Monday, 28 January 2013

[YSR ] నాడు ఆ సంస్థతో ఒప్పందం వద్దని బాబును హెచ్చరించాం


నాడు ఆ సంస్థతో ఒప్పందం వద్దని బాబును హెచ్చరించాం
వినిపించుకోకుండా ఒప్పందం చేసుకున్నారు
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి
ఈఆర్‌సీని కోరిన సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్‌రావు

 రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు, చార్జీల భారాలకు రిలయన్స్ వైఖరే కారణమని సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ చెప్పారు. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో భారీగా గ్యాస్ ఉందని చెప్పి ఇప్పుడు ధర పెంపుకోసం రిలయన్స్ ఉత్పత్తిని తగ్గించిందని మండిపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం-భారాలు-ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై సెంటర్ ఫర్ విద్యుత్ స్టడీస్ (సీపీఎస్) సంస్థ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సదస్సు నిర్వహించింది. 

ఇందులో ఈఏఎస్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరఫరా లేకపోవడం వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయన్నారు. భవిష్యత్తులో గ్యాస్ ధర పెంచితే ఉత్పిత్తి పెంచాలని రిలయన్స్ భావిస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. అప్పుడు ఉత్పత్తి పెరిగినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగి ప్రజలకు భారంగా మారుతుందని స్పష్టంచేశారు. వాస్తవానికి గ్యాస్ లేదని ఆనాడు చంద్రబాబుకు స్పష్టంగా చెప్పామని, ఒప్పందం కుదుర్చుకుంటే నష్టపోతామని హెచ్చరించామన్నారు. అయినా 3,370 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని వివరించారు. ఫలితంగా ఇప్పుడు గ్యాస్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘‘రోజుకు 85 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తానని చెప్పిన రిలయన్స్ సంస్థ... రోజురోజుకీ ఉత్పత్తి తగ్గిస్తోంది. దీంతో అధిక ధరకు మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడుతోంది. ఉన్న విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గించుకుంటే ప్రజలపై భారం మోపాల్సిన అవసరం ఉండదు..’’ అని అన్నారు. 

[YSR ] రేపు ఇడుపులపాయకు జనం సంతకాలు


‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమంలో రెండు కోట్ల మంది ప్రజలు చేసిన సంతకాల ప్రతులను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద భద్రపరచనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. జగన్‌పై ఆదరాభిమానాలతో ప్రజలు చేసిన సంతకాలను ప్రత్యేక పెట్టెల్లో భద్రపరిచామని ఆదివారమిక్కడ వెల్లడించారు. సంతకాల పెట్టెలను తీసుకెళ్లే ఈ యాత్రకు కృతజ్ఞత యాత్రగా పార్టీ నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ కృతజ్ఞత యాత్ర 29వ తేదీ ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమై 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇడుపులపాయకు చేరుతుందన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇడుపులపాయలో వీటిని స్వీకరించి వైఎస్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన గదిలో భద్రపరుస్తారని వివరించారు. కృతజ్ఞతయాత్ర వాహనం 29న హైదరాబాద్ నుంచి బయలుదేరి శంషాబాద్, షాద్‌నగర్, కొత్తకోట, కర్నూలు గుండా అదే రోజు రాత్రికి నంద్యాల చేరుకుంటుంది. మరుసటి రోజు అక్కడి నుంచి బయలుదేరి ఆళ్లగడ్డ, మైదుకూరు, కడప గుండా ఇడుపులపాయ చేరుతుందని గట్టు తెలిపారు.

[YSR ] ముందు నీ కేసులపై విచారణ జరిపించుకో..

వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక అర్హత బాబుకు లేదు
చంద్రబాబు అవినీతి పాలనను ఆయన మరిచిపోయినా.. ప్రజలు మరిచిపోరు
రాష్ట్రంలో నీతి నిజాయతీ లేని దౌర్భాగ్యపు రాజకీయాలకు తెరతీసింది బాబే
చిత్తశుద్ధి ఉంటే.. తన మీదున్న కేసులపై బాబు విచారణ జరిపించుకోవాలి

సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు తన హయాంలో జరిగిన కుంభకోణాలను మరిచిపోయి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తాను మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతిని అంతమొందిస్తానని, సుపరిపాలన అందిస్తానని బాబు కొత్త మాటలు చెబుతున్నారు. 

స్టాంపుల కుంభకోణం, మద్యం ముడుపులు, స్కాలర్‌షిప్‌ల కుంభకోణం, ఏలేరు స్కాం, సోమశిల కుంభకోణం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ... ఇవన్నీ జరిగింది చంద్రబాబు పాలనలో కాదా? చివరకు పేద ప్రజలు చికిత్స చేయించుకునే ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరులో కూడా అవకతవకలు జరిగాయే.. తన పాలన నీతివంతంగా సాగిందని బాబు భ్రమిస్తున్నారా? తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నాను కనుక.. అవన్నీ మర్చిపోయి ఉంటారని చంద్రబాబు భ్రమల్లో ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం మర్చిపోలేదు’ అని రాంబాబు అన్నారు. ‘బాబు జమానా-అవినీతి ఖజానా’ అని సీపీఎం చంద్రబాబుపై పుస్తకాలు ప్రచురించిన విషయం మరిచారా? అని ఆయన గుర్తు చేశారు. తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడ్డారు కనుకనే వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాలేదని బాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. అంటే బెయిల్ లభించిన వారందరూ నిజాయతీపరులని బాబు ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు గానీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత గానీ చంద్రబాబుకు లేవన్నారు. అవినీతి, అక్రమాలకు, అడ్డగోలు రాజకీయాలకు నిలువుటద్దం అయిన బాబు నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. 

ముందు నీ కేసులపై విచారణ జరిపించుకో..

అవినీతిని అంతమొందించే మాట అటుంచి.. చంద్రబాబు తనపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న కేసును తొలుత త్వరితగతిన విచారణకు వచ్చేలా చూసుకోవాలని రాంబాబు అన్నారు. తన మీద వచ్చే కేసులన్నింటిలోనూ స్టేల మీద స్టేలు తెచ్చుకుంటూ బాబు తప్పించుకుంటున్నారని.. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తనమీద ఉన్న పెండింగ్ కేసులన్నింటిపైనా త్వరితగతిన విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో నీతి నిజాయతీ లేని దౌర్భాగ్య రాజకీయాలకు తెరతీసిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ‘భార్యాభర్తలైన లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ మధ్య చిచ్చు పెట్టేందుకు బాబు ప్రయత్నించారు. ఎన్టీఆర్‌పై ఆయన కుమారులు బాలకృష్ణ, హరికృష్ణను పురిగొల్పిన దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు’ అని ధ్వజమెత్తారు. సాక్షాత్తూ తన సొంత సోదరుడైన రామ్మూర్తి నాయుడిపై విచిత్రమైన ఆరోపణలు చేసింది కూడా బాబేనని అన్నారు. 

గత చరిత్ర గుర్తు చేసుకో బాబూ...

ఈరోజు వేలాది కోట్ల రూపాయలకు పడగలెత్తిన చంద్రబాబు ఒక్కసారి వెనక్కి తిరిగి తన గత చరిత్ర ఏమిటో గుర్తు చేసుకోవాలని అంబటి అన్నారు. ‘1978లో రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి బాబుకున్నది రెండెకరాల పొలం మాత్రమే. అంతకు ముందు ఆయన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌తో చదువుకున్నారు. రూ.500 నుంచి 5 వేల వరకూ వైఎస్‌రాజశేఖరరెడ్డి వంటి వారి దగ్గర జేబు ఖర్చులకు తీసుకున్న చరిత్ర చంద్రబాబుది. అలాంటి వ్యక్తి ఏం కష్టం చేసి సంపాదించాడని, వేలకోట్ల రూపాయలు వస్తాయి’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. 

[YSR ] కాంగ్రెస్‌కు టైమ్ దగ్గరపడింది


to ysrcp
జగన్ త్వరలోనే నిర్దోషిగా బయటికి వస్తారు. కాంగ్రెస్ నీచ సంస్కృతి గురించి ప్రపంచమంతా తెలిసిందే. కాంగ్రెస్‌కు ఎవరు అడ్డొస్తే, వారిని అకారణంగా, నిర్దాక్షిణ్యంగా అణచడానికే ప్రయత్నిస్తుంది. అయితే ఆ పార్టీ ఒక విషయం గ్రహించాలి. జగన్ అందరిలాంటి నాయకుడు కారు. జగన్‌ని ఎంత అణచడానికి ప్రయత్నిస్తే, ప్రజలు అంతగా ఆయన్ని ఆదరిస్తారు. కాంగ్రెస్‌ని నిలదీస్తారు. ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. కాబట్టి వైఎస్సార్‌ని అభిమానించే ప్రతి గుండె ధైర్యంగా ఉండాలని నా మనవి. జగన్ నిర్బంధం తాత్కాలికమే. కాంగ్రెస్ పెద్దల మాటలకు లోబడి జగన్‌ని హడావిడిగా అరెస్ట్ చేసింది సీబీఐ. కాని ఎలాంటి అధారాలూ సేకరించలేకపోయింది. కాబట్టి ఏదో ఒకటి సృష్టించి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలని నిర్ధారణకు వచ్చేసింది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. దుష్టశక్తులకు బుద్ధి చెప్పే సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

[YSR ] మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా లీగల్ సెల్ కమిటీలను..


సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదని ఆ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ చిత్తర్వు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. జగన్‌పై అక్రమ కేసులు బనాయించి, వేధించడాన్ని భేటీ తీవ్రంగా ఖండించింది. 

ప్రతి మండల ంలో లీగల్ సెల్ కమిటీ: కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై బనాయిస్తున్న అక్రమ కేసుల విషయంలో న్యాయసహాయం అందించేందుకు వీలుగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా లీగల్ సెల్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, పీఎన్వీ ప్రసాద్‌తో పాటు అన్ని జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ విభాగం కన్వీనర్లు పాల్గొన్నారు. 

[YSR ] ‘నేను బాగున్నా.. నౌ ఐ యామ్ పర్‌ఫెక్ట్..’


‘నేను బాగున్నా.. నౌ ఐ యామ్ పర్‌ఫెక్ట్..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. మరో ప్రజాప్రస్థానంలో షర్మిల మోకాలికి గాయమవడంతో ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. డాక్టర్ల సలహా మేరకు ఆరు వారాల విశ్రాంతి అనంతరం తదుపరి వైద్య పరీక్షల కోసం శనివారం ఆమె అపోలో ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు షర్మిల మోకాలికి ఎంఆర్‌ఐ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డిలు షర్మిల ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించారు. ‘‘షర్మిల మోకాలి గాయం తగ్గింది. మోకాలి లోపలి భాగంలో ఉండే లిగమెంట్ సాధారణ స్థితికి చేరుకుంది. 

ఆమె నడక ప్రారంభించవచ్చు. కానీ కొన్ని సూచనలు పాటించాలి. ఉదయం, సాయంత్రం ఫిజియోథెరిపీ చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పారు. మరోవైపు షర్మిల త్వరలో పాదయాత్రను మొదలుపెట్టాలనే ఆలోచనతో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. మరో ప్రజాప్రస్థానం పునఃప్రారంభంపై పార్టీలో చర్చించి రెండు మూడు రోజుల్లో తేదీని ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు కావొచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ డాక్టర్ల విభాగం కన్వీనర్ గోసుల శివభరత్‌రెడ్డి తదితరులున్నారు.

[YSR ] 2014 ఎన్నికల కోసమే ఈ హైడ్రామా అంతా .


2014 ఎన్నికల కోసమే ఈ హైడ్రామా అంతా
కుట్రలతో తెలుగు ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటు సీమాంధ్రలోనూ, అటు తెలంగాణ ప్రాంతంలోనూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తెలుగు ప్రజల్ని చంపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శనివారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసలు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశానికి ఎందుకు పిలిచిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరైతే సురేష్‌రెడ్డి మాట్లాడాక సీమాంధ్ర ప్రతినిధి గాదె వెంకటరెడ్డి మాట్లాడే ప్రయత్నం చేయబోగా ఒకరితో మాట్లాడాం చాలని షిండే అన్నారని తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ 28 తరువాత నుంచి రెండు ప్రాంతాల్లో అలజడి, అభివృద్ధి నిరోధక శక్తులు పెరిగిపోయాయని చెప్పారు. హోంమంత్రి షిండే నెలరోజుల్లోగా తెలంగాణపై తమ అభిప్రాయం చెబుతామని అన్నారని, చివరికి చెప్పాల్సిన తేదీ సమీపిస్తున్నప్పుడు ఆయన మాట్లాడకుండా ఆజాద్‌తో మాట్లాడిస్తున్నారన్నారు. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం లాగా కేంద్ర ప్రభుత్వ చెలగాటంతో రాష్ట్రప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 28 ప్రకటన తరువాత సమస్యలన్నింటికీ ఫుల్‌స్టాప్ పడుతుందని, ఏదో ఒక పరిష్కారంతో రెండు ప్రాంతాల్లో ప్రశాంతత నెలకొంటుందని భావించామని, దీనికి భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నారు. జై ఆంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరినప్పుడు నాడు ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రకటన చేసి ఉద్యమంపై నీళ్లు చల్లారని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు సోనియాగాంధీతో ఎందుకు ప్రకటన చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. నిజంగా రాష్ట్రాభివృద్ధి కోరుకున్నవారైతే అలా ప్రకటన చేయించి, రెండు ప్రాంతాల ఉద్యమాలపై నీళ్లు చల్లవచ్చు కదా అన్నారు. కుట్రలతో తెలుగుప్రాంత అభి వృద్ధిని అడ్డుకుంటున్నారన్నా రు. 

తెలంగాణ నేతలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, గుత్తా, కేకే, రాజయ్య, మరికొందరు తెలంగాణ నేతలు సీమాంధ్ర నేతల్ని ఇష్టానుసారంగా తిడుతున్నారని, సీమాంధ్రనేతలంతా దొంగలని, దోపిడీదారులని మాట్లాడుతున్నారని, కొందరైతే ఇంకో అడుగు వుుందుకేసి సీమాంధ్ర నేతలు ఢిల్లీలో రేపిస్టులకన్నా ఘోరంగా ఉన్నారని మాట్లాడుతున్నారని చెప్పారు. సీమాంధ్ర నేతలు లగడపాటి, ఉండవల్లి, టి.జి. వెంకటేష్, శైలజానాథ్, జోగి రమేష్, మల్లాది విష్ణులు తెలంగాణనేతలను రజాకారులంటూ దూషిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ జీరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఎప్పుడో పోయిందని, ఇటు సీమాంధ్ర ప్రాంతంలోనూ, అటు తెలంగాణ ప్రాంతంలోనూ కాంగ్రెస్‌కు ఏమాత్రం ప్రజాదరణ లేదని, అందుకే అధిష్టానం విద్వేషాల ద్వారా ఓ ప్రాంతంలోనైనా ఓట్లు పొందవచ్చని, ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ హైడ్రామా అంతా 2014 ఎన్నికల కోసమేనన్నారు. రాష్ట్రంలో సక్రమపాలన రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఒక్క జగన్‌తోనే సాధ్యమని 8 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని, దీన్ని ఓర్వలేక జగన్‌ను అణచివేయాలని, రాష్ట్రంలో అశాంతిని పెంచాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. 

తెలుగుప్రజల మధ్య అలజడి సృష్టించి, ఆ అలజడితో ఓట్లు ఏరుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌పార్టీ తెలుగు ప్రజలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌పార్టీ అభిప్రాయం ఏమిటి, అసలు రాష్ట్ర విభజన జరుగుతుందా, లేక సమైక్యంగా ఉంటుందా, ప్యాకేజీలతో అభివృద్ధి చేస్తారా అనే దానిపై స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్ని కుట్రలు జరిగినా జగన్‌కున్న ప్రజాదరణ ఆపలేరని, ప్రజలతో ఆడుకోవడం ఇకనైనా మానుకుని సమస్యలకు పరిష్కారం చూపిం చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజకీయ లబ్ధికోసమే పాకులాడుతోందని,అసలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భవించాక ఘోరంగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీయేనని అంబటి పేర్కొన్నారు.