Sunday, 22 April 2012

భవిష్యత్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌దే

నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: భవిష్యత్ అంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజల మనసులో పార్టీకి సుస్థిర స్థానం ఉందని చెప్పారు. పెద బొరిగివలసలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దాసన్న మాట్లాడుతూ, అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ప్రకటనలు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ నాయకులు వివిధ పథకాలను ఎరవేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరిట మంజూరు చేస్తున్న నిధులు, దీపం గ్యాస్ కనక్షన్లు కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో ఇస్తున్నవి కాదని, ప్రజా ధనమేనన్నారు.

ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు మంజూరు చేస్తున్న గ్యాస్ కనెక్షన్లు, ఇతర పథకాలను తీసుకుని ఓటు వేసే ముందు మాత్రం విజ్ఞతతో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు సరైన వ్యక్తో గమనించి ఓటు వేయాలన్నారు. మంత్రి ధర్మాన ప్రభుత్వ ధనాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తున్నారని, తన స్వార్థానికి వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.

గతంలో పేదరికమే ప్రాతిపదికగా లబ్ధిదారుల ఎంపిక జరిగేదని, ప్రస్తుతం మంత్రి అండతో అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలే ప్రాతిపదికగా పథకాలు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటివి ఎన్నాళ్లూ సాగవని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బ్రోకర్లుగా మారారని విమర్శించారు. పార్టీ మండలి కన్వీనర్ పొన్నాన దాలినాయుడు మాట్లాడుతూ ప్రజల మనసులో దాసన్న ఉన్నారని, ఎవరికీ బయపడకుండా పోలింగ్ రోజున వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు.

పొందరి కులసంఘం ప్రతినిధి బెహరా అప్పన్న మాట్లాడుతూ బొరిగివలస అభివృద్ధికి కృష్ణదాస్ ఎంతో కృషి చేశారని, అలాంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పొందరి తవుడు మాట్లాడుతూ కాంగ్రెస్ వారు చేస్తున్న బెదిరింపులకు ఎవరూ బయపడవద్దని, దాసన్నే మన నాయకుడన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరంగి మురళి, తంగుడు గిరి, సురంగి నర్శింగరావు, మార్పు విజయకుమార్, పతివాడ గిరీశ్వరావు, సాసుపల్లి కృష్ణబాబు, మూకళ్ల కృష్ణ, లుకలాపు రవి, పతివాడ గిరీశ్వరరావు,ధర్మాన శేఖర్, వూన్న వెంకటేశ్వరావు, వండాన జోగినాయుడు, విఠల్, సతివాడ రామినాయుడు, ఠాగూర్, పువ్వాడ చంటి పాల్గొన్నారు.

Thursday, 19 April 2012

మబగాం-కిళ్లాం రోడ్డులో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి

సుసరాం-పి.అగ్రహారం రోడ్డులో చిన్నారులను అక్కున చేర్చుకుంటూ...

సుసరాం: జననేతకు నీరాజనం

గంగివలస: జననేతకు సమస్యలు వివరిస్తున్న ఉపాధ్యాయులు

వెదుళ్లవలస: స్థానికులతో మాటామంతి

అవనాపు సూరిబాబు భార్య, కుమారులను ఓదారుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి

అవనాపు సూరిబాబు భార్య, కుమారులను ఓదారుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి

జన తరంగం



త్వరలో ఉపఎన్నికలు జరగనున్న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఈ నెల 15న మొదలైన జననేత ప్రచార యాత్ర బుధవారం రాత్రి (18-04-12) నియోజకవర్గ కేం ద్రంలో జరిగిన భారీ బహిరంగ సభతో ముగి సింది. పజలనుద్దేశించి మాట్లాడుతున్న జననేత జగన్‌మోహన్‌రెడ్డి

మీ కష్టాలన్నీ తీరుతాయి..ప్రజలకు జగన్ భరోసా

మా పార్టీ అధికారంలోకొచ్చాక వృద్ధులకు
రూ.700, వికలాంగులకు రూ.వెయ్యి పింఛను ఇస్తాం
వేటకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారమిస్తాం
పిల్లల్ని బడికి పంపితే తల్లి ఖాతాలో చిన్నారికి
రూ.500 చొప్పున జమచేస్తాం

విశాఖపట్నం, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణయుగం త్వరలోనే మళ్లీ తిరిగొస్తుందని, ఆ ప్రభుత్వంలో మంచి మనసున్న అన్న సీఎం స్థానంలో కూర్చుంటాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆ సువర్ణయుగంలో ప్రజల కష్టాలన్నీ తీరుస్తానని, ప్రతి ఒక్కరి బతుకులు మెరుగు చేస్తానని ఉద్ఘాటించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో గురువారం ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి ఎస్.రాయవరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. జగన్‌ను చూసేందుకు జనం భారీ ఎత్తున రోడ్లపై బారులు తీరారు. జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. విశాఖ జిల్లాలో ఓ మత్స్యకార ప్రతినిధికి అసెంబ్లీకెళ్లే అవకాశం కల్పిస్తానన్నారు. ఈ పర్యటనలో జగన్ వెంట పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు, పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, జిల్లా నేత బొలిశెట్టి గోవింద్ తదితరులున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పలుచోట్ల చేసిన ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ప్రతి ఒక్కరికీ భరోసా..

మా పార్టీ అధికారంలోకొచ్చాక.. ప్రతి అవ్వ, తాత మూడు పూటలా అన్నం తినేలా నెలకు రూ.700 పెన్షన్ అందిస్తాం. వికలాంగుల పింఛను రూ.వెయ్యికి పెంచుతాం. వేటకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తాం. పిల్లల్ని బడికి పంపితే తల్లిదండ్రులకు వారి బ్యాంకు ఖాతాలో చిన్నారికి రూ. 500 చొప్పున జమ చేస్తాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెడతాం. నేను చెప్పే ప్రతి మాటా దివంగత నేత పైనుంచి గర్వపడేలా చేసి చూపిస్తా. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఈ ఫైళ్లన్నింటిపైనా సంతకం చేస్తా.

పేదలు వర్సెస్ కుళ్లు రాజకీయాలు..

చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నేను బుర్ర చెప్పింది పట్టించుకోలేదు.. ప్రజల బాధలెరిగిన దివంగత నేత వైఎస్సార్ ఆశయాల్ని అమలు చేయాలని గుండె చెప్పినట్టు విన్నా.. అందుకే ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రైతులు, పేదలు ఒకవైపు ఉంటే.. కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపు పోటీపడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక, ఫీజు చెల్లించుకోలేని స్థితిలో వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నపుడుగానీ, లక్ష ఎకరాల్లో రైతులు సమ్మెకు దిగినప్పుడుకానీ టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్వాసానికి ముందుకురాలేదు. పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. ప్రభుత్వం పడిపోదని తెలిసే.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను దూరం చేసి ఇబ్బందులు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిసినా.. రైతులు, పేదల పక్షాన నిలిచేందుకే నాడు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయించాం. నా మాటకు విలువిచ్చి, పేదలు, రైతుల కోసం పదవిని సైతం వదులుకున్న గొల్ల బాబూరావును ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుతున్నా.

ఈ నేతలకు బుద్ధి చెప్పాలి..

ఇవాళ ప్రభుత్వ, విపక్ష నేతలు ప్రజలను గాలికొదిలేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 600 మత్స్యకారుల ఇళ్లు దగ్ధమైతే.. అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగానీ, విపక్ష నేత చంద్రబాబుగానీ పరామర్శించిన దాఖలాల్లేవు. ఐదేళ్లకోసారి మాత్రమే రైతులు, పేదల అవసరముంటుందని భావిస్తూ.. పదవుల్ని పట్టుకు వేలాడే ఈ నేతలకు వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చె ప్పాలి. ఈ ఉప ఎన్నికల్లో నచ్చని వారిపై కేసులు, పోలీస్ స్టేషన్లో హింసలకు అధికారపక్షం వెనుకాడదు. దాంతోపాటు మంత్రులంతా డబ్బు మూటలతో మోహరిస్తారు. ప్రజల ఆప్యాయతా, అనురాగాలకు వెలకట్టేందుకు బారులు తీరుతారు. విలువలకు అర్థం తెలియని ఈ నేతలకు, ఢిల్లీ నుంచి రిమోట్‌తో రాష్ట్రాన్ని పాలిస్తున్న వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి.

JAI YCRCP

ఘనంగా విజయమ్మ జన్మదిన వేడుకలు

కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ 56వ జన్మదిన వేడుకలు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. కేక్‌ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. దివంగత నేత వైఎస్ఆర్‌ వెన్నంటే ఉండి మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మహిళల అభివృద్ధికి విజయమ్మ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా వైఎస్ విజయమ్మ జన్మదినోత్సవ వేడుకలను పార్టీ అభిమానులు,కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.

కళింగ కోమట్లను బీసీల్లో చేర్పిస్తా: జగన్ హామీ

నరసన్నపేట,న్యూస్‌లైన్: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న కళింగ కోమట్లను బీసీల్లో చేర్పించేందుకు కృషి చేస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కళింగ కోమటి కుటుంబాలు బీదరికంలో ఉన్న విషయం తనకు తెలుసునన్నారు. తమ పార్టీ అధికార ంలోకి వచ్చిన తరువాత వెనుకబడిన జాబితా ద్వారా చేకూరే ప్రభుత్వ ఫలాలు వీరికి వర్తింపజేస్తానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.దివంగత వైఎస్ కళింగ కోమట్లను బీసీల్లో చేర్పించేందుకు బీసీ కమిషన్ సిఫారుల మేరకు కేబినేట్‌లో ప్రవేశ పెట్టాలని ఆదేశించారని, అయితే సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటంకం వచ్చిందన్నారు. ఆ హామీని తాము అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేరుస్తానని నరసన్నపేటలో బుధవారం సాయంత్రం జరిగిన ఉప ఎన్నికల బహిరంగ సభలో జగన్ హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి హామీకి సంఘ ప్రతినిధులు అంధవరపు సూరిబాబు, ఊన్న వెంకటేశ్వరరావు, రాజశ్రీ, తంగుడు గిరిధరుడు, లాడి కిషోర్, పక్కి దివాకర్, నారా నాగేశ్వరరావులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మబగాంలో జగనన్నకు అఖండ ఆదరణ

పోలాకి, న్యూస్‌లై న్: మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం మబగాంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ ఆదరణ లభించింది. నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి దాసన్న ఇంట్లో జగన్ బస చేశారు. బుధవారం ఇదే గ్రామం నుంచి రోడ్డు షో ప్రారంభమైంది. నాలుగో రోజు పర్యటనకు సన్నద్ధమైన జగన్‌మోహన్‌రెడ్డికి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు కంచు వెంకటరమణ, కింజరాపు కృష్ణమూర్తి, కరిమి రాజేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ కణితి కృష్ణారావులు స్వాగతం పలికారు.

అనంతరం కిళ్లాం మీదుగా ఈదులవలస, రాళ్లపాడు కాలనీ, ఈదులవలస జంక్షన్, రాళ్లపాడు, కింజరాపుపేట, తోటాడ, సంతలక్ష్మీపురం (రోడ్డు), వెదుళ్లవలస, ఇందిరానగర్, పోలాకి ఆస్పత్రి జంక్షన్, మొవగిల్లిపేట, గంగివలస, గంగివలస కాలనీ, చెల్లాయివలస, అంబీరుపేట, సుసరాం, ప్రియాగ్రహారం, బెలమర, పాలవలస, డీఎల్‌పురం, పిన్నింటిపేట, గాతలవలస గ్రామాల్లో జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో జరిగింది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ధర్మాన కృష్ణదాస్ (దాసన్న)ను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, నాయకులు వెంకటరమణ, కణితి తవుడు, పాగోటి అప్పారావు, చింతాడ వెంకటరావు, మెండ ప్రసాదరావు, రెంటికోట త్రినాథరావు, తూలుగు గణపతిరావు, ఈశర్ల పాపినాయుడు పాల్గొన్నారు.

ఉదయించే సూర్యుడుని ఆపడం ఎలా సాధ్యం కాదో...

నరసన్నపేట, న్యూస్‌లైన్:



JAGANANNA PETA---NARASANNA PETA

http://www.sakshi.com/newsimages/contentimages/19042012/jagan-skl19-4-12-4580.jpg

YSRCP VIJAYAM

PRABHANJANAM