడా సీబీఐ డైరెక్టర్ అదే మాట చెబుతున్నారు.

[YSR ] పెద్దపల్లి చేరుకున్న షర్మిల పాదయాత్ర

మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల చేపట్టిన పాదయాత్ర పెద్దపల్లికి చేరుకుంది. ఆమెకు మహిళలు,అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. షర్మిల మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బూడిదపాడు నుంచి 41వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. పెద్దపల్లి, కురువపల్లి, గద్వాల రైల్వే స్టేషన్‌ రోడ్‌, రాజీవ్‌ మార్గ్‌, వైఎస్‌ఆర్‌ సర్కిల్‌, రాయచూర్‌ రోడ్డు మీదుగా యాత్ర కొనసాగుతుంది.

[YSR ] వైఎస్ జగన్ ను కలిసిన ఉమ్మారెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఉమ్మారెడ్డి చంచల్ గూడ జైల్లో జగన్ కు కలిశారు. ఉమ్మారెడ్డి గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు.

[YSR ] ప్రజలకు ధైర్యం చెబుతూ..


కరెంటు ఉండదు.. అయినా భారీగా బిల్లు వస్తుంది
తాగడానికి నీళ్లు లేవని.. పింఛను ఇవ్వట్లేదని ఆవేదన
సాగు చేయడం కంటే చావడమే మేలంటున్న రైతన్నలు
ఉపాధి కూలీ రూ.30 కూడా రావట్లేదంటున్న కూలీలు
అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్న షర్మిల
జగనన్న వచ్చాక రాజన్న రాజ్యం తెస్తాడంటూ భరోసా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’సోమవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 40, కిలోమీటర్లు: 539.10

‘‘నాకు నాలుగెకరాలు ఉంది. ఇంకో రెండు ఎకరాలు గుత్తకు తీసుకున్నా.. ఇంత పత్తి, ఇంత మేరప(మిరప), ఇంత శనగ ఏసినా.. ఇప్పటి వరకు లచ్చ(లక్ష) ఖర్చు పెట్టినా.. కరెంటు లేక పంట మొత్తం పోయింది. ఎకరానికి మూడు క్వింటాళ్ల పత్తి ఎల్లింది(దిగుబడి). సేటుకు అమ్మితే క్వింటాల్‌కు రూ.3000 కూడా పడలేదు. దాంట్లోనే పురుగు మందులు, ఎరువుల దుడ్లు సేటు తీసుకునేడు. ఈ సాగు చేసి నేను ఎట్టా బతకాలక్కా! చెప్పు.. ఏం ఫాయిదా లేదు. ఇంత పురుగుల మందు తాగి సచ్చిందే మేలు.’’
- కలుకుంట్లకు చెందిన రైతు ఉరుకుందయ్య కన్నీళ్లు..

‘‘పొద్దంతా సేను చెలకల్లో కాయ కష్టం చేసుకుంటాం.. ఒళ్లు అలసి ఇంటికి వస్తే కరెంటే ఉండదు. చీకట్లనే ఎట్లోగట్టా ఒండుకొని తిని పడుకోబోతే కరెంటు లేక ఫ్యాను తిరగదు. దోమలు సూదులుగుచ్చినట్లు పీక్క తింటాయి. కరెంటు బిల్లు జూద్దామంటే రూ.400, రూ.500కు తక్కువ రాదు. అదీ.. ఇదీ అని లేదు అన్ని రేట్లూ పెంచిండ్రు. ఇక ఎట్టా బతకాలే. ఇదేమన్నా సర్కారేనా?’’
- బింగిదొడ్డి గ్రామానికి చెందిన కూలీ భారతమ్మ ఆవేదన..

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మహబూబ్‌నగర్ జిల్లాలో చేస్తున్న పాదయాత్రలో సోమవారం ఆమె వద్ద గోడు వెళ్లబోసుకున్న వారిలో కేవలం ఇద్దరి ఆవేదన ఇది. జిల్లాలో పాదయాత్ర సాగుతున్న దారిపొడవునా ఇలా ఎందరో వచ్చి ఆమెకు తమ కష్టాలు చెప్పుకొంటున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్క పాలమూరు జిల్లానే కాదు.. ఇంతకుముందు పాదయాత్ర సాగిన వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. రైతు కావచ్చు, కూలీ కావచ్చు, చేనేత కార్మికుడు కావచ్చు... అందరిదీ ఒకటే ప్రశ్న.. ‘ఈ సర్కారు కాల్చుకుతింటుంటే ఎలా బతకాలి?’ అన్నదే వారి ఆవేదన. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’లో వీరంతా ఆమెను కలిసి తమ గోడు చెప్పుకొంటున్నారు.

తాగడానికి నీరు లేదు.. పింఛన్ రావట్లేదు..


ఇంతవరకు షర్మిల నడిచిన 539 కిలోమీటర్ల యాత్రలో 4 జిల్లాల ప్రజలను పలకరించారు. సగటున 170కిపైగా పల్లెలు 6 మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లను చుట్టి ప్రజల గుండె చప్పుడు విన్నారు. లక్షలాది మంది ప్రజలతో మాట్లాడారు. ప్రతి గ్రామంలో షర్మిల రచ్చబండ కార్యక్రమంలో మహిళల కన్నీళ్లు, కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆమెతో మాట్లాడిన ప్రతి 10 మందిలో ఏడుగురు రోజుకు రెండు మూడు గంటలకు మించి కరెంటు రావడం లేదని, బిల్లు మాత్రం రూ.400 తగ్గడం లేదని, రేషన్‌కార్డు మీద ఇస్తున్న 16 కిలోల బియ్యం సరిపోవడం లేదని, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని చెప్పుకొచ్చారు. మరికొందరు తమకు వైఎస్సార్ ఉన్నప్పుడు పింఛన్ వచ్చిందని, ఇప్పుడు రావటం లేదని, తమకు ఇళ్లు రాలేదని ఫిర్యాదు చేశారు. ఆమెతో మాట్లాడిన రైతుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ మూడేళ్లలో సాగు చేసి తాము బాగుడ్డామని చెప్పిన వాళ్లు లేరు.

వైఎస్‌తోనే ఫీజుల పథకం పోయింది: షర్మిల విద్యార్థులను కలిసినపుడు ప్రధానంగా వారు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందట్లేదని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఇంటర్మీడియట్ పాసైనా ఫీజుల పథకం అందక, పేదరికంతో డిగ్రీ చదవలేక చంద్రకళ అనే బాలిక కూలి పనులకు వెళ్తోంది. ఈమె పత్తి చేలో పత్తి తీస్తున్నప్పుడు షర్మిల పలకరించారు. వైఎస్సార్ బతికుంటే ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కూడా బతికే ఉండేదని, అప్పుడు తాను ధైర్యంగా డిగ్రీ చదివేదానినని చంద్రకళ చెప్పింది. ఇక అనంతపురం జిల్లా ధర్మవరంలో విశ్వనాథ్, వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో విజితలదీ ఇదే మాట.

ఉపాధి పనులకు పోతే రూ. 30 ఇస్తున్నారు: ఇక కర్నూలు జిల్లా బిణిగేరలో జయమ్మ, మల్లీశ్వరీ, భారతీ అనే మహిళలు.. షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘మాకు ఉపాధి కూలి రూ. 20 ఇస్తున్నారమ్మా.. ఈ డబ్బులతో ఎట్లా బతకాలి? అదే రాజన్న ఉన్నప్పుడు రూ. 80 నుంచి 120 వరకూ వచ్చేది’’ అంటూ గోడు చెప్పుకొన్నారు. ఇడుపులపాయ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా నడిగడ్డ వరకు ప్రతి గ్రామంలోనూ ఉపాధి కూలీ రూ.30 లోపే పడుతున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లా జులకల్‌లోనైతే రూ.18 మాత్రమే కూలీ పడిందని చెప్పారు. తమకు పావలా వడ్డీ అందడం లేదని మహబూబ్‌నగర్ జిల్లా ఐజకు చెందిన ఫకీరమ్మ, మస్తానమ్మ షర్మిలకు మొరపెట్టుకున్నారు. ఇదే జిల్లాలో మూడేళ్ల కిందట వచ్చిన కృష్ణా వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలు తమకు ఇప్పటికీ సాయం అందలేదని షర్మిలకు ఫిర్యాదు చేశారు.

ప్రజలకు ధైర్యం చెబుతూ: ఇన్ని కష్టాలు, సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు షర్మిల ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తాడని, రాజన్న రాజ్యం తెస్తాడని, వైఎస్ అమలు చేసిన పథకాలను తాను కూడా అమలు చేస్తాడంటూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. 


బాబు యాత్రలో చిత్తశుద్ధి ఏది?: షర్మిల

బలమున్నా అవిశ్వాసం పెట్టరేమని నిలదీత

‘‘ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. నిలదీయాల్సిన చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడుతూ పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత ఎమ్మెల్యేల బలం ఆయనకు ఉన్నా అవిశ్వాసం మాత్రం పెట్టరట. ఇదీ చంద్రబాబు గారి పాదయాత్రలో ఉన్న చిత్తశుద్ధి’’ అని షర్మిల టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. పాదయాత్ర 40వ రోజు సోమవారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజా సమస్యలు తెలుసుకుని మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక రోజు వస్తుంది.

ఉద యించే సూర్యుడిని ఎలాగైతే ఆపలేమో..! జగనన్నను కూడా అలాగే ఎవరూ ఆపలేరు. ఆ రోజున అన్న బయటకు వస్తాడు. మనందరినీ రాజన్న రాజ్యంవైపు తీసుకెళతాడు. రాజన్న రాజ్యం స్థాపిస్తాడు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాడు. ప్రతి మహిళా తన పిల్లలను బడికి పంపేందుకు వీలుగా ‘అమ్మ ఒడి’ ద్వారా అమ్మ బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ. 500, ఇంటరైతే రూ. 700, డిగ్రీ అయితే రూ. 1000 వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు రూ. 1000 పెన్షన్ ఇస్తాడు’’ అని హామీ ఇచ్చారు.

పాదయాత్ర 40వ రోజు సోమవారం బింగిదొడ్డి నుంచి ప్రారంభమైంది. తాటికుంట్ల, శేశంపల్లి మీదుగా మల్దకల్ చేరుకుంది. అక్కడి నుంచి అమరవాయి మీదుగా బూడిదపాడు శివారులో ఏర్పాటు చేసిన బసకు షర్మిల చేరుకున్నారు. పలు గ్రామాల్లో షర్మిల రచ్చబండ నిర్వహించారు. సోమవారం యాత్ర 16.20 కిలోమీటర్లు సాగింది. ఇప్పటి వరకు మొత్తం 539.10 కిలో మీటర్ల యాత్ర పూర్తయింది.

నేతల సంఘీభావం

యాత్రలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మైసూరా రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, బాలమణెమ్మ, వాసిరెడ్డి పద్మ, ఎడ్మ కిష్టారెడ్డి, గౌరు వెంకటరెడ్డి, తలశిల రఘురాం, చల్లా వెంకట్రామిరెడ్డి, కాపు భారతి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

[YSR ] కాంగ్రెస్‌కు వడ్డేపల్లి గుడ్‌బై



కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడైన వడ్డేపల్లి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రజల అభిమాన నేత అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని తప్పుడు కేసులతో వేధిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూకట్‌పల్లిలో తన అనుచరులు, అభిమానులు, స్నేహితులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తమైపోయిందని, పార్టీ పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, తన అనుచరుల అభిప్రాయం మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న తనకు పీజేఆర్, అనంతరం వైఎస్ రాష్ట్రస్థాయిలో గౌరవమిచ్చారని, చైర్మన్ పదవి, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని చెప్పారు. వైఎస్ ప్రోత్సాహంతోనే రాజకీయంగా ఎదిగానన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్టపడ్డవారికి కాకుండా వేరే వారికి టిక్కెట్లు ఇచ్చారని, తనను పార్టీకి దూరం చేసే విధంగా నాయకులు వ్యవహరించారని తెలి పారు. అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన వైఎస్‌ను ప్రజలు మరువలేకపోతున్నారని, ఆ పథకాలన్నీ దేశవ్యాప్తంగా కీర్తిగడించాయని చెప్పారు. ఈ పథకాలను నీరుగారుస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనన్నారు. తనతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు.

[YSR ] జగన్‌ను అరెస్ట్ చేసి ఆర్నెల్లు..


జన సంక్షేమమే జెండాగా, ఎజెండాగా పనిచేసిన వైఎస్సార్ కన్నుమూసిన దురదృష్టకరఘటన రాష్ట్రాన్ని ఎలా కుదిపేసిందో మనకు తెలుసు. ఆ పిడుగుపాటులాంటి వార్తను తట్టుకోలేక ఎన్నివందలమంది గుండె పగిలి చనిపోయారో కూడా మనం చూశాం. కొండంత తండ్రి హఠాన్మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ యువకుడిని ఈ మరణాలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలోనే వైఎస్సార్ చనిపోయిన పావురాలగుట్ట చెంత, నల్లకాలువ సాక్షిగా జరిగిన సభలో మాట్లాడుతూ ఈ మరణాలను గుర్తుకు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇలా గుండె పగిలి చనిపోయినవారంతా తనకు ఆత్మబంధువులేననీ, వారి కుటుంబ సభ్యులందరినీ వారి ఇళ్లలోనే కలుసుకుని ఓదార్చడం తన ధర్మమనీ, ఆ ధర్మాన్ని వెంటనే నెరవేరుస్తానని ప్రకటించాడు. కానీ, ఓదార్పు యాత్ర చేయరాదని అత్యున్నత అధికార పీఠం శాసించడం...ఆజ్ఞ జవదాటితే కష్టాలు తప్పవని సంకేతాలివ్వడం... ఇచ్చిన మాట కోసం జగన్ ముందుకే నడవడం... ఇదంతా జనం మదిలో తాజా జ్ఞాపకమే.

జగన్‌ను జైల్లో పెట్టి ఆరు నెలలయింది. 
ఈ ఆరు నెలల్లో ఏం జరిగింది.. ‘మాటే’ మంత్రమైంది. 
జగన్ మాట మీద నిలబడ్డ తీరుకు యావత్తు రాష్ట్ర ప్రజానీకం మంత్రముగ్ధమైంది. విశ్వసనీయతే ఇప్పుడు రాజకీయాల్లో గీటురాయిగా మిగిలింది. మిన్ను విరిగి మీదపడినా ఇచ్చిన మాటకోసం నిలబడినవాడే ఇక నిజమైన లీడర్. ఇవాళ వైఎస్ కారణంగానే కేంద్రంలో వరుసగా రెండోసారి పదవీ వైభోగాలను అనుభవిస్తున్నామన్న ఇంగిత జ్ఞానం ఢిల్లీ పెద్దలకు లేకపోయినా...ఆయనవల్లే తమకు పదవులొచ్చాయని ఇక్కడి నాయకులు మరిచిపోయినా అశేష ప్రజానీకం మాత్రం మరిచిపోలేదు. అయిదేళ్ల వైఎస్ పాలనలో మాట ఇచ్చి నిలుపుకున్న తీరును గుర్తుంచుకున్నారు. తమకు ఇచ్చిన మాట కోసం జగన్ ఎదుర్కొంటున్న వేధింపులను చూసి వారు చలించిపోయారు. పార్టీలు వేరైనా, ప్రాంతాలు ఏవైనా ఒక్కడిని లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు తూటాలు పేలుతున్నాయి. అది తెలుగుదేశమా... 

కాంగ్రెస్సా...టీఆర్‌ఎస్సా అనే భేదం లేదు. అందరి గురీ జగన్‌పైనే. అందరి లక్ష్యమూ ఆయనను ఇబ్బందులపాలు చేయడమే...ఆయనకున్న ప్రజాభిమానాన్ని తగ్గించడమే. కానీ, అలాంటివారి ఆశలు నెరవేరేలా లేవు. వారి కలలు ఫలించేలా లేవు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని పలకరించినా జగన్నామనాదమే జనన్నినాదం. ఏ సంస్థ సర్వే నిర్వహించినా జగన్ పార్టీ విజయజోస్యాలే! జగన్‌ను జైల్లో పెట్టడం ద్వారా పాలకులు ఆశించిన ఫలితం తలకిందులైంది. రాష్ట్రంలో జగన్‌పై మూకుమ్మడిగా సాగుతున్న కుట్రలను జనం గ్రహించారు. ఎవరేమిటో గుర్తించారు. జగన్‌కు తమ హృదయాల్లో చోటిచ్చిన ఈ ప్రజానీకం పెద్ద చదువులు చదివినవారు కాదు. డబ్బున్న మారాజులు అసలే కాదు. వారంతా జగన్‌ను తమ కుటుంబంలో ఒకడిగా చూశారు. అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా ఆయనకు సమున్నత స్థానం కల్పించారు. ఇచ్చిన మాటకు కట్టుబడితే, ఆ మాట కోసం దేన్నయినా ఎదిరించే సాహసాన్ని ప్రదర్శిస్తే, ఎంత పెద్ద పదవినైనా తృణప్రాయంగా తిరస్కరిస్తే...ప్రజలు తమవాడిగా గుర్తిస్తారని, ఆరాధిస్తారని, ప్రేమిస్తారని జగన్ రుజువుచేశారు.

అసలెందుకు ఇలా జరిగింది? జగన్ చేసిన తప్పేమిటి? ఇచ్చిన మాట కోసం ప్రలోభాలనూ, బెదిరింపులనూ బేఖాతరుచేసి ఆయన ఓదార్పు యాత్ర చేపట్టాడు. మాట తప్పనందుకు...మడమ తిప్పనందుకు ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు. తమది మురికివాడ అయినా...తామున్న ఇరుకిరుకు గుడిసెలోనికొచ్చి సాంత్వన వాక్యాలు పలికిన ఆ యువకుడికి తమ హృదయ కవాటాలు తెరిచి ఆహ్వానం పలికారు. ఆయనకు దాహం వేస్తున్నదని గొంతు తడిపారు. ఆయనకు ఆకలిగా ఉన్నదని తమ చేతులతో అన్నం ముద్దలు తినిపించారు. తన తండ్రి కనుమరుగవడంతో కలిగిన దుఃఖాన్ని మునిపంట అదుముకొని... తమకు దూరమైన ఆప్తుల గురించి వివరాలు అడిగాడని మురిసిపోయారు. తామెలా ఉంటున్నదీ, ఏం చేస్తున్నదీ తెలుసుకున్నాడని అబ్బురపడ్డారు. అండగా ఉంటానని బాస చేసినందుకు సంబరపడ్డారు. ఆయన ఎక్కడ అడుగుబెడితే అక్కడికి జనం జనమే వెల్లువెత్తారు. ఎండా, వానా లేదు. కొండా, కోనా లేదు. గజగజ వణికించే చలి అయినా, తీవ్రవాదులు సంచరిస్తున్న ప్రాంతం అయినా లెక్కేలేదు. ఒక ఊరు తర్వాత మరో ఊరిని పలకరిస్తూ...అరక్షణం తీరిక లేకుండా, అలుపెరగకుండా మునుముందుకు సాగుతూనే ఉన్నా ఆయన ముఖంపై చిరునవ్వు చెదరకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తనను తాకుతున్న జనసాగర కెరటాలతో ప్రతి ఊరూ పులకరించిపోయింది. వ్యక్తికి బహువచనం శక్తి అయినట్టుగానే...జగన్‌కు పర్యాయపదం జనం అయింది.

ఆంధ్రదేశమంతటా దాదాపు మూడేళ్లపాటు పదేపదే నిత్యమూ పునరావృతమైన ఈ ఉజ్వల దృశ్యమే కొందరికి కడుపుమంట అయింది. కష్టంలో ఉన్న కుటుంబాలను పలకరించడమే వారికి కంటగింపయింది. వేలాదిమందిని పరామర్శించి ధైర్యవచనాలు పలకడం ‘ఆ కొందరి’ వెన్నులో వణుకుపుట్టించింది. ఇలాగైతే ఇక తమ పని ఖాళీ అనుకున్నారు. ఓట్ల జాతరనాడు తప్ప పల్లెల ముఖం చూడని, ప్రజలను పలకరించని తమ పద్ధతికి విరుద్ధంగా ఉన్నాడని కంగారుపడ్డారు. కదలబారుతున్న పల్లెల్ని చూసి ఢిల్లీ కళవళపడింది. 

వైఎస్సార్ కాంగ్రెస్‌నూ, జగన్ ప్రతిష్టను దెబ్బతీయడం ఎలా...? ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని చెరిపేయడం ఎలా? ఇవే ఢిల్లీ పెద్దలను దొలుస్తున్న ప్రశ్నలు. పర్యవసానంగా పెద్ద కుట్రకు తెరలేచింది. తొలుత ఇన్‌కమ్ టాక్స్ నోటీసుల రూపంలో బెదిరింపులు మొదలయ్యాయి. అటుపై కాంగ్రెస్‌నుంచి ఎమ్మెల్యే శంకర్రావు రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. అటు తెలుగుదేశంనుంచి మరో ముగ్గురు నాయకులు జత కలిశారు. రెండుపక్షాలవారూ దాఖలుచేసిన డాక్యుమెంట్లూ ఒకటే! అందులోని ఆరోపణలన్నీ యెల్లో మీడియా అంతకు మూడేళ్లనుంచీ పదే పదే రాస్తున్న కథనాల్లోనివే. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 26 జీవోలు ఈ కేసుకు మూలమని, ఇందులో క్విడ్ ప్రో కో జరిగిందని ప్రధాన ఆరోపణ. ఈ కేసు గురించి మీరేం చెబుతారని హైకోర్టు ప్రశ్నించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం పాటించింది. కౌంటర్ దాఖలు చేయాల్సివున్నా మిన్నకుండిపోయింది. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించాక కేంద్రం పావులు కదిపింది. ఇక సీబీఐ దర్యాప్తు అంతా దాని కనుసన్నల్లోనే నడుస్తోంది. క్విడ్ ప్రో కో జరిగిందని రుజువు చేయడానికి అనుసరించవలసిన మార్గాన్ని వదిలిపెట్టారు. జీవోల జారీ ప్రక్రియలో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయో ఆరా తీసి వాటికి బాధ్యులైన అధికారులెవరో, మంత్రులెవరో మొదట గుర్తించవలసి ఉండగా...దాన్ని విడిచిపెట్టి జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారిని వేధించడం మొదలుపెట్టారు. దాడులకు దిగారు. అరెస్టులు చేశారు. సంప్రదాయానికి విరుద్ధంగా చార్జిషీట్ల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. వేలాదిమంది పనిచేస్తున్న ‘సాక్షి’ గొంతు నొక్కాలని చూశారు. దాని ఆర్ధిక వనరుల్ని స్తంభింపజేసే చర్యలకు పూనుకున్నారు. అటాచ్‌మెంట్లకూ తెరతీశారు. ఆఖరికి 18 స్థానాలకు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో... జగన్‌మోహన్ రెడ్డి మరో మూడు రోజుల్లో కోర్టు ముందు హాజరుకాబోతున్న తరుణంలో ఆయనను ప్రశ్నించే నెపంతో పిలిచి అరెస్టుచేశారు. ప్రజలు ఆ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అఖండ విజయం చేకూర్చి కుట్రదారులకు బుద్ధిచెప్పారు. అయినా ఢిల్లీ పెద్దల్లో ఆశ చావలేదు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావలసి ఉన్న ప్రతి సందర్భంలోనూ న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా అటు సీబీఐ ద్వారాగానీ, ఇటు ఈడీ ద్వారాగానీ ఏదో ఒకటి చేయించడం, ఇక్కడ ఏదో జరుగుతున్నదనే భావన కలిగించడం వారికి అలవాటైపోయింది. ఆఖరికి మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిల్ రావడం ఖాయమని ఈ రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం ఎంపీలు ఆగమేఘాలపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరంను కలవడం, వెనువెంటనే ఆయన ఈడీని ఉసిగొల్పడం రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఈ ఉమ్మడి కుట్రలకు కారణం...జగన్‌ను జైలు గోడలకే పరిమితం చేస్తే కొంతకాలానికైనా జనం ఆయనను మర్చిపోతారన్న భ్రమ ఉండటంవల్లే. కానీ, ఈ భ్రమలు పటాపంచలవుతాయి. ఈ కుట్రలు భగ్నమవుతాయి. అందుకు నడుస్తున్న చరిత్రే ప్రత్యక్ష సాక్ష్యం. ఇది పదే పదే నిరూపణ అవుతున్న సత్యం.

[YSR ] చరిత్రపుటల్లో ‘మరో ప్రజాప్రస్థానం’

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మహిళా నేతగా ఇదివరకు 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారని, అయితే ‘మరో ప్రజాప్రస్థానం’ ద్వారా షర్మిల 500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు ఉన్న రికార్డును బద్ధలుగొట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం.వి. మైసురారెడ్డి వెల్లడించారు. పాదయాత్రలో మైసురారెడ్డి సోమవారం పాల్గొని షర్మిలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన పథకాలు ప్రజలను బాగా ఆకర్షించాయని, దీంతో ఆయన కుమార్తె షర్మిల చేపట్టిన యాత్రకు గ్రామగ్రామనా అఖండస్వాగతం లభిస్తోందని తెలిపారు.

[YSR ] బెయిల్ నిరాకరణ హక్కుల ఉల్లంఘనే

రిమాండ్‌లో 90 రోజులు ఉన్న తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వకపోవడాన్ని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ బార్ అసోసియేషన్ అనుబంధ ‘అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం’ తప్పుబట్టింది. చట్ట ప్రకారం దక్కాల్సిన సమాన, న్యాయమైన అవకాశాలను నిరాకరించడం మానవ హక్కుల ఉల్లంఘనేనని సంఘం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎం.తమీమ్ చెప్పారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘90 రోజులు రిమాండ్‌లో ఉంటే బెయిల్ ఇవ్వాల్సిందేనన్న జస్టిస్ లక్ష్మణరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం. జగన్‌కు సంబంధించిన అంశాన్నే మేము నేరుగా ప్రస్తావిస్తున్నాం. ఆయన బెయిల్ పొందడానికి అన్నివిధాలా అర్హుడు. బెయిల్ ఇవ్వడం ద్వారా చట్టప్రకారం ఆయనకున్న హక్కులను గౌరవించాలి. మానవ హక్కుల గురించి మనం మాట్లాడితే.. సమాజంలో జగన్‌కు ఉన్న మద్దతు, అభిమానాన్ని పరిగణనలోనికి తీసుకోవాల్సిందే. సమాజంలోని భిన్న వర్గాల సమస్యల పరిష్కారంలో ఆయన పాత్రను గుర్తించాల్సిందే. జగన్ స్ఫూర్తిదాయకమైన నేతని సమాజంలోని అత్యధికులు అభిప్రాయపడుతున్నట్లు మేము నిర్వహించిన సర్వేలో తేలింది’ అని తెలిపారు.

Monday, 26 November 2012

[YSR ] ముగిసిన 40వ రోజు మరో ప్రజాప్రస్థానం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల 40వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగిసింది. ఈరోజు ఆమె 16.2 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటి వరకు షర్మిల 538.92 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు.

[YSR ] నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం అయిజ శివారు ప్రాంతం నుంచి ప్రారంభిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు. అయిజ దాటిన తర్వాత 5 కిలోమీటర్ల నుంచి యాత్ర ప్రారంభమై బింగిదొడ్డి, తాటికుంట్ల క్రాస్, శేషంపల్లి క్రాస్, శేషంపల్లి క్రాస్‌రోడ్, మల్దకల్, శుద్దనూనెపల్లి మీదుగా బూడిదపాడుకు చేరుకొని ఆ రాత్రికి గ్రామ సమీపంలో బస చేస్తారని పేర్కొన్నారు. సోమవారం మొత్తం 16.2 కి.మీ. యాత్ర చేపడతారని వారు తెలిపారు.

[YSR ] వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ బలపడుతుండడంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ బలపడుతుండడంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణను అందరికంటే ఎక్కువగా వైఎస్సార్ అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. పాలమూరు జిల్లాలో 4 ప్రాజెక్టులను తీసుకొచ్చింది ఆయనేనని తెలిపారు.

[YSR ] ఉనికి కోసమే టీఆర్‌ఎస్ సభ:జిట్టా


తెలంగాణలో తన ఉనికి కాపాడుకోవడం కోసమే టీఆర్‌ఎస్ పార్టీ సూర్యపేటలో సభ నిర్వహించిందని వైఎస్‌ఆర్ సీపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. గతంలో వైఎస్‌ఆర్ చెప్పిన పథకాలనే కేసీఆర్ ప్రస్తావించారన్నారు. వైఎస్ వల్లే బీబీనగర్ నిమ్స్ వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన బతికి ఉంటే.. అది ఎప్పుడో అందుబాటులోకి వచ్చేదన్నారు. పులి చింతల ప్రాజెక్టు సమయంలో క్యాబినెట్లో టీఆర్‌ఎస్ మంత్రలున్నారని, అప్పుడు మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కేటీఆర్ చేసుకున్న చీకటి ఒప్పందాల మాటేంటని అడిగారు. కేసీఆర్‌ ఆస్తులు అప్పటికీ, ఇప్పటికీ ఎంత పెరిగాయో బహిరంగ చర్చకు సిద్ధమం కావాలని జిట్టా సవాల్ విసిరారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో విస్తృత ఆదరణ ఉందని, షర్మిల పాదయాత్రకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతుండటమే దీనికి నిదర్శమన్నారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోవడం లేద ని జట్టా తెలిపారు.

[YSR ] వైఎస్‌ఆర్ సీఈసీ సభ్యుల నియామకం

వైఎస్‌ఆర్ సీపీ సీఈసీ సభ్యులను నియమించారు. కృష్ణా జిల్లా నుంచి కుక్కల నాగేశ్వరరావును, ఖమ్మం జిల్లా నుంచి యడవల్లి కృష్ణలను నియమించారు. 

కాకినాడ నగర యువజన విభాగం కన్వీనర్‌గా మల్లాది రాజును నియమించారు.

[YSR ] మైనార్టీ మహిళలతో షర్మిల రచ్చబండ

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మల్దకల్‌లో మైనార్టీ మహిళలతో రచ్చబండ నిర్వహించారు. మహిళలు తమ బాధలను ఆమెకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ఆర్ హయాంలోనే ముస్లింలకు భద్రత ఉండేదన్నారు. రాష్ట్ర భవిష్యత్‌పై జగనన్నకు ప్రత్యేక ప్రణాళికలున్నాయని చెప్పారు.

[YSR ] వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి మూడున్నరేళ్లు అయ్యిందని, మరి ఇప్పుడు తెలంగాణను ఎవరు అడ్డుకుంటున్నారని

 వైఎస్ఆర్ కుటుంబాన్ని అభాసుపాలు చేయటానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. సూర్యాపేటలో టీఆర్ఎస్ పెట్టిన సభ ఆపార్టీ ఉనికి కోసమే తప్పా ప్రజల కోసం కాదని ఆయన మండిపడ్డారు. 

సోమవారం పార్టీ కార్యాలయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానాలు చేసినవారి మీద ఆధారపడి లబ్ధి పొందాలని చూడటం హేయమైన చర్య అని విమర్శించారు. తెలంగాణ వస్తే రెండు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ సీపీకి పెరుగుతున్న విస్తృత ఆదరణ చూసి టీఆర్ ఎస్ ఆదరణ కోల్పోతుందనే భయంతోనే అనవసర ప్రేలాపనలు చేస్తుందని జిట్టా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

పులిచింతల సమయంలో మంత్రివర్గంలో టీఆర్ఎస్ మంత్రులు కూడా ఉన్నారని, అప్పుడు ఎందుకు నోరు విప్పలేదని జిట్టా సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్ వల్లే బీబీనగర్ కు నిమ్స్ వచ్చిందని, ఆయన బతికి ఉండిఉంటే అది ఎప్పుడో ప్రజలకు అందుబాటులోకి వచ్చేందన్నారు. 

సోనియా, రాహుల్, కాంగ్రెస్ పార్టీ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడరని ఆయన అన్నారు. వక్ఫ్ భూములపూ కేసీఆర్ పోరాటం ఏమైందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి మూడున్నరేళ్లు అయ్యిందని, మరి ఇప్పుడు తెలంగాణను ఎవరు అడ్డుకుంటున్నారని జిట్టా ప్రశ్నించారు.

[YSR ] సకలజనుల సమ్మెను తాకట్టుపెట్టి, పోలవరం కాంట్రాక్టు

ప్రత్యేక తెలంగాణపై టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసే ప్రకటనలన్నీ పొంతనలేనివని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు. తెలంగాణ ఇస్తాం చర్చలకు రమ్మని కెసిఆర్ ను 
ఎవరు పిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. సకలజనుల సమ్మెను తాకట్టుపెట్టి, పోలవరం కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఈ విషయం అన్ని పత్రికల్లో వచ్చిందన్నారు. 

దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని, కెసిఆర్ కనీసం ఆయనకు నివాళులు కూడా అర్పించలేదని విమర్శించారు. తెలంగాణ అమరుల పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారన్నారు. 

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ హయాంలోనే ఎస్ఎల్ బీసీ తొలివిడత పనులు పూర్తయ్యాయని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు నిలిచిపోయాయన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు.

[YSR ] బాబు దత్తత తీసుకొని దగాచేశారు

పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని చెప్పిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయకుడు తొమ్మిదేళ్లలో ఈ జిల్లాకు ఏమీచేయకుండానే మోసంచేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ సీజీసీ సభ్యులు కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు. ‘‘కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి వదిలేశారు. అలాగే నడిగడ్డలోనూ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ఎన్నికలకు ముందు హడావుడిగా శిలాఫలకం వేసి ప్రజలను నమ్మించాలని చూశారు. జిల్లాప్రజలను కూలీలుగా మార్చిన ఘనత ఆయనకే దక్కింది’ అని ధ్వజమెత్తారు. ఆదివారం నడిగడ్డలో షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంతో అనుబంధం ఉందని, జిల్లాలో వలసల సమస్య శాశ్వతపరిష్కారానికి పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టారన్నారు. కడప గడపన పుట్టిన వైఎస్ రాజధానికి పాలమూరు జిల్లా ద్వారా వెళ్లిన ప్రతిసారి ఈ జిల్లా ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచించేవారని గుర్తుచేశారు. 

వైఎస్ జిల్లాలో నాలుగు ప్రధాన ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపించాలనే ఆశయంతో పలు పనులు మంజూరుచేశారన్నారు. ఇందులో భాగంగానే జడ్చర్ల వద్ద సెజ్ ద్వారా పాలమూరు ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులు చేపట్టారన్నారు. వలసల నివారణకు వేలాదికోట్లు కేటాయించారని తెలిపారు. ఆయన వారసులైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. పాలమూరు జిల్లాపై వైఎస్ కుటుంబం ప్రత్యేక శ్రద్దను చూపుతుందని, ఆర్డీఎస్ సమస్యకు కూడా వైఎస్ పరిష్కారం ఇచ్చేలా రూ.92 కోట్లను మంజూరు చేస్తే, ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేని స్థితిలో ఉందఅన్నారు.

[YSR ] మహిళలపై కేసులు పెట్టించిన ఘనత బాబుదే..



‘‘ దివంగత మహానేత వైఎస్ పాలమూరు ప్రజల ఇబ్బందులు గుర్తించి మేలు చేయాలనే సంకల్పంతో వేలకోట్లు ఖర్చుచేసి నె ట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు కృషి చేశారు. ఆయన హయాంలో 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయితే, ప్రస్తుత పాలకులు మూడేళ్లుగా 20 శాతం పనులు కూడా పూర్తిచేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఆర్డీఎస్‌కు కూడా వైఎస్ నిధులు విడుదల చేస్తే కనీసం సకాలంలో పనులు చేయించేందుకు ఈ పాలకులకు చేతకావడం లేదు. ’’
- పాదయాత్రలో షర్మిల 

- ఉచిత విద్యుత్ కూడా ఎత్తేస్తారేమో..?!
- నిధులున్నా ఆర్డీఎస్ పనులు చేపట్టలేకపోయారు
- దత్తత తీసుకున్న బాబు జిల్లాకు చేసేందేమీ లేదు
- వైఎస్ హయాంలోనే పాలమూరు అభివృద్ధి 
- ‘ మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో షర్మిల 
- అయిజలో షర్మిలకు ఘనస్వాగతం 
- సమస్యలు విన్నవించుకున్న గీత కార్మికులు, బుడగజంగాలు 

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: మన పాలకులు ఏసీ గదుల్లో ఉంటూ ప్రజాసమస్యలు పట్టించుకోకుండా గాలికొదిలేస్తున్నారని, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన ఉచిత విద్యుత్‌ను కూడా మున్ముందు ఈ కాంగ్రెస్ పెద్దలు ఎత్తివేసినా దిక్కులేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోని చేతకాని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హతలేదని, వెంటనే దిగిపోవాలని డిమాండ్‌చేశారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆదివారం వెంకటాపురం స్టేజీ నుంచి యాత్ర ప్రారంభించి అయిజ దాటి ఐదు కిలోమీటర్ల వరకు కొనసాగించారు. 

ఈ సందర్భంగా పర్దిపురం గ్రామంలో షర్మిల మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకోవాలనే ఆలోచన వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉండేదని, అంతే పెద్ద మనసు జగనన్నకు కూడా ఉందని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గీత కార్మికులు షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడినా కూలి గిట్టుబాటు కావడం లేదని దీంతో జీవనం ఎంతో దుర్భరంగా మారిందని తమగోడును వెళ్లబోసుకున్నారు. అదేవిధంగా బుడగజంగం కులస్తులు కూడా తమ సమస్యలు విన్నవిస్తూ కన్నీమున్నీరయ్యారు. 

అనంతరం మండల కేంద్రమైన అయిజలో షర్మిలకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ ముస్లిం సోదరుల పవిత్ర దినమైన మొహర్రం పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలంటే వైఎస్‌కు ప్రత్యేక గౌరవమని అందుకే వారు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో చదువు, ఉద్యోగాల్లో ఐదుశాతం రిజర్వేషన్ కల్పించాలని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలంటే ఎంతో త్యాగధనులని తన తండ్రి రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెబుతుండేవారని గుర్తుచేశారు. తీవ్రమైన కరువు వచ్చి స్థానికంగా పనులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు నెలల తరబడి వలసలు వెళ్తున్నారన్నారు.

జిల్లాను దత్తత తీసుకొని చేసేందేమీ లేదు

చంద్రబాబు నాయుడు హయాంలో జిల్లాను దత్తత తీసుకున్నా ఏనాడు కూడా చిత్తశుద్ధితో జిల్లా ప్రజలను ఆదుకోలేదన్నారు. వైఎస్ హయాంలో పాలమూరు జిల్లాను దత్తత తీసుకోకపోయినా ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను గుర్తించి వేలకోట్లు ఖర్చుచేసి నె ట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన హయాంలో 80 శాతం పనులు పూర్తయితే ప్రస్తుత పాలకులు మూడేళ్లుగా 20 శాతం పనులు కూడా పూర్తిచేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్‌కు కూడా వైఎస్ నిధులు విడుదల చేస్తే కనీసం సకాలంలో పనులు చేయించడానికి కూడా ఈ పాలకులకు చేతకావడం లేదన్నారు.

మహిళలపై కేసులు పెట్టించిన ఘనత బాబుదే..

చంద్రబాబు హయంలో కరెంటు బిల్లులు చెల్లించలేదని ఇంటి వద్ద మగవాళ్లు లేకపోతే మహిళలను స్టేషన్‌లో వేయించి కేసులు పెట్టించాడని, అలాంటి వ్యక్తి తాను ఉచిత విద్యుత్ ఇస్తానంటూ మోసంచేసేందుకు జనం ముందుకు వస్తున్నాడన్నారు. వైఎస్ బతికి ఉంటే రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసేవారని తెలిపారు. జగన్‌కు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మకై జైల్లో పెట్టించాయన్నారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని ప్రతిఒక్కరూ ఆయన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకొని విద్యార్థులను బలితీసుకుంటున్న పార్టీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.